పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

దేశంలో అభివృద్ధి చెందిన, విద్యావంతులైన, సాధికారత కలిగిన పంచాయతీల తయారీకి ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరిన - శ్రీ గిరిరాజ్ సింగ్


మహిళలే పంచాయతీల బలం కాగలరన్న - శ్రీ గిరిరాజ్ సింగ్

‘ఆకలిని తీర్చడంలో పంచాయతీల పాత్ర’ అనే అంశంపై జరిగిన - జాతీయ వెబినార్

Posted On: 23 AUG 2021 5:56PM by PIB Hyderabad

యు.ఎన్.డి.పి. నిర్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం, దేశంలో అభివృద్ధి చెందిన, విద్యావంతులైన, సాధికారత కలిగిన పంచాయతీల తయారీకి ప్రతిజ్ఞ తీసుకోవాలని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ పంచాయతీల ప్రతినిధులను కోరారు. ‘ఆకలిని తీర్చడంలో పంచాయతీల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ వెబినార్ లో కేంద్ర మంత్రి ప్రసంగించారు.  "ఆజాదీ-కా-అమృత్ మహోత్సవ్" వేడుకల్లో భాగంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ వెబినార్‌ ను నిర్వహించింది.

పంచాయితీలు ముందుగా ఆకలి సవాళ్లను స్వీకరించాల్సిన అవసరం ఉందనీ, ఆ పైన "ఆకలిని తీర్చే - జీరో హంగర్" లక్ష్యాన్ని సాధించడానికి తమ శాయశక్తులా కృషి చేయాలనీ, శ్రీ గిరిరాజ్ సింగ్ అన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, పంచాయతీల సాధికారత కోసం నిధుల కేటాయింపులు గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు.  ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు, ఆయన తెలియజేశారు. 

"పంచాయితీ రాజ్ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం, వాటిని స్వావలంబన దిశగా మార్చడం ఇప్పుడు మన విధి." అని ఆయన పేర్కొన్నారు. 

స్వయం సహాయక బృందాల పాత్రను, శ్రీ సింగ్ ప్రశంసిస్తూ, వివిధ ప్రభుత్వ పథకాల అమలు ప్రణాళికలో స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలను భాగస్వామ్యం చేయాలని పంచాయితీలను కోరారు.  మహిళలు దేశ ఆర్థిక శక్తిగా మారుతున్నారని, వారు పంచాయతీలకు కూడా బలం చేకూరుస్తారని  ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలను నిలిపివేయాలని మంత్రి నొక్కిచెప్పారు.  ఇందు కోసం, భారత ప్రభుత్వం అమలు చేస్తున్న రూర్బన్ మిషన్‌ ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పంచాయితీలను కోరారు.

పంచాయితీలు గ్రామ రూపురేఖలను మార్చగలవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ పేర్కొన్నారు.  ఆధునిక వ్యవసాయ పద్ధతులను చేపట్టడానికి వీలుగా, యువతను ప్రోత్సహించాలని ఆయన నొక్కి చెప్పారు.  ఇది పేదరికాన్ని నిర్మూలించడంలో గొప్పగా సహాయపడుతుంది.  ఇతర మంత్రిత్వ శాఖలు కూడా, తమ వివిధ పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి పంచాయతీలతో సహకరించాలని ఆయన కోరారు.

గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు, వారికి ఆర్థికంగా స్వావలంబన కల్పించడంలో స్వయం సహాయక బృందాల పాత్రపై కేంద్ర రాష్ట్ర మంత్రి శ్రీ ఫగ్గన్‌సింగ్ కులస్తే నొక్కిచెప్పారు. 

సదస్సు ప్రారంభంలో, కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ ప్రసంగిస్తూ, పంచాయితీలను తమ భూభాగంలో ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చూసుకోవాలని కోరారు. స్థానికంగా, ప్రజా పంపిణీ వ్యవస్థ సరైన రీతిలో పనిచేసేలా చూడడం కూడా పంచాయతీల పాత్ర అని ఆయన పేర్కొన్నారు. 

ఒక రోజంతా జరిగిన ఈ వెబినార్‌లో, వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, ప్రపంచ ఆహార కార్యక్రమం, యు.ఎన్.డి.పి. ప్రతినిధులు పాల్గొని,  తగినంతగా ఆహార ఉత్పత్తి, ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తి, ప్రజా పంపిణీ, ఆహార ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ నష్టాన్ని తగ్గించడం, పోషక భద్రత,  2030 నాటికి ఆకలిని తీర్చడాన్ని (జీరో హంగర్) సాధించడంపై ఆధారపడిన సాంకేతిక పరిష్కారాల పరపతి వంటి క్లిష్టమైన సమస్యలు / విషయాలపై వారి అభిప్రాయాలను సమర్పించారు. 

మూడు అంచెల పంచాయితీలు కూడా పెద్ద సంఖ్యలో వెబినార్‌కు హాజరయ్యాయి.

 

*****



(Release ID: 1748425) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi , Punjabi