సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు, భూమి క్షయం నివారణ లక్ష్యంతో లేహ్-లడఖ్ ప్రాంతాన్ని చేరుకున్న కెవిఐసికి చెందిన ప్రాజెక్ట్ బోల్డ్ (బిఒఎల్‌డి)
Posted On:
18 AUG 2021 3:10PM by PIB Hyderabad
చారిత్రాత్మక చర్యలో భాగంగా, ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) లేహ్ -లడఖ్ హిమాలయ భూభాగాలలోని బంజరు భూములపై పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి తొలిసారి వెదురు మొక్కలను నాటే చొరవకు బుధవారం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ, చుచోట్ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న 2.50 లక్షల చదరపు అడుగుల బంజరు అటవీ భూమిలో కెవిఐసి, లేహ్-లడఖ్ అటవీ శాఖ సంయుక్తంగా ఐటిబిపి మద్దతుతో 1000 వెదురు మొక్కలను నాటారు. వెదురు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కెవిఐసి చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా గ్రామ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచి, ఐటిబిపి అధికారుల సమక్షంలో ప్రారంభించారు.
కెవిఐసి బహుమానంగా ఇచ్చిన న20 ప్రత్యేక వెదురు మొక్కలను లేహ్ లోని తమ ఆవరణలో భారతీయ సైన్యం నాటిన మూడు రోజుల అనంతరం ఈ పరిణామం సంభవించింది.కెవిఐసి ప్రారంభించిన బిఒఎల్‌డి (BOLD) (వెదురు, కరువును ఎదుర్కొంటున్న భూముల్లో పచ్చదనం) అన్న ప్రాజెక్టు కింద వెదురు మొక్కలను నాటారు. ఎడారిని నివారించడం, భూమి, పర్యావరణ రక్షణ, ఆహార భద్రతకు హామీ ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపుకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపొందింది. ఆజాదికా అమృత మహోత్సవ్ ను జరుపుకునేందుకు రూపొందించిన ఖాదీ బాంబూ ఫెస్టివల్ లో ప్రాజెక్టు బోల్డ్ ఒక భాగం.
లేహ్ లోని ఈ వెదురు ప్రాంతం స్థానిక గ్రామీణ, వెదురు ఆధారిత పరిశ్రమలకు మద్దతునివ్వడం ద్వారా నిలకడైన అభివృద్ధి నమూనాను సృష్టిస్తుంది. అక్కడ ఉన్న బౌద్ధ విహారాలలో ఉపయోగించే అగరబత్తిలో పెద్ద మొత్తాలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. ఈ వెదురు చెట్లు లేహ్ లో స్థానిక అగరబత్తి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, ఫర్నిచర్, చేతిపనులు, సంగీత వాద్యాలు, కాగితపు గుజ్జు వంటి వెదురు ఆధారిత పరిశ్రమలకు ఊతంగా ఉంటూ, స్థానికులకు నిలకడైన ఉపాధిని సృష్టిస్తుంది. వెదురు వ్యర్ధాలను కాల్చిన బొగ్గును, ఇంధన దిమ్మలు (fuel briquette )ను తయారు చేసేందుకు ఉపయోగించవచ్చు. ఇది లేహ్ లో తీవ్రమైన శీతాకాలంలో ఇంధనానికి లోటు లేకుండా అందుబాటులో ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా, ఇతర మొక్కలకన్నా 30% ఎక్కువగా ఆక్సిజన్ ఉద్గారాలను వెదురు మొక్కలు వెలువరుస్తాయి. ఇది ఆక్సిజన్ ఎప్పుడూ తక్కువగా ఉండే ఎత్తైన ప్రాంతాలలో ఇది అదనపు లబ్ధి అవుతుంది.
ఈ ప్రాంతంలో గల క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా, లేహ్ లో వెదురు మొక్కలు నాటడమనే ప్రయోగం సవాళ్ళతో కూడిన పని అని కెవిఐసి చైర్మన్ సక్సేనా చెప్పారు. కొన్ని వందల సంవత్సరాలుగా లేహ్ లో విస్త్రతమైన ప్రాంతం నిరుపయోగంగా పడి ఉంది. ఫలితంగా, అనేక ప్రాంతాలలో నల్లమట్టి/ నేల కూడా రాళ్ళుగా మారింది. ఈ కారణంగా వెదురు మొక్కల కోసం గుంతలు తవ్వడం అన్నది కెవిఐసికి అత్యంత సవాలుగా మారిందన్నారు. వెదురు మొక్కల వేళ్ళు ఈ మెత్తటి నేలలో పెరిగేందుకు, గుంతలు తవ్వే సమయంలో ఈ ఘనీభవించిన మట్టి ముద్దలను నలగ్గొట్టి, మొక్కలు నాటేందుకు తీసిన గుంతలలో నింపామని ఆయన వివరించారు.
అదనంగా, లేహ్ లో వెదురు మొక్కలు నాటేందుకు వర్ష రుతువును ఎంచుకున్నామని, తద్వారా మొక్కలు తమ వేళ్ళ వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు తగిన సమయం దొరుకుతుందన్నారు. ఈ వ్యవస్థ బలపడి, రానున్న నెలల్లో అక్కడ కురిసే మంచు, గడ్డకట్టించే గాలులను తట్టుకునేందుకు ఇది తోడ్పడుతుందని సక్సేనా వివరించారు. ఇప్పుడు నాటిన వెదురు మొక్కలలో 50 నుంచి 60శాతం వాటికి తట్టుకుని నిలబడినా, కెవిఐసి లేహ్-లడఖ్ ప్రాంతంలో వచ్చే ఏడాది పెద్ద ఎత్తున వెదురు మొక్కల పెంపకాన్ని కెవిఐసి చేపడుతుందని తెలిపారు.
ప్రాజెక్ట్ బోల్డ్ కింద ఇప్పటి వరకూ కెవిఐసి మూడు ప్రదేశాలు - ఉదయ్‌పూర్ లోని నిచ్లా మాండ్వా, అహ్మదాబాద్‌లోని ధొలేరా గ్రామంలో, జయసల్మేర్ లోని తనోత్ గ్రామంలో, లేహ్ లోని చుచోత్ గ్రామంలోని 17.37 లక్షల చదరపు అడుగుల మెట్ట భూములలో 12,000 వెదురు మొక్కలను (లేహ్ లో నాటిన 1000తో సహా) నాటింది.
***
(Release ID: 1747141)
Visitor Counter : 216