గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అద్దెదారులు, భూస్వాముల ప్రయోజనాలను సమతుల్యం చేయడం, రక్షించడం ద్వారా అద్దె గృహాలను ప్రోత్సహించడం మోడల్ టెనెన్సీ చట్టం లక్ష్యం
Posted On:
11 AUG 2021 2:39PM by PIB Hyderabad
కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో, మోడల్ టెనెన్సీ యాక్ట్ (ఎంటీఏ) అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు (యుటీలు) జూన్ 7, 2021 న తాజా చట్టాన్ని రూపొందించడం, లేదా భవిష్యత్తులో అద్దె చట్టాలకు తగిన విధంగా సవరించడం కోసం సర్క్యులేట్ చేశారు. మోడల్ టెనెన్సీ యాక్ట్ అనేది అద్దె గృహాలను ప్రోత్సహించడం, అద్దెదారులు, భూస్వాముల ఇద్దరి ప్రయోజనాలను సమతుల్యం చేయడం, రక్షించడం ద్వారా సమర్థవంతమైన, పారదర్శకంగా ప్రాంగణాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా త్వరిత గతిన వివాద పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.
త్వరితగతిన వివాద పరిష్కారాన్ని నిర్ధారించడానికి, అద్దె కోర్టు, రెంట్ ట్రిబ్యునల్ రెండూ అరవై రోజులలోపు కేసులను పరిష్కరించడానికి ప్రయత్నించాలని, డిస్పోజల్ ఆలస్యం అయినట్లయితే, ఆలస్యానికి గల కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలన్నది చట్టంలో ఉన్న ఆదేశం. అత్యవసర సేవలకు సంబంధించిన వివాదాల కోసం, రెంట్ అథారిటీ, ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత, అత్యవసర సేవల సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయవచ్చు. ఇంకా, అద్దెదారు ఈ విషయంలో దరఖాస్తుదారు దాఖలు చేసిన ఒక నెలలోపు విచారణను నిర్వహిస్తారు.
ఎంటీఏ నిబంధనల ప్రకారం, అద్దెదారుని తెలియజేయడానికి భూస్వామి మరియు అద్దెదారు సమర్పించిన సమాచారం, పత్రాలు అద్దె అథారిటీ వద్ద మాత్రమే ఉంటాయి.
అద్దె ఒప్పందంలో భూస్వామి, అద్దెదారు మధ్య అంగీకారం కుదరకపోతే, రెండు పార్టీల పాత్రలు,బాధ్యతలు చట్టంలోని షెడ్యూల్ -2 లో స్పష్టంగా వివరించి ఉంది. ఇది భూస్వామి, అద్దెదారుల మధ్య వివాదాలను నివారించడంలో సహాయపడుతుంది.
ఈ సమాచారాన్ని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.
*****
(Release ID: 1744987)
Visitor Counter : 224