సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కేవిఐసి రూపొందించిన ప్లాస్టిక్-మిశ్రమ చేతి తయారీ కాగితం విశిష్టమైనదిగా గుర్తింపు - వ్యర్థ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసిన ఆవిష్కరణగా పేటెంట్
Posted On:
05 AUG 2021 2:45PM by PIB Hyderabad
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవిఐసి) ప్రకృతిని ప్లాస్టిక్ ముప్పును తగ్గించడానికి అభివృద్ధి చేసిన వినూత్న ప్లాస్టిక్-మిశ్రమ చేతి తయారీ కాగితం కోసం పేటెంట్ నమోదు చేసుకుంది.
పేటెంట్ సర్టిఫికెట్ ని జైపూర్ కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇనిస్టిట్యూట్ (కెఎన్‌హెచ్‌పిఐ)కి ఆగస్టు 2న, కంట్రోలర్ ఆఫ్ పేటెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా అందజేసింది. ప్లాస్టిక్-మిశ్రమ చేతి తయారీ కాగితాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనకు సెప్టెంబర్ 2018 లోనే బీజం పడింది. కేవలం రెండు నెలల్లో, అంటే నవంబర్ 2018 లో, కెఎన్‌హెచ్‌పిఐ లోని శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేసింది.
ప్లాస్టిక్-మిశ్రమ చేతి తయారీ కాగితం ప్రాజెక్ట్ రీప్లాన్ (రెడ్యుసింగ్ ప్లాస్టిక్ ఫ్రమ్ నేచర్) కింద అభివృద్ధి చేసారు. భారతదేశంలో ఇదే మొదటి ప్రాజెక్ట్, ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను డీ స్ట్రక్చర్డ్, డీగ్రేడెడ్, డైల్యూటెడ్ మరియు పేపర్ పల్ప్‌తో చేతితో కాగితాన్ని తయారు చేయడం, ప్రకృతి నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం జరుగుతుంది. ఒక సారే వినియోగించే ప్లాస్టిక్ ముప్పుపై పోరాడాలన్న ప్రధాని పిలుపుతో ఆవిష్కరణ సమలేఖనం చేశారు.
ఈ పేటెంట్ మంజూరు చేయడం ప్రపంచంలోనే అపూర్వమైన కేవిఐసి ప్రత్యేక ఆవిష్కరణగా పెద్ద గుర్తింపు లభించినట్టు. వ్యర్థ-ప్లాస్టిక్ మిశ్రమ చేతి తయారీ కాగితం ఉత్పత్తి స్థిరమైన ఉపాధిని సృష్టించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడటం అనే రెండు లక్ష్యాలకు ఉపయోగపడుతుంది.
కేవిఐసి, రాష్ట్ర ఖాదీ బోర్డుల కింద దేశంలో దాదాపు 2640 మెట్రిక్ టన్నుల చేతి తయారీ కాగితాల తయారీ యూనిట్లు ప్రతి సంవత్సరం ప్రకృతి నుండి 3000 మెట్రిక్ వ్యర్థాల ప్లాస్టిక్‌ని తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదే సమయంలో, ఇది వేస్ట్ ప్లాస్టిక్ సేకరణ, శుభ్రపరచడం మరియు ప్రాసెసింగ్ లో వేలాది కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించగలదు. అందువల్ల, ఇది స్థిరమైన అభివృద్ధికి సరైన నమూనా. కేవిఐసి త్వరలో ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్‌మేడ్ పేపర్ తయారీలో పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది, దేశీయ పేపర్ పరిశ్రమతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటుంది.
కేవిఐసి అభివృద్ధి చేసిన సాంకేతికత అధిక, తక్కువ సాంద్రత కలిగిన వ్యర్థ పాలిథిన్ రెండింటినీ ఉపయోగిస్తుంది, ఇది కాగితానికి అదనపు బలాన్ని జోడించడమే కాకుండా ఖర్చును 34%వరకు తగ్గిస్తుంది. ఉత్పత్తి పునర్వినియోగపరచదగినది. పర్యావరణ అనుకూలమైనది. కేవిఐసి క్యారీ బ్యాగ్‌లు, ఎన్విలప్‌లు, ఫైల్‌లు/ఫోల్డర్‌లు మొదలైన ఉత్పత్తులను ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్‌మేడ్ పేపర్‌తో అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు కేవిఐసి జైపూర్ నగరంలోని దాదాపు 40 మిలియన్ టన్నుల వ్యర్థ ప్లాస్టిక్‌ని ఉపయోగించి దాదాపు 13 లక్షలకు పైగా ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్‌మేడ్ పేపర్ క్యారీ బ్యాగ్‌లను విక్రయించింది. దీని ద్వారా సుమారు రూ.1.30కోట్ల ఆదాయాన్నీ సముపార్జిస్తున్నారు.
****
(Release ID: 1743213)
Visitor Counter : 207