సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

'క్విట్ ఇండియా ఉద్యమం'పై ఎగ్జిబిషన్! 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా ప్రారంభం.


ప్రజా పర్వదినంగా 'అమృత్ మహోత్సవ్':
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన
పేదరికం, అసమానత, నిరక్షరాస్యత, ఉగ్రవాదాలకు
'క్విట్ ఇండియా' చెప్పాల్సిన తరుణం: కేంద్రమంత్రి

Posted On: 08 AUG 2021 6:34PM by PIB Hyderabad

  'క్విట్ ఇండియా ఉద్యమం' 79వ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత జాతీయ అభిలేఖాగారం (ఎన్.ఎ.ఐ.) లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి 2021 ఆగస్టు 8న ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రులు ఆర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షీ లేఖి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించుకుంటున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమాల్లో భాగంగా క్విట్ ఇండియాపై ఈ ఎగ్జిబిషన్.ను ఏర్పాటు చేశారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శి రాఘవేంద్ర సింగ్, ఎన్.ఐ.ఎ. డైరెక్టర్ జనరల్ చందన్ సిన్హా, సాంస్కృతిక వ్యవహారాల అదనపు కార్యదర్శులు రోహిత్ కుమార్ సింగ్, పార్థసారథి సేన్ శర్మ, సంయుక్త కార్యదర్శులు అమితా ప్రసాద్ సర్బాయ్, లిలీ పాండేయ, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎన్.ఐ.ఎ.లకు చెందిన ఇతర అధికారులు కూడా ప్రారంభోత్సవంలో పాలుపంచుకున్నారు.


https://ci6.googleusercontent.com/proxy/BBB4CZhnL2LIvRi_o7iXJVrvJCQ5D1GHYhLmLLk9v1fh3XIEDMXJPu-wR5yw-xCclaXOzWK7ebG8DK5eHF2RgCXlcR-rc7yIKJgbbLekjSnZ1MFUuKett6mtPw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AIAK.jpg
 

  దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమ ప్రాముఖ్యాన్ని తెలియజెప్పేందుకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా చక్కని ప్రయత్నం జరిగింది. ప్రభుత్వ రికార్డులు, ప్రైవేటు లేఖలు, రేఖా చిత్రాలు, ఫొటో గ్రాఫులు, తదితర అంశాలతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. 2021 ఆగస్టు 9నుంచి నవంబరు 8వరకూ ఈ ఎగ్జిబిషన్ సందర్శించేందుకు ప్రజలను అనుమతిస్తారు.  ప్రతి రోజూ ఉదయం 10గంటలనుంచి సాయంత్రం ఐదున్నర వరకూ ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుంది.


https://ci5.googleusercontent.com/proxy/X36zATdgQY2UG14ZUUzS0jxrxHPTysb86ldKWt9Z8Kbdn0Nd4Z16TT9uoqD4ZTIuD3EiV4l3oUGto15XTTMk48GQom0TpzzYhG9gMqtjHk-JVeKOlIp0P1L0Vw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002HC45.jpg

  ఎగ్జిబిషన్.ను సందర్శించిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సమైక్యత, ప్రజాబలం, దృఢదీక్ష వంటి సువర్ణాధ్యాయాలతో మన స్వాతంత్ర్య పోరాటం మమేకం అయిందని, స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఒక సువర్ణ అధ్యాయమేనని అన్నారు. దాదాపు 8 దశాబ్దాల తర్వాత కూడా ప్రజల సమైక్య బలానికి అద్భుతమైన ఉదాహరణగా క్విట్ ఇండియా ఉద్యమం నిలిచిందని, రానున్న మరిన్ని దశాబ్దాలకు ఈ ఉద్యమం ఇలాగా నిలిచి ఉంటుందని ఆయన అన్నారు.

   75వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్స్ పేరిట భారతదేశం నిర్వహించుకుంటున్న పలు కార్యక్రమాలను గురించి కేంద్రమంత్రి వివరించారు. ఈ ఏడాది మార్చిలో ఈ కార్యక్రమాలు మొదలయ్యాయని, 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకలకు 75 వారాలపాటు కొంట్ డౌన్ 2023 ఆగస్టు 15వ తేదీన ముగుస్తుందని అన్నారు. “వలస పాలననుంచి మన జాతి విముక్తికోసం సేవలందించిన ఒక తరాన్ని గుర్తుంచుకోవడానికేకాక, మన నాగరకతను, వారసత్వ సంపదను 750 సంవత్సరాలు కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించిన వారి సేవలను స్మరించుకోవడానికి ఇది సరైన సందర్భం. భరతమాతకు స్వార్థరహితంగా సేవలందించిన ఎందరెందరో వీరుల త్యాగాలను మనం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది.” అని ఆయన అన్నారు.

  75వ స్వాతంత్ర్య వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న క్రమంలోనే సమైక్యత, స్వేచ్ఛ వంటి భావనలను స్మరించుకునేందుకు ఆజాదీ  కా అమృత్ మహోత్సవ్ వేడుకలు దోహదపడతాయని కిషన్ రెడ్డి అన్నారు.  మనమంతా ఒక్కటే అన్న సందేశాన్ని, యువత భాగస్వామ్యంతో దేశాన్ని 25ఏళ్లలో మందుకు తీసుకెళ్లాలన్న ప్రధానమంత్రి దార్శనికతను ప్రచారం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, కార్యక్రమాలకు మీడియా మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “భారతదేశం  2047వ సంవత్సరానికల్లా ఎలా ఉండాలన్న ముందుచూపును యువతలో పురికొల్పడంతో ఈ వేడుకలు కీలకపాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి తరచుగా పేర్కొంటూ ఉంటారు.”  అని కిషన్ రెడ్డి అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/cNv1eCbVGMW_XctqIKpVNL4ox4Imm28qjiFPmAK6eSY49TaBh6sUtaHKl6OMPuvn4rixhWnIZ6OvqVJx7yNx-esR5yIAQGPvDbXdEP_-bDNicxRSj3n1IxkWdA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GPJX.jpg
 

  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలని, దీన్ని ప్రజా ఉత్సవంగా, జనం పర్వదినంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  “ఆజాదీగా అమృత్ మహోత్సవ్ అనేది కేవలం ప్రభుత్వ ఉత్సవం మాత్రమే కాదు. ఈ వేడుకల్లో ప్రతి భారతీయుడూ పాలుపంచుకోవాలి. ఈ ఉత్సవాలను దిగ్విజయం చేసేందుకు అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని రాజకీయవర్గాలకు చెందిన వారు ఈ మహోత్సవంలో పాల్గొంటారు.”,  అని ఆయన అన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/xjPto-Etv8PDx6-X4B97tDQ1RYCCMaDgKk6AmUBvSBQoSdHaXzrdzd-28byrz83faYMNeDs0ZOF087lao2hQn_fgqwkXlcWx4QjNbCtdU377BGSZH4KYDQ9nmw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PWT3.jpg
 

  అంతకు ముందు,.. ఎగ్జిబిషన్ ప్రారంభించిన వెంటనే సందర్శకుల పుస్తకంలో మంత్రి తన సంతకం చేశారు. “క్విట్ ఇండియా అనే ఉద్యమం జరిగి 79ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో కూడా ఈ ఉద్యమ రూపం ఇప్పటికీ మనకు అనుసరణీయమే. 1942లో మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం వలసరాజ్య శక్తులను తరిమికొట్టింది. ఇప్పటి నవభారతంలో కూడా పేదరికం, అసమానతలు, నిరక్షరాస్యత, బహిరంగ మల విసర్జన, ఉగ్రవాదం, వివక్ష వంటి సమస్యలను తరిమికొట్టాల్సిందే. అంటే క్విట్ ఇండియా  అంటూ ఈ దురాచారాలను మనం తరిమివేయాల్సిందే.” అని ఆయన సందర్శకుల రిజిస్టర్.లో రాశారు.

  జనగణమన జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ ఆలపించి, అలా చిత్రీకరించిన వీడియోలను www.rashtragaan.in అనే వెబ్ సైట్.లో అప్.లోడ్ చేయాలని కేంద్రమంత్రులు విజ్ఞప్తి చేశారు. “ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రగాన్ పేరిట ఒక ఉద్యమాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తొలిసారిగా నిర్వహిస్తోందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ ఉద్యమంలో భాగంగా, ఎవరైనా సరే,. జాతీయ గీతం ఆలపించి, సదరు వీడియో రికార్డింగ్.ను rashtragaan.in  అనే వెబ్.సైట్ లో పొందుపరచవచ్చు. అలా పొందుపరిన వీడియోలన్నింటినీ సంకలనంచేసి, స్వాతంత్ర్య దినోత్సవం రోజున టెలివిజన్ ద్వారా ప్రసారం చేస్తారు.  ప్రజలను సమైక్యపరిచే ఈ వినూత్న కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. జాతీయ గీతాలాపనకు సంబంధించిన వీడియో రికార్డింగ్.ను www.rashtragaan.in పోర్టల్.లో పొందుపరచండి.“, అని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. #MeraMaanMeraRashtragaan pic.twitter.com/JsZActP8pU ద్వారా కూడా జాతీయ గీతాలాపనలో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు కూడా ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి తమ జాతీయ గీతాలాపన వీడియోలను https://t.co/9rJpz90Brc లో అప్ లోడ్ చేశారు.

https://ci4.googleusercontent.com/proxy/bs4gBWLIVh3TYi_UGudpasCap8Rm1UjcsEmoEKieEesQhwXvSQX94A1zqHweYPQsRrpe-PhXzQo2_8Vbzl2eqllFclSw3bpM452MwK5EbdVHRssFxHGDArMAfA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005M7OM.jpg
(మంత్రులు జాతీయ గీతాలాపన వీడియోను rashtragaan.in

పోర్టల్.లో అప్.లోడ్ చేస్తున్న దృశ్యం)

 

  ఈ ఎగ్జిబిషన్ కు సంబంధించిన స్వాతంత్య్రోద్యమ చారిత్రాత్మక సంఘటలను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరించారు. జాతిపిత మహాత్మా గాంధీతోపాటుగా ఇతర సీనియర్ నాయకులు అరెస్ట్ కావడంతో క్విట్ ఇండియా ఉద్యమం దానంతట అదే దేశం నలుచెరగులూ వ్యాపించిందన్నారు. అప్పట్లో ఈ ఉద్యమ నాయకత్వం రామన్ మనోరహ్ లొహియా, అరుణా అసఫ్ అలీ, జయప్రకాశ్ నారాయణ తదితర యువనేతల చేతుల్లోకి వెళ్లిందన్నారు. 1942వ సంవత్సరంలో వారీ సవాలును తమ నాయకత్వ పటిమతో ఎదుర్కొన్నారని, ప్రజా భాగస్వామ్యంతో ఈ సవాలును ఒక అవకాశంగా మలుచుకున్నారని. బ్రిటిష్ వారు దేశాన్ని వదలివెళ్లేలా చేశారని చెప్పారు. స్వాతంత్య్రోద్యమ ఘట్టాలతో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్న జాతీయ అభిలేఖాగార సిబ్బంది కృషి ఎంతో అభినందనీయమని కేంద్రమత్రి మేఘ్వాల్ అన్నారు.


https://ci6.googleusercontent.com/proxy/YDjJZfSHhQI7ztvJ-OqF-ylJbiHZd4nVccMprtk_Xs-FrLmGwXE_cn6ugs3pee0cvHTEhBqoE_0_SfbSiRxltkwUlBE9Vww5QZJ-DpGL1n0PZ0NNMoRqBbDhFQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006OUZ1.jpg

 

   మరో మంత్రి మీనాక్షీ లేఖి మాట్లాడుతూ, భారతీయ స్వాతంత్య్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం ముఖ్యమైన మైలురాయి అని, మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలంతా ఒక్క తాటిపైకి వచ్చి సామ్రాజ్య వాదాన్ని కుప్పకూల్చారని అన్నారు. బ్రిటిష్ పాలకులను దేశంనుంచి తరిమివేయడానికి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం రోజున గాంధీ 'డూ ఆర్ డై' అన్న నినాదాన్ని దేశ ప్రజలందరికీ అందించారని అన్నారు. సామాన్య ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నపుడే మనం స్వాంత్ర్యం సాధించుకున్నాం. స్వాతంత్ర్యం కోసం దేశవాసులు ఎన్ని త్యాగాలు చేశారో ప్రస్తుత యువత, రానున్న తరాలవారు తెలుసుకునేందుకే స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నామని అన్నారు.



https://ci6.googleusercontent.com/proxy/AbUSPYNQRDUFOutbED5GxOb8zGejqxIV8ndzBUNbxx1vRteAfQA9UFzNesE_dRQr-4Xtjn3I_C9sLhMB3X-RZTpaNHawtt1jxTAJgqKBappcHkewjmzHyOehDw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00767I1.jpg

 

 క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసిన పలు సంఘటలను వివరించేలా అనేక విభాగాలను ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. క్విట్ ఇండియా పోరాటం ప్రజా ఉద్యమంగా రూపుదాల్చిన వైనం,  ఉద్యమ వీరుల వివరాలు, క్షేత్రస్థాయిలో ఉద్యమ ప్రభావం, వలస పాలకుల అరాచకాలు, వాటి పర్యవసానాలు తదితర అంశాలతో ఈ విభాగాలను తీర్చిదిద్దారు.

https://ci5.googleusercontent.com/proxy/P-2MKyasYwO2w8YszD-jKHHS3Sub9GTvrv-jCLpg-ocJBjEnyd_MFeTqzPsrzDG7VJ-Hhn6Z45BuUOxeCy5LYwsPaMCS3Bo1DZXOIDu1ZxmDDuGBYzIXYfc9RA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00445RQ.jpg
 

     భారతదేశంలో బ్రిటన్ పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ, మహాత్మా గాంధీ 1942వ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1942, ఆగస్టు 8వ తేదీన ఆయన ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు.

  క్విట్ ఇండియా ఉద్యమంపై దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్.పేయి రాసిన కవితను ప్రదర్శించిన చోట కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు ఎక్కువ సేపు గడిపారు.  మదన్ మోహన్ మాళవీయ ప్రచురించిన అభ్యుదయ అనే వార్తాపత్రికలో 1946లో వాజ్.పేయి కవిత ప్రచురితమైంది. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని బయటకు తెచ్చిన వాజ్.పేయి కవితలో సుప్రసిద్ధమైనकोटि कोटि कंठों से निकला भारत छोड़ो नारा, आज ले रहा अंतिम सांस ये शासन हत्यारा” అనే పంక్తులను వారు ఈ సందర్బంగా ప్రశంసించారు.


https://ci4.googleusercontent.com/proxy/CqTi-eCsyHFtLxXTb5dT6v82hG76P2iHmUQyEfiAUqttR8mF0ClR9JZKfHb-3F7xEGDCc1sxjIxfjO2CqoMU5BNdxCB_-Sk2ltKa0Dx5SxiodNfNZwuc8-dRwA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008D6UZ.jpg
 

  భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం ఎంతో కీలకమైన ఘట్టం. భారతదేశాన్ని ఇకపై పరిపాలించడం తమకు సాధ్యంకాదని ఈ ఉద్యమం బ్రిటిష్ పాలకులకు తెలియజెప్పింది. భారతదేశాన్ని వదలి వెళ్ళే మార్గాలను గురించి వారిని ఆలోచింప జేసింది. “బ్రిటిష్ వారు క్రమబద్ధంగా భారతదేశంనుంచి వెళ్లిపోయేందుకు” వీలుగా మహాత్మా గాంధీ బోధించిన అహింసాయుత పద్ధతిలో క్విట్ ఇండియా ప్రజాఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో గాంధీజీ తన ప్రసంగాల ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేశారు. “స్వాతంత్ర్యం కావాలని కోరుకొంటూ, దానికోసం పోరాడే ప్రతి భారతీయుడూ తనకు తానే మార్గదర్శకత్వం వహించుకోవాలి.…”అని ఆయన పిలుపునిచ్చారు. 1942 ఆగస్టు 8వ తేదీన ఉద్యమాన్ని ప్రారంభించినపుడు “సాధించు లేదా మరణించు'' అన్న స్ఫూర్తిదాయకమైన నినాదాన్ని గాంధీజీ ప్రకటించారు. “తనకు తానే స్వేచ్ఛాజీవిగా ప్రతి భారతీయుడూ పరిగణించుకోవాలి” అంటూ గాంధీ తన ప్రసంగంలో ప్రజలకు పిలుపునిచ్చారు.

 

***



(Release ID: 1743905) Visitor Counter : 216


Read this release in: English , Urdu , Hindi , Punjabi