ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

క్షయ వ్యాధి నివారణకు అమలు జరుగుతున్న చర్యలను పార్లమెంట్ సభ్యులకు వివరించడానికి ఏర్పాటైన సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు,లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం ప్రకాష్ బిర్లా

దేశంలో టీబీని నిర్మూలించడానికి అమలు చేస్తున్న చర్యలను సభ్యులకు వివరించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

తమ తమ నియోజకవర్గాల్లో టీబీ లేకుండా చూడాలని సభ్యులకు సూచన

కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థానిక స్థాయిల్లో ప్రజల సహకారంతో 2025 నాటికి టీబీని నిర్మూలించడానికి జరుగుతున్న ప్రయత్నాలను వేగవంతం చేయవచ్చు .. శ్రీ వెంకయ్య నాయుడు

తమ నియోజకవర్గాల్లో టీబీ వ్యాధి సోకిన వారిని గుర్తించి, వారిని పర్యవేక్షించి చికిత్సకు ముందు తరువాత వారి అవసరాలను తీర్చడం ప్రజా ప్రతినిధుల బాధ్యత... శ్రీ ఓం బిర్లా

ఆరోగ్యాన్ని అభివృద్ధితో కలిపి చూస్తూ ఆరోగ్య అంశానికి ‘సమగ్ర’ రూపం ఇచ్చే విధంగా ప్రజల ఆలోచలను మార్చడంలో శ్రీ నరేంద్ర మోడీ విజయం సాధించారు... శ్రీ మన్సుఖ్ మాండవీయ

Posted On: 09 AUG 2021 3:45PM by PIB Hyderabad

క్షయ వ్యాధి నివారణకు అమలు జరుగుతున్న చర్యలను పార్లమెంట్ సభ్యులకు వివరించడానికి   గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు,లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం ప్రకాష్ బిర్లా అధ్యక్షతన ఈ రోజు సమావేశం జరిగింది. దేశంలో క్షయ వ్యాధి తాజా  పరిస్థితిని .  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ మరియు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సభ్యులకు 2018 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రకటించిన విధంగా 2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించ వలసిన అవసరాన్ని వివరించారు. 

సున్నితమైన అంశంపై ఏర్పాటైన సమావేశానికి హాజరైన పార్లమెంట్ సభ్యులను అభినందించిన ఉపరాష్ట్రపతి  "కేంద్రరాష్ట్రజిల్లా మరియు స్థానిక స్థాయిలలో సమన్వయంతో  ప్రజల సహకారంతో 2025 నాటికి టీబీని నిర్మూలించడానికి జరుగుతున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి"అని  పేర్కొన్నారు. స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత దేశ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో వ్యాధి నిర్మూలనకు జరుగుతున్న ప్రయత్నాలు వేగవంతం అయ్యాయని ఆయన  అన్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ద్వారా 2000 నుంచి ఇంతవరకు ద్వారా 63 మిలియన్ల మంది ప్రాణాలను రక్షించడానికి అవకాశం కలిగిందని ఆయన వివరించారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు ప్రణాళికలు లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూసి టీబీ నివారణకు ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. టీబీ నుంచి దేశానికి విముక్తి కలిగిస్తామని సభ్యులు ప్రతిజ్ఞ తీసుకున్నారు.  

టీబీ  కి వ్యతిరేకంగా సమిష్టి చర్యలు అమలు కావాలని సూచించిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా  వైవిధ్యంతో నిండిన దేశంలో సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పార్లమెంట్ కీలక పాత్రను పోషించవలసి ఉంటుందని అన్నారు. తమ నియోజకవర్గాల్లో టీబీ వ్యాధి సోకిన వారిని గుర్తించివారిని పర్యవేక్షించి చికిత్సకు ముందు తరువాత వారి అవసరాలను తీర్చడం తమ బాధ్యతగా  ప్రజా ప్రతినిధులు గుర్తించి పనిచేయాలని ఆయన సూచించారు. సుపరిపాలన మరియు ఆరోగ్య పరిపాలన కోసం టీవీ కి  సంబంధించిన పూర్తి సమాచారాన్ని సభ్యులకు అందించి వారికి అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని ఆయన అన్నారు. 

ఆరోగ్యాన్ని అభివృద్ధితో కలిపి చూస్తూ ఆరోగ్య అంశానికి  సమగ్ర’ రూపం ఇచ్చే విధంగా ప్రజల ఆలోచలను మార్చడంలో శ్రీ నరేంద్ర మోడీ విజయం సాధించారని శ్రీ మన్సుఖ్ మాండవీయ అన్నారు.  పోషకాహార లోపం, పరిశుభ్రత అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాలను అమలు చేయడం దేనికి ఉదాహరణ అని ఆయన అన్నారు. సమాజ స్థాయిలో ఈ కార్యక్రమాలు ప్రజల ఆరోగ్య స్థితిగతులను  తద్వారా దేశ జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని అన్నారు.  పోషకాహార మద్దతు మరియు విస్తృత సామాజిక అవగాహన ద్వారా టీబీని తొలగించడానికి అవకాశం కలుగుతుందని గుర్తించి దీనికి అనుగుణంగా దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. దేశ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో బడ్జెట్ కేటాయింపులను ఎక్కువ చేశామని ఆయన సభ్యులకు వివరించారు. 

15-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఎక్కువగా టీబీ బారిన పడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. టీబీ సోకిన వారిలో 65% వరకు  ఉత్పత్తి సామర్ధ్యం ఎక్కువగా ఉండే ఈ వయస్సు వారు ఉన్నారని అన్నారు. దీనికి తోడు 58% టీబీ కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో ఈ కుటుంబాలు ఆర్థిక అభివృద్ధిని సాధించలేక పోతున్నాయని అన్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు ఈ అంశంపై దృష్టి సారించి వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించి పనిచేయాలని ఆయన కోరారు. 

 కోవిడ్-19 ప్రారంభ దశలో టీబీ నిర్మూలనకు అమలు జరుగుతున్న కార్యక్రమాలకు ఎదురైన సమస్యలను డాక్టర్ భారతి పవార్ వివరించారు. ' 2020లో కోవిడ్-19 వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయి. అన్ని దేశాల ప్రజల జీవితాలు, ఆర్థిక ఆరోగ్య రంగాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది.  క్షయవ్యాధి నిర్మూలనకు కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న కార్యక్రమాలు, ఈ దిశలో సాధించిన విజయాలపై ఇది ప్రభావాన్ని చూపింది. మార్చి 2020 లో విధించిన లాక్ డౌన్కదలికలపై విధించిన ఆంక్షలు,  ఆరోగ్య వ్యవస్థ వనరుల పునర్వినియోగం, మౌలిక సదుపాయాలు, విశ్లేషణలు, చికిత్స కేంద్రాలను  కోవిడ్ -19 చికిత్స కోసం వినియోగించడంతో  టిబి నిర్మూలన ప్రయత్నాలు మరియు సేవలకు అంతరాయం కలిగించాయి. ” అని  డాక్టర్ భారతి పవార్ పేర్కొన్నారు. టీబీ  నిర్మూలనకు జరుగుతున్న ఈ అడ్డంకులను అధిగమించడానికి మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యలపై ఆమె తన సహచరులకు పార్లమెంటు సభ్యులకు తెలిపారు. రాష్ట్రాల సహకారంతో టీబీ వ్యాధి నివారణకు కలసి పనిచేస్తామని అన్నారు.  

 

 కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్లోక్ సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్ మరియు అదనపు కార్యదర్శి (ఆరోగ్యం) శ్రీమతి ఆర్తి అహుజా కూడా పాల్గొన్నారు.



(Release ID: 1744204) Visitor Counter : 162