బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

'ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టిన 'భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌' (బీసీసీఎల్‌)

Posted On: 24 AUG 2021 6:12PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల 'కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ' ప్రారంభించిన 'వృక్షారోపణ్‌ అభియాన్‌-2021'లో భాగంగా, కోల్‌ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) అనుబంధ సంస్థ అయిన 'భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌' (బీసీసీఎల్‌) కూడా తన సంస్థ ప్రాంగాణాల్లో మొక్కలు నాటే భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. 'ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

    వివిధ ప్రాంతాల్లో బీసీసీఎల్‌కు ఉన్న గనులు, వాషరీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి, 5,225 మంది పాల్గొన్నారు.

    ముఖ్య నిఘా అధికారి శ్రీ కుమార్ అనిమేష్; డైరెక్టర్ (సాంకేతికత) ఆపరేషన్స్ శ్రీ చంచల్ గోస్వామి; డైరెక్టర్ (సిబ్బంది) శ్రీ పీవీకేఎం రావు, జనరల్ మేనేజర్లు, ప్రధాన కార్యాలయాల అధిపతులు హాజరై, కార్యాలయ ఆవరణల చుట్టూ విభిన్న రకాల మొక్కలు నాటారు. డైరెక్టర్ (ఆర్థిక) ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంటీ హాస్టల్‌లో కూడా ఏర్పాట్లు చేశారు. నిర్వహణ శిక్షణార్థులు (మేనేజ్‌మెంట్ ట్రైనీలు) కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ధన్‌బాద్‌కు చెందిన ప్రముఖుల సమక్షంలో బీసీసీఎల్‌కు చెందిన 58 ప్రదేశాలలో 17,570 మొక్కలు నాటారు. స్థానిక ప్రజలకు మరో 16,500 మొక్కలు పంపిణీ చేశారు.

    కోవిడ్-19 జాగ్రత్తలు పాటించేలా నిర్ధరించడానికి, ఈ 58 ప్రాంతాల్లోని ఎక్కువ ప్రదేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రధాన కార్యక్రమానికి జత చేశారు.

 

***
 (Release ID: 1748863) Visitor Counter : 161