వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రధాన పంటల నాలుగో ముందస్తు అంచనా విడుదల
దేశంలో రికార్డు స్థాయిలో308.65 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
గత ఐదు సంవత్సరాల ఆహార ధాన్యాల ఉత్పత్తి సరాసరితో పోల్చితే ఈ సారి 29.77 మిలిటయన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికం.
అన్నదాతల అవిశ్రాంత కృషి, శాస్త్రవేత్తల నైపుణ్యం, ప్రభుత్వ విధానాల కారణంగా రికార్డు స్థాయిలో ఉత్పత్తులు సాధించాం : శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
Posted On:
11 AUG 2021 8:30PM by PIB Hyderabad
2020-21 లో దేశంలో ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తికి సంబంధించి నాలుగో ముందస్తు అంచనాను దేశ వ్యవసాయ శాఖ విడుదల చేసింది. మన రైతులు రికార్డు స్థాయిలో అంటే 308.65 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశారు. అన్నదాతల అవిశ్రాంత కృషి, శాస్త్రవేత్తల నైపుణ్యం, ప్రభుత్వ విధానాల కారణంగా రికార్డు స్థాయిలో ఉత్పత్తులు సాధించామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. భారతదేశ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకున్నదని, రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్రం చేపట్టిన పటిష్టమైన కృసి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ తోమర్ నాలుగో ముందస్తు అంచనాల ప్రకారం 2020-21లో దేశంలో 308.65 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించినట్టు అంచనాలు తెలియజేస్తున్నాని అన్నారు. ఇది గత ఏడాది అంటే 2019-20లో సాధించిన ఆహార ధాన్యాల ఉత్పత్తికంటే 11.14 మిలియన్ టన్నులు అధికమని ఆయన అన్నారు. అంతే కాదు గత ఐదు సంవత్సరాల ఆహార ధాన్యాల ఉత్పత్తి సరాసరితో పోల్చితే ఈ సారి 29.77 మిలిటయన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికంగా సాధించామని పేర్కొన్నారు.
....
నాలుగో ముందస్తు అంచనాల ప్రకారం 2020-21లో దేశంలో సాధించిన ప్రధాన పంటల ఉత్పత్తి అంచనాలు
.....
ఆహార ధాన్యాలు- 308. 65 మిలియన్ టన్నులు ( రికార్డ్)
వరిధాన్యం -122.27 మిలియన్ టన్నులు ( రికార్డ్)
గోధుమలు -109.52 మిలియన్ టన్నులు ( రికార్డ్)
పోషక లేదా ముతక చిరు ధాన్యాలు - 51.15 మిలియన్ టన్నులు
మొక్కజొన్న 31.51 మిలియన్ టన్నులు ( రికార్డ్)
పప్పు ధాన్యాలు -25. 72 మిలియన్ టన్నులు ( రికార్డ్)
తూర్ దాల్ - 4.28 మిలియన్‌న టన్నులు
గ్రామ్ - 11.99 మిలియన్ టన్నులు ( రికార్డ్)
నూనె ధాన్యాలు - 36.10 మిలియన్ టన్నులు ( రికార్డ్)
వేరుశనగ పంట - 10. 21 మిలియన్ టన్నులు ( రికార్డ్)
సోయాబీన్ - 12.90 మిలియన్ టన్నులు ( రికార్డ్)
రేప్ సీడ్ మరియు ఆవాలు - 10.11 మిలియన్ టన్నులు ( రికార్డ్)
చెరుకు -399.25 మిలియన్ టన్నులు
పత్తి -35. 38 మిలియన్ బేల్స్ ( ( ఒకో బేల్ బరువు 170 కేజీలు)
జనపనార మరియు మెస్తా- 9.56 మిలియన్ బేల్స్ ( ఒక్కో బేల్ బరువు 180 కేజీలు)
2020-21లో అంచనా వేసిన వరి ధాన్యం ఉత్పత్తి 122.27 మిలియన్ టన్నులు. ఇది గత ఐదు సంవత్సరాల వరిధాన్యం ఉత్పత్తి సరాసరికంటే 9.83 మిలియన్లు ఎక్కువ.
2020-21 లో అంచనా వేసిన గోధుమ ధాన్యం ఉత్పత్తి 109.52 మిలియన్ టన్నులు. ఇది గత ఐదు సంవత్సరాల సరాసరి ఉత్పత్తికంటే 9.10 మిలియన్ టన్నులు ఎక్కువ.
2020-21లో పోషక మరియు ముతక చిరుధాన్యాల ఉత్పత్తి 51.15 మిలియన్ టన్నులు. ఇది 2019-20 కంటే 3.40 మిలయన్ టన్నులు ఎక్కువ.
2020-21 లో పప్పుధాన్యాల ఉత్పత్తి 25.72 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. ఇది గత ఐదు సంవత్సరాల సరాసరి ఉత్పత్తికంటే 3.73 మిలియన్ టన్నులు ఎక్కువ.
2020-21లో అంచనా వేసిన నూనె గింజల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 35.10 మిలయన్ టన్నులు. ఇది గత ఐదు సంవత్సరాల సరాసరి ఉత్పత్తి కంటే 5.56 మిలియన్ టన్నులు అధికం.
2020-21లో అంచనా వేసిన చెరకు పంట ఉత్పత్తి 399.25 మిలియన్‌న టన్నులు. ఇది గత ఐదు సంవత్సరాల్లో సాధించి ఉత్పత్తి సరాసరికంటే 37.18 మిలియన్ టన్నులు అధికం.
ఇక కాటన్ ఉత్పత్తి 35.38 మిలియన్ బేల్స్. ఇది సరాసరి ఉత్పత్తి కన్నా 3.49 మిలియన్ బేల్స్ అధికం. అలాగే జనపనార మరియు మెస్తా ఉత్పత్తి అంచనా 9.56 మిలియన్ బేల్స్.
పలు ప్రధాన పంటల ఉత్పత్తి అంచనాలను ఆయా రాష్ట్రాలనుంచి అందుకున్న సమాచారం ఆధారంగా తయారు చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని అందుబాటులోని వనరులతో సరిపోల్చడం కూడా జరిగింది.
***.
(Release ID: 1745092)
Visitor Counter : 312