ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రభుత్వరంగ బ్యాంకులలో(పిఎస్‌బి) సుమారు 72 శాతం ఆర్ధిక లావాదేవీలు డిజిటల్ ఛానళ్ల ద్వారా నిర్వహించడం జరిగింది.
డిజిటల్ ఛానళ్ల ద్వారా లావాదేవీలు జరుపుతున్న కస్టమర్ల సంఖ్య 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3.4 కోట్లు ఉండగా 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఇది 7.6 కోట్లకు పెరిగింది.
Posted On:
10 AUG 2021 6:38PM by PIB Hyderabad
ప్రభుత్వరంగ బ్యాంకులలో 72 శాతం ఆర్ధిక లావాదేవీలు డిజిటల్ ఛానళ్ల ద్వారా జరుగుతున్నాయి. డిజిటల్ ఛానళ్లపై క్రియాశీలంగా ఉన్న కస్టమర్ల సంఖ్య 201920 ఆర్ధిక సంవత్సరంలో 3.4 కోట్లు ఉండగా 2020-21 ఆర్దిక సంవత్సరంలో ఇవి 7.6 కోట్ల కు పెరిగాయి. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కరద్ రాజ్యసభకు ఈరోజు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
అయితే బ్యాంకింగ్ కార్యకలాపాలకు రిజర్వుబ్యాంకు లైసెన్సులు మంజూరు చేస్తుందని, ప్రస్తుతానికి డిజిటల్ బ్యాంకులకు ప్రత్యేకంగా లైసెన్సులు ఇచ్చేకేటగిరీ ఏదీ లేదని ఆర్.బి.ఐ తెలిపిందని అన్నారు.
డిజిటల్ బ్యాంకింగ్‌కు వీలు కల్పిస్తూ తీసుకున్న పలు చర్యలను మంత్రి ఈ సందర్బంగా వివరించారు.
(1) ప్రభుత్వ రంగ బ్యాంకుల సరళతర సంస్కరణల అజెండాలో భాగంగా --
మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను ప్రభుత్వరంగ బ్యాంకులలో మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పిఎస్‌బిలలో అందించే సేవలు 43కు పెరిగాయి. కస్టమర్ అనుకూల ఫీచర్లు 135, ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉన్న కస్టమర్ ఇంటర్‌ఫేస్ సేవలు 8 వరకు ఉన్నాయి. ఎండ్ టు ఎండ్ ఆటోమేటేడ్ డిజిటల్ లెండింగ్‌ను అరక్షిత వ్యక్తిగత రుణాలకు ప్రవేశపెట్టడం జరిగింది.(ఐదు పిఎస్‌బిలలో), మైక్రో ఎంటర్ ప్రైజెస్‌లకు రుణాలు (ఐదు పిఎస్‌బిలలో శిశు ముద్రా రుణాలు ) అలాగే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ ప్రైజెస్‌లలలో (మూడు పిఎస్‌బిలలో) డిజిటల్ విధానం అమలు చేశారు.
డిజిటల్ ఛానళ్ల ద్వారా డిజిటల్ రిటైల్ లోన్ అభ్యర్థనను ఏడు పెద్ద పిఎస్‌బిలలో వీలు కల్పించడం జరిగింది. 2020-21 ఆర్దిక సంవత్సరంలో 40,819 కోట్ల రూపాయల మేరకు రిటైల్ రుణాల పంపిణీ దరఖాస్తులను డిజిటల్ విధానంలో చేపట్టడం జరిగింది.
కస్టమర్ అవసరాలకు అనుగుణంగా, విశ్లేషణ ఆధారిత క్రెడిట్ ఆఫర్లకు ఊతం ఇవ్వడం జరిగింది. దీనితో 2020-21 ఆర్దిక సంవత్సరంలో ఏడు పెద్ద పిఎస్‌బిలు తాజారుణ పంపిణీని చేపట్టడం జరిగింది.
(2) ప్రభుత్వానికి చెందిన జీవన్ ప్రమాణ్ కార్యక్రం పెన్షనర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇది పెన్షనరర్లు తమ వార్షిక జీవిత సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేయడానికి వీలుకలుగుతుంది.
(3)డిజిటల్ రుణవిధానం కింద వ్యక్తిగత ప్రమేయం లేకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు 59 మినిట్స్.కామ్ ద్వారా చేపడుతున్నారు. క్రెడిట్ బ్యూరో, ఇన్‌కం టాక్స్, గూడ్స్,సర్వీసెస్ (జిఎస్‌టి ) డేటా, సూక్ష్మ, చిన్న మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎం.ఎస్.ఎం.ఇ)లకు రుణాల పంపిణీ, గృహరుణాలు, వ్యక్తిగత రుణాలు, ఆటోమొబైల్ రుణాలు వంటి వాటిని ఆన్‌లైన్ ద్వారా ఆమోదించే సదుపాయం ఉంది.
4) ఎం.ఎస్.ఎం.ఇలకకు ఆన్‌లైన్ బిల్ డిస్కౌంటింగ్ ను పిఎస్‌బిలు ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టిఆర్ ఇ డిఎస్) ప్లాట్‌ఫారం ద్వారా చేపట్టడం జరుగుతుంది.
(Release ID: 1744719)
Visitor Counter : 214