గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భూవిజ్ఞ‌ానం రంగం లో సహకారం కోసం భారతదేశాని కి, యునైటెడ్స్టేట్స్ ఆఫ్ అమెరికా కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపినమంత్రిమండలి


ఈఒప్పందం తో హిమాలయ తూర్పు ప్రాంతానికి మరియు లద్దాఖ్ లో పాతాళ సంబంధి భూగర్భవిజ్ఞానాన్ని అన్వేషించడం లో ప్రోత్సాహం లభించనుంది

Posted On: 18 AUG 2021 4:16PM by PIB Hyderabad

భూ విజ్ఞాన రంగం లో సహకారానికి సంబంధించి భారత గణతంత్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ లో భాగం గా ఉన్న భూవైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ (జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-జిఎస్ఐ) కి మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ అర్థ్ ఎండ్ ఎన్ వైరన్ మెంట్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్సెస్ ఎండ్ ఎడ్యుకేశన్ పక్షాన ఫ్లోరిడా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (ఎఫ్ఐయు) ధర్మకర్త ల మండలి కి మధ్య ఒక అవగాహన ఒప్పంద పత్రం పై సంతకాలు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన ఆమోదాన్ని తెలిపింది.

ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం తాలూకు రెండు పక్షాల మధ్య సహకారం కోసం గుర్తించిన రంగాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

  • . భారతదేశం-ఏశియా తాలూకు కొలిజనల్ మార్జిన్ లో పోస్ట్ కొలిజన్ మేగ్మేటిజమ్ తాలూకు భూగర్భ మరియు టెక్టనిక్ ఇన్ వైరన్ మంట్, ఇంకా హిమాలయ తూర్పు ప్రాంత భూగర్భ చరిత్ర, సిన్ టాక్సిస్ తో ముడిపడ్డ భూగర్భ జ్ఞానాన్ని అభివృద్ధిపరచడం, దానికి సంబంధించిన పరిశోధన లు.
  • . పోస్ట్ కొలిజనల్ మేగ్మేటిక్ ప్రాంతాలు (లద్దాఖ్ లో పాతాళ సంబంధి భూ గర్భ విజ్ఞానాన్ని) వికసింపచేయడం తో ముడిపడినటువంటి ప్రాంతీయ భూవైజ్ఞానిక, భూ-రసాయనిక, శైల విజ్ఞాన సంబంధి మరియు బహు-సమస్థానిక (మల్టి-ఐసోటోపిక్) అధ్యయనం తాలూకు రంగాల లో సహకార పూర్వక పథకాల ను అభివృద్ధిపరచడం
  • . సాంకేతిక విజ్ఞానం మరియు భూ వైజ్ఞానిక సమాచార నిధి కి సంబంధించిన సూచనల ను ఇచ్చి పుచ్చుకోవడం
  • . ఇరు పక్షాలు ఖరారు చేసే పరస్పర ప్రయోజనాల తో ముడిపడినటువంటి ఇతర రంగాలు.

లాభాలు:

ఈ ఎమ్ఒయు భూ విజ్ఞానం రంగం లో సహకారానికి సంబంధించి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) కి, ఫ్లోరిడా అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి (ఎఫ్ఐయు) మధ్య ఒక సంస్థాగత యంత్రాగం ఏర్పాటు కు మార్గాన్ని సుగమం చేస్తుంది.

ఉద్దేశ్యాలు:

ఈ అవగాహనపూర్వక ఒప్పందం తాలూకు ఉద్దేశ్యాలు ప్రత్యేకించి భారతదేశం-ఏశియా యొక్క కొలిజన్ మార్జిన్ లో పోస్ట్-కొలిజనల్ మేగ్మేటిజం తాలూకు నిర్మాణం మరియు దాని విస్థాపన తో ముడిపడిన భూగర్భ మరియు టెక్టనిక్ ఇన్ వైరన్ మంట్ ను అర్థం చేసుకోవడం, ఇంకా సాధారణం గా మహాద్వీపం లో డీ కొనే ప్రపాంతాల లో పోస్ట్ –కొలిజనల్ మేగ్మేటిజం యొక్క ఉత్పత్తి తాలూకు ఒక నమూనా ను తయారు చేయడం, ఇంకా హిమాలయ తూర్పు ప్రాంత భూగర్భ చరిత్ర మరియు టెక్టనిక్ స్ ను నిర్మించడమూ ను.

దీనిలో సాంకేతిక విజ్ఞానం మరియు భూ వైజ్ఞానిక డేటా కు సంబంధించిన సూచనల ను ఇచ్చి పుచ్చుకోవడం; భారతదేశం-ఏశియా యొక్క కొలిజనల్ మార్జిన్ లో పోస్ట్-కొలిజనల్ మేగ్మేటిజమ్ తో ముడి పడ్డ భూగర్భ మరియు టెక్టనిక్ ఇన్ వైరన్ మంట్ కు సంబంధించిన భూ వైజ్ఞానిక జ్ఞానాన్ని అభివృద్ధిపరచడమూ, పరిశోధించడమూను; హిమాలయ తూర్పు ప్రాంత భూగర్భ చరిత్ర మరియు టెక్టనిక్ స్ నిర్మాణం; ఇంకా పోస్ట్ కొలిజనల్ మేగ్మేటిక్ ప్రాంతాలు (లద్దాఖ్ లోని పాతాళ శైలాల) ను అభివృద్ధిపరచడానికి సంబంధించిన ప్రాంతీయభూ వైజ్ఞానిక, భూ-రసాయనిక, శైల విజ్ఞాన సంబంధి మరియు బహు-సమస్థానిక అధ్యయనాల రంగం లో సహకారపూర్వక పథకాల ను వికసింపచేయడం వంటి కార్యకలాపాలు కలసి ఉంటాయి.

 

***


(Release ID: 1747154) Visitor Counter : 170