గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అందరకీ గృహ సదుపాయం పథకం కింద 8467000కి పైగా ప్రాజెక్టులలో నిర్మాణాలు మొదలు
50,16,642 మంది లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ
Posted On:
05 AUG 2021 1:56PM by PIB Hyderabad
దేశంలో వాస్తవ గృహ అవసరాల్ని అంచనా వేయడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-యు) పధకం కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో(యుటీలు) డిమాండ్ సర్వేను చేపట్టారు. దీని ప్రకారం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా నివేదించబడిన డిమాండ్ సుమారు 112.24 లక్షలు. వారి అంచనా డిమాండ్ ప్రకారం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సమర్పించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనల ఆధారంగా దేశవ్యాప్తంగా మొత్తం 112,95,047 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి. మొత్తం మంజూరు చేయబడిన ఇళ్లకుగాను 84,67,568 ఇండ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇందులో 50,16,642 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
రాష్ట్రం/ యుటీల వారీగా వివరాలు అనుబంధంలో పేర్కొనబడ్డాయి
పథకం మెరుగ్గా పురోగతి సాధించింది. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం అంచనా వేసిన ఇండ్ల డిమాండ్‌ని పరిశీలించి.. మంత్రిత్వ శాఖ ఆమేరకు ఇండ్లను మంజూరు చేసింది. అందులో 50 లక్షలకు పైగా ఇండ్లు ఇప్పటికే పూర్తయ్యాయి/లబ్ధిదారులకు అందించబడ్డాయి. మిగిలినవి వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయి. మిషన్ వ్యవధిలో 'అందరికీ హౌసింగ్' అనే విజన్ సాధించడానికి ఈ పథకం బాగా సిద్ధంగా ఉంది.
2022 నాటికి ‘అందరికీ హౌసింగ్’ మిషన్ సాధించడానికి గాను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు మిగిలిన మంజూరు చేయబడిన గృహాల నిర్మాణాన్ని చేపట్టాలని, ఇప్పటికే ప్రారంభించిన ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి, ఆయా నగరాల వారీగా డిమాండ్‌ను సంతృప్తి పరచాలని కేంద్ర సూచించింది. దీనికి తోడు ఈ మంత్రిత్వ శాఖ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి క్రింది చర్యలు తీసుకుంది:
1. ఆవర్తన సమీక్ష సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు మరియు క్షేత్ర సందర్శనల ద్వారా పథకం పురోగతిని మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.
2. ఈ పథకానికి నిరంతరాయంగా నిధుల ప్రవాహాన్ని నిర్ధారించడానికి, బడ్జెట్ వనరులతో పాటు, పథకాన్ని వేగంగా అమలు చేయడానికి దశలవారీగా అదనపు బడ్జెట్ వనరులను (ఈబీఆర్) పెంచడం కోసం రూ.60,000 కోట్ల మేర నేషనల్ అర్బన్ హౌసింగ్ ఫండ్ (ఎన్‌యుహెచ్ఎఫ్)
సృష్టించబడింది.
3.పీఎంఏవై (యు)- ఎంఐఎస్ (మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), భువన్ పోర్టల్, పీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) వంటి వివిధ ఇన్‌ఫర్మెషన్ / స్పేస్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా మంజూరు చేయబడిన ఇండ్ల జియో-ట్యాగింగ్/ జియో-ఫెన్సింగ్ ద్వారా పర్యవేక్షించడం మరియు త్వరితగతిన కేంద్ర సహాయాన్ని విడుదల చేయడం జరుగుతోంది.
4. ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ (డీబీటీ) విధానం ద్వారా చెల్లింపులు, లబ్ధిదారుల ఆధార్ సీడింగ్‌లు పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తోంది.
5. వేగవంతంగా ఇండ్ల అందజేతకు త పథకం కింద వివిధ ప్రత్యామ్నాయ మరియు వినూత్న నిర్మాణ సాంకేతికతలు ప్రోత్సహించబడ్డాయి.
6.అందరకీ గృహాల అందజేతకు గాను వెబ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ; సీఎల్ఎస్ఎస్ ఆవాస్ పోర్టల్ (సీఎల్ఏపీ) అభివృద్ధి చేయబడింది. ఈ వ్యవస్థలో ఎంఓహెచ్‌యుఏ, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు, ప్రాథమిక రుణ సంస్థలు, లబ్ధిదారులు మరియు పౌరులు వంటి వాటాదారులు రియల్ టైమ్ ఎన్‌వీరాన్‌మెంట్‌లో కలిసి ముందుకు సాగేందుకు వీలుకలుగుతుంది.
7.లబ్ధిదారుల ద్వారా సబ్సిడీ స్థితిని ట్రాక్ చేయడంతో పాటు అప్లికేషన్ల వేగవంతమైన ప్రాసెసింగ్‌ను కూడా ఈ పోర్టల్ సులభతరం చేస్తుంది. పీఎంఏవై-యు అవార్డ్స్ 2021, 100-రోజుల ఛాలెంజ్ ద్వారా ముందుగా నిర్వచించిన సూచికల మేరకు పనితీరు కోసం గ్రౌండింగ్, పూర్తి చేయడం, గృహా ప్రవేశాలు మరియు 21.06.2021 నుండి 30.09.2021 హెచ్ఎఫ్ఏ సాధించిన నగరాలు/ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల' ప్రకటనపై కూడా దృష్టి సారించింది.
పీఎంఏవై-యు యొక్క ఇన్-సిటు స్లమ్ పునరాభివృద్ధి (ఐఎస్ఎస్ఆర్) విభాగంలో భాగంగా కేంద్రం పట్టణ భారతదేశాన్ని మురికివాడలు లేని దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకు మురికివాడల పునరాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. అర్హత ఉన్న మురికివాడలలో నివాసితులకు ఇండ్లను అందించడానికి.. మురికివాడల కింద అదమీకరించిన సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా భూమిని వనరుగా ఉపయోగించుకునే వ్యూహాన్ని ఇది స్వీకరించింది.మురికివాడల పునరాభివృద్ధి కోసం ప్రాజెక్టులు సంబంధిత రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా తయారు చేయబడతాయి. రాష్ట్రస్థాయిలో మంజూరు, పర్యవేక్షణ కమిటీలు (ఎస్ఎల్ఎంసీ) ద్వారా ఆమోదించబడుతాయి. సంబంధిత ఎస్ఎల్ఎస్ఎంసీ నుండి ఆమోదం పొందిన తరువాత, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం కేంద్రానికి ఆయా ప్రతిపాదనలను సమర్పిస్తాయి. అనంతరం ఈ మంత్రిత్వ శాఖ పథకం యొక్క ఐఎస్ఎస్ఆర్ కింద ఇంటికి రూ.1 లక్ష కేంద్ర సహాయాన్ని అందిస్తుంది.
అనుబంధం
పీఎంఏవై-యు కింద మంజూరు చేయబడిన, నిర్మాణం ప్రారంభమైన మరియు పూర్తయిన/
లబ్ధిదారులకు అందజేసిన ఇండ్ల సంఖ్య రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా వివరాలు
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
గృహాల నిర్మాణం యొక్క భౌతిక పురోగతి
(ఇండ్ల సంఖ్య)
|
మంజూరు చేసినవి
|
నిర్మాణం ప్రారంభమైనవి^
|
నిర్మించి/ పంపిణీ చేయబడినవి^
|
1
|
అండమాన్ నికోబార్ దీవులు (యుటీ)
|
602
|
47
|
43
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
20,37,786
|
15,17,677
|
4,62,781
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
7,427
|
7,925
|
3,412
|
4
|
అస్సాం
|
1,37,744
|
1,00,583
|
29,711
|
5
|
బీహార్
|
3,63,895
|
2,16,383
|
93,713
|
6
|
ఛండీగఢ్ (యుటీ)
|
1,524
|
6,484
|
6,484
|
7
|
ఛత్తీస్‌గఢ్
|
2,98,062
|
2,12,900
|
1,40,155
|
8
|
డీఎన్‌హెచ్ మరియు డీడీ (యుటీ)
|
7,791
|
7,344
|
5,134
|
9
|
ఢిల్లీ (ఎన్‌సీఆర్)
|
25,248
|
65,828
|
49,228
|
10
|
గోవా
|
4,074
|
4,016
|
4,016
|
11
|
గుజరాత్
|
8,24,185
|
7,44,304
|
5,82,583
|
12
|
హర్యానా
|
2,84,539
|
77,114
|
44,119
|
13
|
హిమాచల్ ప్రదేశ్
|
12,565
|
10,678
|
5,763
|
14
|
జమ్ము & కాశ్మీర్ (యుటీ)
|
56,151
|
42,928
|
10,654
|
15
|
జార్ఖండ్
|
2,34,482
|
1,64,742
|
1,02,287
|
16
|
కర్ణాటక
|
6,90,819
|
4,55,594
|
2,47,492
|
17
|
కేరళ
|
1,29,307
|
1,22,805
|
99,840
|
18
|
లద్ధాఖ్ (యుటీ)
|
1,777
|
1,038
|
480
|
19
|
లక్షద్వీప్ (యుటీ)
|
-
|
-
|
-
|
20
|
మధ్యప్రదేశ్
|
8,56,910
|
7,66,843
|
4,55,169
|
21
|
మహారాష్ట్ర
|
13,23,124
|
7,53,824
|
4,96,214
|
22
|
మణిపూర్
|
53,535
|
37,591
|
5,571
|
23
|
మేఘాలయ
|
5,329
|
2,462
|
1,668
|
24
|
మిజోరాం
|
39,867
|
19,510
|
4,688
|
25
|
నాగాలాండ్
|
34,227
|
30,043
|
6,052
|
26
|
ఒడిశా
|
1,77,187
|
1,31,999
|
94,855
|
27
|
పుదుచ్చేరి (యుటీ)
|
14,838
|
15,086
|
6,255
|
28
|
పంజాబ్
|
1,08,662
|
86,039
|
44,072
|
29
|
రాజస్థాన్
|
2,14,185
|
1,57,574
|
1,31,189
|
30
|
సిక్కిం
|
635
|
638
|
342
|
31
|
తమిళనాడు
|
7,14,885
|
6,08,407
|
4,42,097
|
32
|
తెలంగాణ
|
2,24,206
|
2,35,597
|
2,05,120
|
33
|
త్రిపుర
|
92,035
|
67,044
|
52,810
|
34
|
ఉత్తర ప్రదేశ్
|
17,29,427
|
13,57,031
|
8,73,370
|
35
|
ఉత్తరాఖండ్
|
44,639
|
28,755
|
20,940
|
36
|
పశ్చిమ బెంగాల్
|
5,29,101
|
3,96,458
|
2,74,058
|
మొత్తం *:
|
112,95,047
|
84,67,568
|
50,16,642
|
* ఇందులో.. సీఎల్ఎస్ఎస్ కింది 14,277 మంది లబ్ధిదారులకు సంబంధించి ఇటీవల బ్యాంకులకు, హెచ్ఎఫ్‌సీలకు విడుదల చేసిన సబ్సిడీ కూడా ఉంది.
^ జేఎన్ఎన్‌యుఆర్ఎం పథకం కింద గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన గృహాలు, 2014 తరువాత పూర్తి చేసిన ఇండ్లు ఉన్నాయి.
ఈ సమాచారాన్ని గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1742914)
|