భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించడానికి ఆటోమేటిక్ వ్యవసాయ వాతావరణ కేంద్రాలు.... కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


రోజువారీ వ్యవసాయ కార్యకలాపాలపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వ్యవసాయ వాతావరణ సమాచార సలహాలు

ప్రస్తుతం 43 మిలియన్లకు పైగా రైతులు నేరుగా ఎస్ఎంఎస్ ల ద్వారా వ్యవసాయ వాతావరణ సలహాలను పొందుతున్నారు

గ్రామీణ కృషి మౌసం సేవ పథకం కింద బ్లాక్ స్థాయి వ్యవసాయ వాతావరణ సలహా సేవలను పెంచడానికి 200 జిల్లా అగ్రోమెట్ యూనిట్ల ఏర్పాటు

Posted On: 03 AUG 2021 1:29PM by PIB Hyderabad

ప్రజలకు ముఖ్యంగా  రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించడానికి భారత వాతావరణ శాఖ ఆటోమేటిక్ వ్యవసాయ వాతావరణ కేంద్రాలను నెలకొల్పుతున్నదని   కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రాల, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, అణుశక్తి, అంతరిక్ష విభాగాల శాఖల ( స్వతంత్ర) సహాయ మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్య సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో డాక్టర్ జితేంద్ర సింగ్ భారతీయ వ్యవసాయ పరిశోధన  నెట్‌వర్క్ కింద ఉన్న వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలలో  జిల్లా అగ్రోమెట్ యూనిట్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. బ్లాక్ స్థాయిలో వాతావరణ సలహా సేవలను విస్తరించడానికి   గ్రామీణ కృషి మౌసం సేవ  పథకం కింద జిల్లా అగ్రోమెట్ యూనిట్‌లలో అదనంగా 200 అగ్రోమెట్ అడ్వైజరీ సర్వీసెస్ నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

దేశంలో రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించి పాడి పశువుల పెంపకంవ్యవసాయ కార్యక్రమాలను చేపట్టడానికి విధానాలను రూపొందించడానికి భారత వాతావరణ శాఖభారత వ్యవసాయ పరిశోధనా మండలిరాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కలసి సంయుక్తంగా అమలు చేసే గ్రామీణ కృషి మౌసం సేవ  ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా జిల్లా బ్లాకు స్థాయిలో వాతావరణ పరిస్థితులపై  మధ్యస్థ వాతావరణ సూచనలు సిద్ధం చేస్తారు.  వీటిని ప్రతి మంగళవారం మరియు శుక్రవారాల్లో రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో నెలకొల్పిన అగ్రోమెట్ ఫీల్డ్ యూనిట్లు,జిల్లా అగ్రోమెట్ యూనిట్ల ద్వారా రైతులు, ప్రజలకు అందించడం జరుగుతుంది. 

  రోజువారీ వ్యవసాయ కార్యకలాపాలపై నిర్ణయం తీసుకునే అంశంలో  ఈ అగ్రోమెట్ సలహాలు రైతులకు  సహాయపడతాయి.  వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యవసాయ వనరుల వినియోగంపై నిర్ణయాలు తీసుకుని వీటి ద్వారా ఎక్కువ లభ్డిని పొందడానికి ఈ సలహాలు ఉపయోగపడతాయి.  ప్రతికూల  వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ సూచనలను అమలు చేసి పంట దిగుబడిని ఎక్కువ చేసి నష్టాలను రైతులు తగ్గించుకోగలుగుతారు. 

వర్షాలు, వాతావరణ మార్పులకు సంబంధించిన తాజా సమాచారాన్ని గ్రామీణ కృషి మౌసం సేవ పథకం లో భాగంగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తూ నష్టాలను తగ్గించడానికి, రైతులు  అమలు చేయవలసిన చర్యలపై ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తున్నది. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి   హెచ్చరికలు, ముందస్తు జాగ్రత్తల వివరాలను  రాష్ట్ర వ్యవసాయ శాఖలకు కూడా అందజేయడం జరుగుతున్నది. 

ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాదూరదర్శన్ రేడియోఇంటర్నెట్ వంటి సమాచార వ్యవస్థలతో పాటు వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ రూపొందించిన కిసాన్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ లను పంపడం, ప్రైవేట్ రంగ సహకారంతో రైతులకు వ్యవసాయ వాతావరణ సూచనలు, సలహాలను అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం 43.37 మిలియన్ రైతులు ఎస్ఎంఎస్   ద్వారా అగ్రోమెట్ సలహాలను పొందుతున్నారు. 

రైతులు తమ జిల్లాకు సంబంధించిన హెచ్చరికలు మరియు సంబంధిత అగ్రోమెట్ సలహాలతో సహా వాతావరణ సమాచారాన్ని పొందడానికి వీలు కల్పించే విధంగా  భారత భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ  మేఘదూత్’ అనే మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చింది.

***


(Release ID: 1741876) Visitor Counter : 252


Read this release in: English , Urdu , Punjabi