ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సత్వర మార్గ విధానంలో ‘ఈసీఆర్‌పీ-2’ ప్యాకేజీ అమలు


‘ఈసీఆర్‌పీ-2’ ప్యాకేజీ మలివిడత కింద అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత
ప్రాంతాలకు 35 శాతం నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం;

కోవిడ్‌-19పై సమర్థ పోరాటం కోసం రాష్ట్రాలకు రూ.14744.99 కోట్లు విడుదల

Posted On: 13 AUG 2021 6:51PM by PIB Hyderabad

   కోవిడ్‌-19 మహమ్మారి నియంత్రణ దిశగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న కృషికి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అన్నివిధాల మద్దతునిస్తోంది. కరోనా రెండోదశలో గ్రామాలకు, పట్టణ శివార్లకు, గిరిజన ప్రాంతాలకు విస్తరించిన ఫలితంగా తలెత్తిన మహమ్మారి పరిస్థితుల రీత్యా కేంద్ర మంత్రిమండలి ఓ కొత్త పథకాన్ని ఆమోదించింది. ఈ మేరకు రూ.23,123 కోట్ల అంచనా వ్యయంతో  రూపొందించిన “భారత కోవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన-ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీ: ఫేజ్‌-2” (ఈసీఆర్‌పీ-2 ప్యాకేజీ) పథకానికి 2021 జూలై 8న ఆమోదముద్ర వేసింది. ఈ పథకం 2021 జూలై 1 నుంచి 2022 మార్చి 31 వరకూ అమలవుతుంది.

   సీఆర్‌పీ-2’ అమలును వేగిరపరచడంలో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 2021 జూలై 22న సన్నద్ధత కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం 15 శాతం ముందస్తు నిధుల కింద రూ.1827.80 కోట్లు విడుదల చేసింది. దీనికితోడు ఇవాళ రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 శాతం నిధులను విడుదల చేసింది. దీంతో ఇప్పటిదాకా 50 శాతం నిధులను విడుదల చేయడంద్వారా మహమ్మారి పరిస్థితులకు తగినట్లు రాష్ట్ర/జిల్లా స్థాయులలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు కీలక కార్యకలాపాలకు సిద్ధమయ్యే వీలు కల్పించింది.

   ది కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వ చేయూతతో కూడిన కేంద్ర ప్రాయోజిత పథకం. ఆరంభ దశలోనే వ్యాధి నిరోధం, గుర్తింపు, నిర్వహణ చర్యల దిశగా సత్వర ప్రతిస్పందన నిమిత్తం ఆరోగ్య వ్యవస్థలను వేగవంతం చేయడం దీని లక్ష్యం. దీంతోపాటు పిల్లల ఆరోగ్య సంరక్షణ, అంచనా వేయదగిన ఫలితాలుసహా ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధిపైనా ఇది దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌) కింద ‘ఈసీఆర్‌పీ-2’కి సహాయంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తగిన మద్దతునిస్తుంది. ఇందులో భాగంగా రూ.14,744.99 కోట్లదాకా విలువైన అత్యవసర కోవిడ్‌ ప్రతిస్పందన ప్రణాళికల (ఈసీఆర్‌పీ)ను ఆమోదిస్తుంది.

‘సీఎస్‌ఎస్‌’ కింద సహాయంలో భాగంగా ‘ఈసీఆర్‌పీ-2’ ప్యాకేజీ కింది అంశాల్లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మద్దతునిస్తుంది:

  • జిల్లాల్లో 827 పీడియాట్రిక్ యూనిట్ల ఏర్పాటుద్వారా 19,030 ఆక్సిజన్ మద్దతుగల పడకలు, 10,440 ఐసీయూ/హెచ్‌డీయూ పడకలు అదనంగా సమకూర్చడం.
  • ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలోనూ (వైద్య కళాశాలలు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు లేదా కేంద్రం పరిధిలోని ఎయిమ్స్, ఐఎన్ఐలలో ఏదో ఒకచోట) కనీసం ఒకటి వంతున 42 అత్యాధునిక పిల్లల ఆరోగ్య సంరక్షణ కేంద్రాల (పీడియాట్రిక్‌ సీఓఈ) ఏర్పాటు; టెలి-ఐసీయూ సేవలు అందించేలా జిల్లా పీడియాట్రిక్ యూనిట్లను ప్రోత్సహించడం, సాంకేతిక చేయూతను అందించేలా చూడటం వీటి కర్తవ్యంగా ఉంటుంది.
  • ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో 23,056 అదనపు ఐసీయూ పడకలను ఏర్పాటు చేయడం; వీటిలో 20 శాతం పీడియాట్రిక్ ఐసీయూ పడకలు ఉండాలి.
  • కోవిడ్‌-19 మహమ్మారి గ్రామాలకు, పట్టణ శివార్లకు, గిరిజన ప్రాంతాలకు విస్తరించిన నేపథ్యంలో ఆయా సమాజాలకు సమీపాన వైద్య సంరక్షణ కల్పించే దిశగా ప్రస్తుతం (6 నుంచి 20 పడకలుగల) సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ఎస్‌హెచ్‌సీలలో అదనపు పడకల ఏర్పాటుకు వీలుగా 8010 ముందస్తు కూర్పు నిర్మాణాలను ఏర్పాటు చేయడం. తద్వారా 75,218 ఆక్సిజన్ మద్దతుగల పడకల సృష్టికి వీలుంటుంది.
  • రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 2వ అంచె, 3వ అంచె నగరాల్లో, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాలు నివేదించిన అవససరాల మేరకు 203 క్షేత్రస్థాయి ఆస్పత్రుల ఏర్పాటు. దీనివల్ల 13,065 ఆక్సిజన్‌ మద్దతుగ పడకల ఏర్పాటుకు వీలుంటుంది.
  • మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ వ్యవస్థ (ఎంజీపీఎస్‌)కోసం 1,450 సదుపాయాలకు మద్దతుగా 961 వైద్య ఆక్సిజన్‌ నిల్వ ట్యాంకుల ఏర్పాటు; ప్రతి జిల్లాకు కనీసం ఒక యూనిట్‌ సమకూరే విధంగా చూడటం దీని లక్ష్యం.
  • మొత్తం 5,768 అత్యాధునిక ప్రాణరక్షక (ఏఎల్‌ఎస్‌), ప్రాథమిక ప్రాణరక్షక (బీఎల్‌ఎస్‌) అంబులెన్సులతో ప్రస్తుత అంబులెన్సుల సముదాయాన్ని పెంచడం.
  • రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మానవ వనరుల మద్దతు పెంపు నిమిత్తమే కాకుండా కోవిడ్‌పై ‘ఎన్‌ఎంసీ’ మార్గదర్శకాల మేరకు కోవిడ్‌-19 సమర్థ నిర్వహణలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైనపుడు అందుబాటులో ఉండేవిధంగా 7,281 మంది పోస్టుగ్రాడ్యుయేట్‌ వైద్యులు, 13,190 మంది యూజీ శిక్షణార్థి వైద్యులు, 12,941 మంది ఎంబీబీఎస్‌ (ఫైనల్‌) విద్యార్థులు, 9,273 మంది బీఎస్సీ నర్సింగ్‌ (ఫైనల్‌) విద్యార్థులు, 15,687 మంది జీఎన్‌ఎం నర్సింగ్‌ (ఫైనల్‌) విద్యార్థుల నియామకం.
  • దేశంలోని 621 జిల్లా ఆస్పత్రులతోపాటు వైద్య కళాశాలలు/ఎస్‌డీహెచ్‌/ సీహెచ్‌సీఎస్‌ఈటీసీల (మొత్తం 1,554) పరిధిలోని 933 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ‘ఆస్పత్రుల నిర్వహణ అమలు వ్యవస్థ (హెచ్‌ఎంఐఎస్‌).
  • దేశంలోని 733 జిల్లా కూడళ్లలో టెలి-కన్సల్టేషన్‌ సేవల పెంపు; తద్వారా ఆయా కూడళ్ల పరిధిలో దేశవ్యాప్తంగాగల 15,632 శాఖలకు మద్దతునివ్వడం.
  • ఇప్పటివరకు ఆర్టీ-పీసీఆర్‌ ప్రయోగశాలలు లేని జిల్లాల్లో మొత్తం 433 ప్రయోగశాలల ఏర్పాటు, బలోపేతానికి చర్యలు.
  •  “పరీక్ష, ఏకాంతీకరణ, చికిత్స”సహా ఎల్లవేళలా కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనను కోవిడ్‌-19 సమర్థ నియంత్రణలో జాతీయ విధానం పరిగణిస్తున్నందున రాబోయే 9 నెలల్లో కనీసం 35.19 కోట్ల రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం 18.64 కోట్ల ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు, 16.55 కోట్ల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్ల కొనుగోలుకు మద్దతు.
  • కోవిడ్‌-19 నియంత్రణకు కావాల్సిన మందుల ఆపద్ధర్మ నిల్వసహా అవసరమైనప్పుడు డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా; ఇందుకోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 740 జిల్లాల్లో ఔషధాల ఆపద్ధర్మ నిల్వసహా అత్యవసర మందులు అందించడానికి జిల్లాకు రూ.కోటి వంతున మంజూరుకు ఆమోదం.

కాగా, కోవిడ్-19 ముప్పు నిరోధం, గుర్తింపు, ప్రతిస్పందన చర్యల నిమిత్తం ‘ఈసీఆర్‌పీ-1’ కింద 2021 ఏప్రిల్‌లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.15,000 కోట్లు విడుదల చేయబడ్డాయి.

 

****


(Release ID: 1745658) Visitor Counter : 225