శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డీబీటీ-–బిరాక్ మద్దతుతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన మొదటి నాసికా వ్యాక్సిన్ 2/3 దశల ప్రయోగాల కోసం రెగ్యులేటర్ ఆమోదం వచ్చింది.
Posted On:
13 AUG 2021 5:57PM by PIB Hyderabad
బయో టెక్నాలజీ విభాగం (డీబీటీ) దీని పీఎస్యూ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీరాక్) ప్రపంచవ్యాప్త సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాక్సిన్ డెవలప్‌మెంట్, డయాగ్నస్టిక్స్, డ్రగ్ రీపర్పసింగ్, థెరపీటిక్స్ టెస్టింగ్ కోసం ఆర్ అండ్ డీ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి కలిసి వ్యూహరచన చేశాయి. వ్యాక్సిన్‌ల అభివృద్ధికి బయోటెక్నాలజీ విభాగం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది.
మూడవ ఉద్దీపన ప్యాకేజీ ఆత్మనిర్భర్ 3.0 లో భాగంగా కోవిడ్ - వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, వేగవంతం చేయడానికి మిషన్ కోవిడ్ సురక్ష ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ లక్ష్యం.. ఆత్మనిర్భర్ భారత్‌పై దృష్టి సారించి పౌరులకు సురక్షితమైన, సమర్థవంతమైన, సరసమైన అందుబాటులో ఉండే కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా అందించడడం. అంతేగాక వేగవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న వనరులను యుద్ధప్రాతిపదికన ఏకీకృతం చేసి క్రమబద్ధీకరించడడం కూడా.
భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ 2/3 దశల పరీక్షలకు రెగ్యులేటరీ ఆమోదం పొందిన మొట్టమొదటి నాసికా టీకా. భారతదేశంలో మానవులపై క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ఆమోదం పొందిన మొదటి కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇదే. బీబీవీ154 వ్యాక్సిన్.. ఇంట్రానసల్ రెప్లికేషన్ -లోపం ఉన్న చింపాంజీ అడెనోవైరస్ సార్స్–కో–2 వెక్టార్డ్ వ్యాక్సిన్. బీబీఎల్కు.. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి ఇన్-లైసెన్స్ టెక్నాలజీ ఉంది.
మొదటిదశలో18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిపై క్లినికల్ ట్రయల్ పూర్తయింది. మొదటి దశ క్లినికల్ ట్రయల్‌లో ఆరోగ్యవంతులైన వాలంటీర్లు వ్యాక్సిన్ మోతాదులను బాగా తట్టుకున్నారని కంపెనీ నివేదించింది. తీవ్రమైన ప్రతికూల ఘటనలు సంభవించలేదు. ఈ టీకా సురక్షితమైనదని, రోగనిరోధక శక్తి ని పెంచుతుందని గతంలోనూ నిర్ధారణ అయింది. ప్రీ-క్లినికల్ టాక్సిసిటీ అధ్యయనాలలోనూ ఇది కరోనాను బాగా తట్టుకోగలదని కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ జంతు అధ్యయనాలలోనూ మంచి ఫలితాలు సాధించింది. అధిక స్థాయిలో ప్రతిరోధకాలను పొందగలిగింది.
బీబీవీ154 (అడెనోవైరల్ ఇంట్రానాసల్ కరోనా వ్యాక్సిన్) తో బీబీవీ152 (కోవాక్సిన్®) రోగనిరోధక శక్తిని భద్రతను అంచనా వేయడానికి రెండోదశ యాదృచ్ఛిక, బహుళ-కేంద్రీకృత, క్లినికల్ ట్రయల్ ఆఫ్ హెటెరోలాగస్ ప్రైమ్-బూస్ట్ కాంబినేషన్ సార్స్ కోవీ2 వ్యాక్సిన్‌లను ట్రయల్స్ నిర్వహించడానికి నియంత్రణ ఆమోదం లభించింది. - ఆరోగ్యవంతులపై వాలంటీర్లపై ట్రయల్స్ జరుగుతాయి.
డీబీటీ కార్యదర్శి బిరాక్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రేణుస్వరూప్ మాట్లాడుతూ, "మిషన్ కోవిడ్ సురక్ష ద్వారా డిపార్ట్‌మెంట్ సురక్షితమైన, సమర్థవంతమైన కరోనావ్యాక్సిన్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉంది. భారత్ బయోటెక్ బీబీవీ154 టీకా..చివరి దశలో క్లినికల్ చివరిదశ ట్రయల్స్‌లోకి ప్రవేశిస్తున్న దేశంలో అభివృద్ధి చేయబడిన మొదటి ఇంట్రానాసల్ టీకా”అని ఆమె వివరించారు
------------------------------------------------------ ------------------------------------------------------ --------
మరింత సమాచారం కోసం: డీబీటీ/ బిరాక్ కమ్యూనికేషన్ సెల్‌ను సంప్రదించండి
డీబీటీ గురించి
సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), భారతదేశంలో బయోటెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది వేగవంతం చేస్తుంది. ఇందులో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, జంతు శాస్త్రాలు, పర్యావరణం పరిశ్రమల రంగాలలో బయోటెక్నాలజీని అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.
బిరాక్గురించి
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్) లాభాపేక్షలేని సెక్షన్ 8, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్. దీనిని డీబీటీ స్థాపించింది. భారత ప్రభుత్వం ఇంటర్‌ఫేస్ ఏజెన్సీగా వర్ధమాన బయోటెక్ ఎంటర్ప్రైజ్లను బలోపేతం చేయడం కోసం వ్యూహాత్మక పరిశోధన, ఆవిష్కరణలను చేపడుతుంది. తీరని అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తుంది.
బీబీఎల్ గురించి
భారత్ బయోటెక్ 145 కంటే ఎక్కువ గ్లోబల్ పేటెంట్లు, 16 కంటే ఎక్కువ వ్యాక్సిన్‌ల విస్తృత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో గల కంపెనీ. దీనికి నాలుగు బయో థెరప్యూటిక్స్ ఉన్నాయి. 123 కి పైగా దేశాలలో రిజిస్ట్రేషన్‌లు దీని సొంతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రీ-క్వాలిఫికేషన్‌లతో అద్భుతమైన ఆవిష్కరణల రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా 4 బిలియన్లకు పైగా వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. భారత్ బయోటెక్ ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. ఇన్ఫ్లూయెంజా హెచ్1ఎన్1, రోటావైరస్, జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జెనెవాక్®), రాబిస్, చికున్‌గున్యా, జైకా, కలరా వ్యాక్సిన్లను తయారు చేసింది. ప్రపంచంలోని మొట్టమొదటి టెటానస్- టాక్సాయిడ్ సంయోగం కోసం టీకాలను అభివృద్ధి చేసింది. టైఫాయిడ్ కోసం టీకాను అభివృద్ధి చేసింది. గ్లోబల్ సోషియల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లకు భారత్ బయోటెక్ కట్టుబడి ఉంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్‌ల పట్ల తన నిబద్ధతను ప్రకటించింది. ఫలితంగా పోలియో, రోటావైరస్, టైఫాయిడ్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడే డబ్ల్యూహెచ్ ప్రీ-క్వాలిఫైడ్ టీకాలు బయోపోలియో®, రోటావాక్ ® , టైప్బార్ టీవీవీ®లను ప్రవేశపెట్టింది.
***
(Release ID: 1745659)
Visitor Counter : 356