జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

సమతుల్య నీటి సరఫరాతో నగరాల సమగ్ర అభివృద్ధి అనే అంశంపై స్టాక్ హోల్మ్ జల వారోత్సవాల తొలి రోజున జరిగిన సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్


గంగా నది వెంబడి ఉన్న నగరాలు, గ్రామాలు,పట్టణాలు జల వనరులను పునరుద్ధరించాలి

Posted On: 23 AUG 2021 8:45PM by PIB Hyderabad

స్టాక్ హోల్మ్ జల వారోత్సవాలలో భాగంగా సమతుల్య నీటి సరఫరాతో నగరాల సమగ్ర అభివృద్ధి అనే అంశంపై సేఫ్ వాటర్ నెట్‌వర్క్ యూఎస్ ఎయిడ్ప్రపంచ వనరుల సంస్థఇండియా ఈ రోజు సంయుక్తంగా సదస్సును నిర్వహించాయి. సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా  డైరెక్టర్ జనరల్  శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా నగరాలలో జల వనరులపై సానుకూల దృక్పధం ఏర్పడడానికి అమలు చేయాల్సిన చర్యలను వివరించారు.సేఫ్ వాటర్ నెట్‌వర్క్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పూనం సేవక్ సదస్సులో పాల్గొంటున్న వక్తలు పరిచయం చేసి నగరాల్లో సమతుల్య నీటి సరఫరా అవసరాన్ని దీనికి ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. 

సమతుల్య  నీటి సరఫరాతో నగరాల సమగ్ర అభివృద్ధి ఈ టూల్ కిట్ ను సదస్సులో విడుదల చేశారు. నగరాల్లో  జల వనరులపై సానుకూల దృక్పధం కల్పించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే అంశంలో ఉపయోగపడే ఏడు నమూనాలను, 29 పరికరాలను దీనిలో పొందుపరిచారు. పట్టణ స్థానిక సంస్థల్లో సమతుల్య నీటి సరఫరా యాజమాన్య విధానాల రూపకల్పనకు ఇవి ఉపయోగపడతాయి. 

గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ ( అమృత్-II) శ్రీ వి. పి. సింగ్ పట్టణ ప్రాంతాల్లో నీటి నిర్వహణ అంశాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాధాన్యతను వివరించారు. నగర స్థాయిలో అమృత్ I,II దశల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు. 

పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ (2021 లో వాటర్ ప్లస్ సిటీ గా  గుర్తించబడింది) లో నీటి భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యతను  హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్  సివరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం. దాన కిషోర్ వివరించి దీనిలో ఎదురవుతున్న సమస్యలు వివరించారు.జల వనరుల వినియోగ సామర్థ్యాన్ని ఎక్కువ చేసే అంశంలో నాయకత్వ సమస్య ప్రధాన సమస్యగా ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో దీనిని అధిగమించడానికి యాప్ సహాయంతో సమాజ స్థాయిలో 14000 మందిని సిద్ధం చేశామని ఆయన తెలిపారు. వర్షం నీటిని నిల్వ చేయడం, నీటి లభ్యత లాంటి అంశాలలో వారికి శిక్షణ ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించి స్వీయ నియంత్రణ విధానాలు అమలు జరిగేలా చూస్తున్నామని తెలిపారు. 

  నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా  డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గంగా నది పునరుజ్జీవనంపునరుద్ధరణ మరియు గంగా పర్యవేక్షణ కోసం అమలు చేస్తున్న చర్యలను వివరించారు. గంగా నది వెంబడి ఉన్న నగరాలు, గ్రామాలు,పట్టణాలు జల వనరులను పునరుద్ధరింప వలసి ఉంటుందని ఆయన అన్నారు.   యొక్క సంపూర్ణ దృష్టిని వివరించడం ద్వారానీటి వనరులు  నదీతీర వ్యవస్థ, ప్రకృతి అంశాలపై   దృష్టి సారించి నమామి గంగ మిషన్ ను సమగ్రంగా అమలు చేస్తున్నామని అన్నారు.  నదులతో కలసి జీవించడం అలవాటు చేసుకుంటూ  నగరాలు మరియు పట్టణ  అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన జరగాలని అన్నారు.ఇవి  సున్నితమైన జల వనరులకు ప్రాధాన్యత ఇస్తూ దీర్ఘ కాలం మనుగడ సాగించేలా ఉండాలని ఆయన అన్నారు.

నమామి గంగ పథకంలో భాగంగా  వ్యర్ధ జలాలను శుద్ధి చేయడానికి  అభివృద్ధి చేసిన ఎస్టీపీల పనితీరును గమనించి వాటిని పర్యవేక్షించాడనికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇదివరకు ఈ విధానాన్ని నిర్మాణ సమయంలో మాత్రమే వినియోగించేవారు. పూర్తి స్థాయిలో వినియోగిస్తున్న ఈ విధానాన్ని గంగ ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వినియోగించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో  ఎస్టీపీలను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ను ఉపయోగించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వృత్తాకార ఆర్థిక వ్యవస్థను అమలు చేస్తూ నదులను అంతర్భాగంగా నగర ప్రణాళికలను  రూపొందించాలని ఆయన సూచించారు. నదులు,  సరస్సుల పరీవాహక ప్రాంతాలను పునరుద్దరించే అంశంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. 

రక్షిత మంచి నీరు, పారిశుధ్య పరిస్థితులకు ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య నగరాలను అభివృద్ధి చేసే అంశంలో తమ సంస్థ ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నదని యూఎస్ ఎయిడ్ ప్రతినిధి శ్రీ ఆనంద్ రుద్ర తెలిపారు. 2022 నాటికి 15మిలియన్ల స్థిరమైన మరియు సురక్షితమైన నీరు మరియు పరిశుభ్రత సేవలను అందించడానికి ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు. పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేయడంపారిశుధ్య సౌకర్యాలను మెరుగు పరచడంజల వనరుల సమగ్ర వినియోగ విధానానికి రూపకల్పన చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన వివరించారు.    

నీటి వనరుల మీద వాతావరణ మార్పు ప్రభావం తగ్గించడం నగరాలకు ఇతర ప్రాంతాలతో సంబంధం కల్పించడం ఆవిష్కరణ మరియు సామర్ధ్యం పెంపుదలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్ట్ లను అమలు చేస్తున్నామని  ప్రపంచ వనరుల సంస్థ ప్రతినిధి  శ్రీ సామ్రాట్ బాసక్ వివరించారు. ఈ విధానం ఐపీసీసీ కోడ్ రెడ్ నివేదికతో సమానంగా ఉందని అన్నారు. 

ప్రశ్నోత్తరాల సమయంలో నమామి గంగ కార్యక్రమంలో డిజిటల్ పర్యవేక్షణ పాత్రపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన    శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రాను మాన్యువల్ మరియు రియల్ టైమ్ మానిటరింగ్ విధానాల ద్వారా  ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నామని  వివరించారు.పనితీరు ఆధారంగాఅమలు చేస్తున్న విధానాలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.  సమగ్ర ప్రణాళిక మరియు సహకారం ద్వారా నగరాలను జల వనరులకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేయాలని సదస్సు సూచించింది.  

 

***



(Release ID: 1748434) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi