ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం
రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 51.16 కోట్లకు పైగా టీకా డోసుల అందజేత
ఇంకా రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద 2.30 కోట్లకు పైగా డోసుల నిల్వ
Posted On:
06 AUG 2021 10:19AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయటంతో బాటు విస్తరించింది. జూన్ 21న సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరిన్ని టీకా డోసులు అందుబాటులో ఉంచటం ద్వారా టీకాలివ్వటాన్ని బాగా పెంచింది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించేలా టీకా డోసుల అందుబాటుపై ముందస్తు సమాచారం ఇస్తూ సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేసింది
దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అండగా నిలబడి టీకా మందును ఉచితంగా అందిస్తోంది. సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్త దశలో భాగంగా కేంద్రం దేశంలోని టీకా మందు తయారీ సంస్థలు తయారుచేసే టీకా డోసులలో 75% మేరకు ఉచితంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందిస్తోంది
టీకా డోసులు
|
(2021 ఆగస్టు 6 నాటికి)
|
సరఫరా చేసినవి
|
51,16,46,830
|
సరఫరాలో ఉన్నవి
|
20,49,220
|
వాడినవి
|
49,19,73,961
|
అందుబాటులో ఉన్న నిల్వ
|
2,30,03,211
|
ఇప్పటిదాకా 51.16 కోట్లకు పైగా (51,16,46,830) టీకా డోసులు రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చింది. మరో 20,49,220 డోసులు సరఫరాలో ఉన్నాయి. ఈ ఉదయం 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు వృధా అయిన డోసులతో సహా మొత్తం వాడినది 49,19,73,961 డోసులు. 2.30 కోట్లకు పైగా (2,30,03,211) డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర, ప్రైవేట్ ఆస్పత్రుల దగ్గర ఇంకా ఉన్నాయి.
****
(Release ID: 1743226)
Visitor Counter : 168