గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వర్షం నీటి సంరక్షణపై రూపొందిన మోడల్ బిల్డింగ్ బై లాస్ , 2016ను అమలు చేస్తున్న 33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు

Posted On: 05 AUG 2021 1:58PM by PIB Hyderabad

వర్షం నీటిని ఒడిసి పట్టి రక్షించే అంశానికి కేంద్ర గృహ నిర్మాణంపట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ అంశాన్ని ఢిల్లీ  యూనిఫైడ్ బిల్డింగ్ బై లాస్,మోడల్ బిల్డింగ్ బై లాస్ , 2016 మరియు పట్టణ మరియు ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన మరియు అమలు కోసం రూపొందిన మార్గదర్శకాలు  2014లో చేర్చడం జరిగింది.వీటిని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తమతమ పరిస్థితులకు తగినట్టుగా అమలు చేయవలసి ఉంటుంది. మోడల్ బిల్డింగ్ బై లాస్ ప్రకారం 100 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన  ప్లాట్ లో నిర్మించే నిర్మాణాలకు  సంబంధించి అనుమతులు కోరుతూ సమర్పించే ప్లాన్లలో  తప్పనిసరిగా వర్షపు నీటి సేకరణ ప్రతిపాదనను తప్పనిసరిగా చేర్చవలసి ఉంటుంది.   వర్షం నీటిని ఒడిసి పట్టడానికి వీలు కల్పించే విధంగా భవన నిర్మాణ డిజైన్లను సిద్ధం చేయడాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందిన నూతన భవన నిర్మాణ చట్టాలను 33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.

 

పట్టణ ప్రాంతాల అభివృద్ధి అనేది రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశం. దీనితో నీటిని ఒడిసి పట్టడంసంరక్షించడం లాంటి అంశాలపై కేంద్ర గృహ నిర్మాణంపట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎటువంటి సర్వేలను నిర్వహించదు. చట్టాలను రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేయవలసి ఉంటుంది. 

జల సంరక్షణ మరియు వర్షం నీటి సంరక్షణపై  అవగాహన కల్పించడానికి 2019లో  జల సంరక్షణ అభియాన్ కార్యక్రమాన్ని  జల సంరక్షణ మంత్రిత్వ శాఖ  దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణంపట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చురుగ్గా పాల్గొని దీనికోసం సమాచారవిద్య మరియు కమ్యూనికేషన్ కార్యక్రమాలనురూపొందించింది.  జల సంరక్షణ, వర్షం నీటి సంరక్షణ, శుద్ధి చేసిన వ్యర్ధ జలాలను తిరిగి వినియోగించడం,  వనరుల పునరుజ్జీవం, మొక్కలను నాటడం లాంటి కార్యక్రమాలను అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. 

జల్ శక్తి  అభియాన్ తో పాటు ప్రజలకు జల వనరుల సంరక్షణపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయడానికి 'వర్షం నీటిని ఒడిసి పట్టు' కార్యక్రమం కూడా అమలు జరుగుతున్నది. 2021 మార్చి 22వ తేదీన ఈ కార్యక్రమాన్ని' వర్షం కురిసినప్పుడు అది కురిసే చోట వర్షం నీటిని పట్టు' అనే నినాదంతో అమలు చేయడం జరుగుతున్నది.  చెక్ డ్యామ్‌లు,ఇంకుడు గుంటలు , ఇళ్ల మిద్దెలపై వర్షం నీటి సంరక్షణ సదుపాయాలను కల్పించడంతో పాటు చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ఆక్రమణ ,పూడికలను తొలగించి  ఎగువ ప్రాంతాల నుంచి నీరు పారేలా చేయడం,  మెట్ల బావులకు మరమ్మతులు చేయడం మరియు పనికిరాని బోర్-బావులు మరియు ఉపయోగించని బావులను ఉపయోగం లోకి తేవడం జలవనరులను సంరక్షించడానికి ప్రజల సహకారంతో కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతున్నది. 

 ఈ సమాచారాన్ని గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ రోజు లోక్ సభలోఒక ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఇచ్చారు.

 

***

 



(Release ID: 1742738) Visitor Counter : 109


Read this release in: Bengali , English , Punjabi