విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం
Posted On:
05 AUG 2021 1:24PM by PIB Hyderabad
కాలుష్య రహిత ఇంధన ఉత్పాదన వ్యవస్థాపిత ఉత్పాదకత సామర్ధ్యాలు జూన్ 30, 2021నాటికి మొత్తం 384115.94 మెగావాట్లుగా ఉండగా, ఇందులో 234058.22 మెగావాట్లు థర్మల్ కాగా, 46322.22 మెగావాట్లు జలవిద్యుత్తు, 96955.51 మెగావాట్లు పునరుత్పాదక ఇంధన వనరులు (ఆర్ఇఎస్), 6780 మెగావాట్లు అణు విద్యుత్ గా ఉన్నాయి.
కాలుష్య రహిత ఇంధన భవిష్యత్ ఉత్పాదక సామర్ధ్య ప్రణాళికలు, లక్ష్యాలు దిగువన పేర్కొనడం జరిగింది.
1.) దేశంలో 2024-25నాటికి ప్రారంభం కానున్న సంప్రదాయ విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశలలో ఉంది. ఇవి థర్మల్ 36,765 మెగావాట్లు కాగా, హైడ్రో 10,164.50 మెగావాట్లు, అణు విద్యుత్ 4,800 మెగావాట్లు ఉత్పాదక సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.
2.) భారత ప్రభుత్వం 2021-22 చివరి నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 1,75,000 మెగావాట్ల వ్యవస్థాపిత సామర్ధ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టింది. ఇందులో సౌరశక్తి ద్వారా 1,00,000 మెగావాట్ల , పవనశక్తి ద్వారా 60,000 మెగావాట్ల , జీవద్రవ్యం (బయోమాస్) నుంచి10,000 మెగావాట్లు, చిన్న జల ప్రాజెక్టుల నుంచి 5,000 మెగావాట్లను లక్ష్యంగా పెట్టింది.
కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో స్వయం సామర్ధ్యాన్ని సాధించి, బొగ్గు, ఇతర కాలుష్య కారకాల నుంచి ముక్తం అయ్యేందుకు ప్రభుత్వం దిగువన పేర్కొన్న చర్యలను తీసుకుంది.
1.) తన స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)కి సంబంధించిన హరిత వాయువు ఉద్గారాల తీవ్రతను 2005లో ఉన్నస్థాయి నుంచి 2030 నాటికి 33 నుంచి 35 శాతం తగ్గించటమే కాక, 2030 నాటికి దాదాపు 40శాతం సంచిత విద్యుత్ శక్తి సామర్ధ్యాన్ని శిలాజేతర ఆధారిత ఇంధనాన్ని సాధించేందుకు భారత్ కట్టుబడి ఉంది.
2.) స్థిరవిద్యు దవక్షేపకం (ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు -ఇఎస్‌పి) ఆధునీకరణ, శిలాజింధన విద్యుత్ ప్లాంట్లలో వెలువడే ఫ్లూగ్యాస్ ను గంధకరహితం చేసే (ఫ్లూగ్యాస్ డీసల్ఫరైజేషన్) వ్యవస్థ ఏర్పాటు, సస్పెండెడ్ పర్టిక్యులేట్ మాటర్ (ఎస్‌పిఎం), ఎస్ఒ1, ఎన్ఒఎక్స్ (NOx)నియమాలకు అనుగుణంగా ఉండేందుకు కంబషన్ మాడిఫికేషన్ వంటి పలు చర్యలను థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు తీసుకుంటున్నాయి.
***
(Release ID: 1742869)
Visitor Counter : 234