జల శక్తి మంత్రిత్వ శాఖ

ఛత్తీస్‌గ‌ఢ్‌లో జల జీవన్ మిషన్ అమలును సంయుక్తంగా స‌మీక్షించిన ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, కేంద్ర జ‌లశ‌క్తి మంత్రి షెకావత్


- 2023 సెప్టెంబ‌రు నాటికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంను 'హర్ ఘర్ జల్‌' రాష్ట్రంగా మార్చుతామని హామీ ఇచ్చిన ముఖ్య‌మంత్రి

Posted On: 07 AUG 2021 3:38PM by PIB Hyderabad

ఈ రోజు రాయ్‌పూర్‌లోని ముఖ్యమంత్రి గృహంలో కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బాఘేల్‌లు సంయుక్తంగా రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలు తీరును సమీక్షించారు.
సెప్టెంబర్, 2023 నాటికి ఛత్తీస్‌గఢ్‌లోని మిగిలిన 39.59 లక్షల కుటుంబాల వారికి జల్ జీవన్ మిషన్ అమలు వేగవంతం చేయడానికి మరియు కుళాయి ద్వారా నీటి సరఫరాను అందించడానికి అవసరమైన అన్ని ర‌కాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ షెకావత్ 'హర్ ఘర్ జల్' లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రానికి అన్నివిధాల సహకారాన్ని అంద‌జేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్‌ను అనుస‌రించే లక్ష్యంతో మిష‌న్ ప‌ని చేస్తోంది. ప్రతి గ్రామీణ గృహానికి సాధారణ మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన తగిన పరిమాణంలో నిర్దేశిత నాణ్యతతో సురక్షితమైన కుళాయి నీటి సరఫరాను అందించడానికి రాష్ట్రం నెలవారీగా స‌మ‌గ్ర సమీక్ష చేపడుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. జలవనరులు, పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయ మరియు చట్టపరమైన వ్యవహారాలు, వ్యవసాయం మ‌రియు బయోటెక్నాలజీ, మరియు పశుసంవర్ధక & మత్స్యశాఖ మంత్రి, శ్రీ గురు రుద్ర కుమార్, పబ్లిక్ హెల్త్ & ఇంజనీరింగ్ మరియు గ్రామ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ రవీంద్ర చౌబే, ప్ర‌జా వైద్యం, ఇంజినీరింగ్‌, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల మంత్రి శ్రీ గురు రుద్ర కుమార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ అమితాబ్ జైన్‌తో పాటు భార‌త ప్ర‌భుత్వపు అద‌న‌పు కార్య‌ద‌ర్శి, జ‌ల్ జీవ‌న్ మిష‌న్ డైరెక్ట‌ర్‌శ్రీ భ‌ర‌త్‌లాల్‌తో పాటు జ‌ల్‌శ‌క్తికి మంత్రిత్వ శాఖ‌కు చెందిన ప‌లువురు సీనియ‌ర్ అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్ శ్రీ భరత్ లాల్ రాష్ట్రంలో జేజేఎం యొక్క ప్రణాళిక మరియు అమలును హైలైట్ చేస్తూ ఒక ప్రెజెంటేషన్ అందించారు. తరువాత, ఛత్తీస్‌గఢ్‌లో మిషన్ వేగవంతంగా అమలు చేయడంపై ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఇతర సీనియర్ రాష్ట్ర అధికారులతో వివరణాత్మక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు.
కోవిడ్ అంత‌రాయాలు క‌లిగిన‌ప్ప‌టికీ..
స‌రికొత్త జల్ జీవన్ మిషన్ ప్రారంభించిన సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 45.48 లక్షల కుటుంబాలలో కేవలం 3.20 లక్షల (7 శాతం) కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్‌లు ఉన్నాయ‌ని  తెలిపారు. గ‌డిచిన 23 నెలల్లో కోవిడ్ -19 మహమ్మారి, ఈ కార‌ణంగా లాక్‌డౌన్ అంతరాయాలు ఉన్నప్పటికీ 2.69 లక్షల గృహాలకు కుళాయి నీటి కనెక్షన్‌లు అందించబడ్డాయి. ఫలితంగా, ఇప్పుడు, ఛత్తీస్‌గఢ్ గ్రామాలలోని 5.89 లక్షల కుటుంబాలకు (13శాతం) కుళాయి నీటి సరఫరా అందుబాటులోకి వ‌చ్చింది.
నాలుగు రెట్లు అధికంగా నిధులు..
'హర్ ఘర్ జల్'గా మారడానికి గాను ఛ‌త్తీస్‌గ‌ఢ్.. 2021-22లో 22.14 లక్షల కుటుంబాలకు 2022-23లో 11.37 లక్షల కుళాయి నీటి కనెక్షన్ల‌ను మరియు 2023-24లో మిగిలిన 6.29 లక్షల కుళాయి నీటి కనెక్షన్లను అందించడానికి ప్రణాళిక వేసింది. ప్రతి ఇంటికి తాగు నీటి సరఫరా అందించాలనే రాష్ట్ర ద్రుఢ‌ సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర గ్రాంటును 2021-22లో రూ.1,908.96 కోట్ల‌కు పెంచారు. 2020-21లో అందించిన రూ.445.52 కోట్ల మొత్తం కంటే దాదాపుగా నాలుగు రెట్లు అధికం. జాతీయ శక్తి జీవన్ మిషన్, జల శక్తి మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రానికి మొద‌టి విడుత‌గా రూ.453.71 కోట్ల నిధుల‌ను అందించింది.
ఈ సంవత్సరం కేంద్రం కేటాయింపులు నాలుగు రెట్ల మేర పెర‌గ‌డంతో (రూ .1,908.96 కోట్లు), ఖర్చు చేయని నిధులు రూ.168.52 కోట్లు & 2020-21లో
రాష్ట్ర నిధుల‌లో షార్ట్‌ఫాల్‌గా ఉన్న రూ.113.04 కోట్ల సొమ్ము, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మ్యాచింగ్ ఫండ్‌తో క‌లుపుకొని చూస్తే 2021-22లో కుళాయి నీటి సరఫరాను అందించడానికి గాను ఛ‌త్తీస్‌గ‌ఢ్ వ‌ద్ల దాదాపు రూ.4,268 కోట్ల మేర‌ నిధులు అందుబాటులోకి ఉండ‌నున్నాయి. దీంతో రాష్ట్రానికి నిధుల కొరత లేకుండా పోతుంది. 2021-22లో ఛ‌త్తీస్‌గ‌ఢ్ 15వ ఆర్థిక క‌మీష‌న్ గ్రామీణ స్థానిక సంస్థలు/ పంచాయితీరాజ్ సంస్థ‌ల‌కు నీరు మరియు పారిశుధ్యం కోసం టై గ్రాంట్‌గా రూ.646 కోట్ల‌ను కేటాయించింది. దీనికి తోడు వ‌చ్చే అయిదేండ్లకు అంటే 2025-26 వరకు.. రూ.3,402 కోట్ల నిధుల హామీ ఉంది.
భారీగా ఉపాధి అవ‌కాశాలు..
మిష‌న్ అమ‌లు ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది గ్రామాల్లో ఆదాయాన్ని సృష్టించే అవకాశాలను మ‌రింత పెంపొందిస్తుంది. స్థానికంగా తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్స్, పంప్ ఆపరేటర్లు మొదలైన వాటి కోసం డిమాండ్ పెంచడానికి మిషన్ అమలు దోహ‌దం చేస్తుంది. సాధారణ, దీర్ఘకాలిక ప్రాతిపదికన త్రాగు నీటి సరఫరాను నిర్ధారించడానికి నీటి సరఫరా పథకాల నిర్వహణకు పెద్ద సంఖ్యలో నైపుణ్యం క‌లిగిన వారు అవ‌స‌ర‌మ‌వుతారు. దీనికి తోడు సిమెంట్, ఇటుకలు, పైపులు, కవాటాలు, నీరు/ శక్తి సమర్థవంతమైన పంపులు, కుళాయిలు మొదలైన వివిధ రకాల పదార్థాలకు డిమాండ్ ఏర్ప‌డుతుంది. తద్వారా స్థానికంగా లభించే కార్మికులతో పాటు దేశీయ తయారీ పరిశ్రమలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని సాకారం చేయడానికి గాను దోహ‌ద‌పడుతుంది.
విద్యాసంస్థ‌ల‌న్నింటికీ కుళాయి నీరు..
రాష్ట్రంలో పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు సురక్షితమైన తాగునీటిని అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్రకటించారు. దీనిని 2 అక్టోబర్ 2020న కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్లో 17,967 పాఠశాలలు (39%) మరియు 10,019 అంగన్‌వాడీ కేంద్రాలు (21%) మాత్రమే కుళాయి ద్వారా నీటి సరఫరాను కలిగి ఉన్నాయి. పిల్లలకి మెరుగైన ఆరోగ్యం, మెరుగైన పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత కోసం మిగిలిన అన్ని పాఠశాలలు, ఆశ్రమాలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలలో కొన్ని నెలల్లో సురక్షితమైన పంపు నీటిని అందించేలా చూడాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ రోజు కోరారు. జల జీవన్ మిషన్ కింద నీటి కొరత ఉన్న ప్రాంతాలు, నాణ్యత ప్రభావిత గ్రామాలు, ఆశించిన జిల్లాలు, ఎస్‌సీ/ ఎస్‌టీ మెజారిటీ గ్రామాలు మరియు సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) గ్రామాలకు త‌గిన ప్రాధాన్యత ఇవ్వాలి. నీటి నాణ్యత పర్యవేక్షణ మ‌రియు నిఘా కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనికోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, స్వయం సహాయక బృందాల సభ్యులు, పీఆర్‌ఐ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు మొదలైనవారు ఫీల్డ్ టెస్ట్ కిట్‌లను (ఎఫ్‌టీకేలు) ఉపయోగించి నీటి నమూనాలను కాలుష్యం కోసం పరీక్షించే విధంగా త‌గిన శిక్షణ ఇస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో, మొత్తం 68 ల్యాబ్‌లలో 9 ల్యాబ్‌లు మాత్రమే ఎన్ఏబీఎల్‌ గుర్తింపు పొందాయి. రాష్ట్రం నీటి పరీక్షా ప్రయోగశాలలను అప్‌గ్రేడ్ చేయ‌డం మరియు వాటి ఎన్ఏబీఎల్‌ అక్రిడిటేషన్‌ను పొందాల్సి ఉంది. 'స‌బ్‌కే సాథ్.. సబ్‌కే వికాస్.. సబ్‌కే విశ్వాస్' అనే ప్రధాన మంత్రి దృష్టి సూత్రాన్ని అనుసరించి, మిషన్ యొక్క నినాదం 'ఎవరూ వదిలివేయ‌కుండా' గ్రామంలోని ప్రతి ఇంటికి పంపు నీటి కనెక్షన్ అందించాలి.
నిర్వ‌హ‌ణ స్థానికి సంస్థ‌లకే..
జల్ జీవన్ మిషన్ అనేది ‘బాటమ్ అప్’ విధానం. ఇక్కడ ప్రణాళిక నుండి అమలు, నిర్వహణ, ఆపరేషన్ మరియు నిర్వహణ వరకు అన్నింటిలోనూ సంఘం కీలక పాత్రను పోషిస్తుంది. దీనిని సాధించడానికి గ్రామ ప్రభుత్వం వాటర్ & సానిటేషన్ కమిటీ (వీడ‌బ్ల్యుఎస్‌సీ)/ పాణి సమితిని బలోపేతం చేయడం, రాబోయే ఐదేళ్ల పాటు గ్రామ కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడం, గ్రామ సంస్థలను నిర్వహించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ఏజెన్సీలను (ఐఎస్ఏ లు) అమలు చేయడం వంటి సహాయక చర్యలను చేపట్టి ప్రజలలో అవగాహన కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 19,698 గ్రామాలలో మొత్తం 19,632 పానీ సమితి/ వీడబ్ల్యుఎస్‌సీలు ఏర్పాటు చేయబడ్డాయి. దీనికి తోడు 19,668 విలేజ్ యాక్షన్ ప్లాన్ రూపొందించబడింది. ఈ రోజు వ‌ర‌కు రాష్ట్రంలో నిమగ్నమైన సహాయక ఏజెన్సీలు లేవు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న పెద్ద సంఖ్యలో గ్రామాలను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రం అమలు సహాయక ఏజెన్సీలను (ఐఎస్ఏల‌ను) నిమగ్నం చేయాల్సి ఉంటుంది. అలాంటి హ్యాండ్‌హోల్డింగ్ మరియు సామ‌ర్థ్య‌పు పెంపు అనేది ప్రతి ఇంటికి సురక్షితమైన నీటి సరఫరా కోసం నీటి సరఫరా మౌలిక సదుపాయాల యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం మరియు ఆపరేషన్ & నిర్వహణను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 15 ఆగస్టు, 2019న జల్‌జీవన్ మిషన్ ప్రారంభించిన సమయంలో దేశంలోని 18.98 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో కేవలం 3.23 కోట్ల (17 శాతం) క‌టుంబాల‌కు మాత్రమే పంపు నీటి కనెక్షన్లు ఉన్నాయి.
1.06 లక్షలకు పైగా గ్రామాల‌లో ‘హర్ ఘర్ జల్’..
కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్‌డౌన్‌ అంతరాయాలు ఉన్నప్పటికీ, గత 23 నెలల్లో జల్ జీవన్ మిషన్ 4.67 కోట్ల పంపు నీటి కనెక్షన్‌లను అందించింది.
ఫలితంగా నేడు, 7.90 కోట్ల (41.35%) కుటుంబాలకు కుళాయి నీటి సరఫరా అందుబాటులో ఉంది. గోవా, తెలంగాణ, అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా & నగర్ హవేలి మరియు డామన్ & డ‌య్యు,  పుదుచ్చేరి గ్రామీణ ప్రాంతాలు దాదాపు 100 శాతం ఇంటింటి కుళాయి కనెక్షన్ సాధించి 'హర్ ఘర్ జల్' గా మారాయి. ప్రస్తుతం 78 జిల్లాలు, 910 బ్లాకులు, 54 వేలకు పైగా వివిధ గ్రామ పంచాయితీలు, 1.06 లక్షలకు పైగా గ్రామాలు ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించాయి.
                                *****


(Release ID: 1743770) Visitor Counter : 238


Read this release in: English , Urdu , Hindi , Bengali