ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలలో కోవిడ్ టీకా అందుబాటుపై తాజా సమాచారం
రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 57.15 కోట్లకు పైగా టీకా డోసులు
సరఫరాలో ఉన్న డోసులు కోటికి పైనే
Posted On:
24 AUG 2021 11:17AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయటంతో బాటు విస్తరించింది. జూన్ 21న సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరిన్ని టీకా డోసులు అందుబాటులో ఉంచటం ద్వారా టీకాలివ్వటాన్ని బాగా పెంచింది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించేలా టీకా డోసుల అందుబాటుపై ముందస్తు సమాచారం ఇస్తూ సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేసింది
దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అండగా నిలబడి టీకా మందును ఉచితంగా అందిస్తోంది. సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్త దశలో భాగంగా కేంద్రం దేశంలో తయారయ్యే టీకా మందు డోసులలో 75% మేరకు ఉచితంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందిస్తోంది
టీకా డోసులు
|
2021, ఆగస్టు 24 న
|
సరఫరా చేసినవి
|
57,15,22,580
|
సరఫరాలో ఉన్నవి
|
1,00,84,700
|
అందుబాటులో ఉన్న నిల్వ
|
3,29,58,715
|
కేంద్రం ఇప్పటిదాకా 57.15 కోట్లకు పైగా (57,15,22,580) ) టీకా డోసులు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చింది. మరో 1,00,84,700 డోసులు సరఫరాలో ఉన్నాయి. ఈ ఉదయం 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం 3.29 కోట్లకు పైగా (3,29,58,715) డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర, ప్రైవేట్ ఆస్పత్రుల దగ్గర ఇంకా ఉన్నాయి.
***
(Release ID: 1748493)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada