ఆర్థిక మంత్రిత్వ శాఖ

స్టాండ్ అప్ ఇండియా పథకం (ఎస్యుపిఐ) కింద ఎస్సీ/ఎస్టీ, మహిళా రుణగ్రహీతలకు 1.17 లక్షలకు పైగా రుణాలు రూ.26,391 కోట్లు మంజూరు


ఎస్యుపిఐ 6 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పించింది

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2021 4:48PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 2021 జూలై 31 నాటికి 1.17 లక్షల కంటే ఎక్కువ రుణాలు మొత్తం రూ.26,391 కోట్లు, స్టాండ్ అప్ ఇండియా పథకం (ఎస్యుపిఐ) కింద ఎస్సీ/ఎస్టీ,మహిళా రుణగ్రహీతలకు మంజూరు అయ్యాయి. ఇది 6 లక్షల మందికి పైగా ఉపాధిని కలిపించింది. ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్రావు  కరాద్ పేర్కొన్నారు.

స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ కింద ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అందించిన రుణాల వివరాలను ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి 31.07.2021 నాటివివరాలను మంత్రి పేర్కొన్నారు: -

 

రుణదాతలు 

ఖాతాల సంఖ్య

మంజూరైన నిధులు రూ.కోట్లలో 

ప్రభుత్వ రంగ బ్యాంకులు 

1,02,247

23,062.91

ప్రైవేట్ రంగం బ్యాంకులు 

12,235

2,845.41

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 

2,605

483.56

మొత్తం 

1,17,087

26,391.88

Source: SIDBI

 షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) సలహాలు/మెంటార్‌షిప్ లేకపోవడం, అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ నెలకొల్పడానికి సరిపడని, ఆలస్యమైన క్రెడిట్ కారణంగా గణనీయమైన అడ్డంకులను ఎదుర్కొంటున్న మహిళలు, అట్టడుగు వర్గాల మధ్య వ్యవస్థాపకతను పెంపొందించడానికి ఈ పథకం సహాయపడిందని మంత్రి పేర్కొన్నారు. 

ఈ పథకం పనితీరును జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (డిఎల్సిసి), రాష్ట్ర స్థాయి అమలు కమిటీ (ఎస్ఎల్ఐసి), రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బిసి) వంటి వివిధ స్థాయిలలో ఎప్పటికప్పుడు  బ్యాంకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, సమీక్షించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. 

పథకం ప్రభావంపై, 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్వతంత్ర అంచనా అధ్యయనం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. అధ్యయనం కనుగొన్న అంశాల ఆధారంగా, వాటాదారులతో సంప్రదింపులు మరియు 2021-22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ప్రకారం పథకం కింద రుణాల కోసం మార్జిన్ మనీ అవసరం '25%' నుండి '15%' కి తగ్గించారు. వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు కూడా పథకంలో చేర్చారు. 

 

 

****


(రిలీజ్ ఐడి: 1744527) సందర్శకుల సూచీ సంఖ్య : : 141
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , Punjabi