సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

వృద్ధుల కోసం పథకాలు

Posted On: 03 AUG 2021 2:20PM by PIB Hyderabad

వృద్ధులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపే హక్కును 'తల్లిదండ్రులు, వృద్ధుల శ్రేయస్సు, సంరక్షణ చట్టం-2007' (ఎండబ్ల్యూపీఎస్‌సీ) గుర్తించింది. తల్లిదండ్రులు, వృద్ధులకు ఈ చట్టం ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు, వారి సంరక్షణ సరిగా జరక్కపోతే ఖర్చుల కోసం నగదు ఇవ్వవచ్చు. తల్లిదండ్రులు లేదా వృద్ధులను వదిలించుకోవాలని చూసిన సంతానం లేదా బంధువులకు ఈ చట్టం ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5 వేల వరకు జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఎండబ్ల్యూపీఎస్‌సీ చట్టాన్ని నోటిఫై చేశాయి. వృద్ధుల బాగోగులు చూసుకునే నిర్వహణ అధికారులు, నిర్వహణ ట్రైబ్యునళ్లు, అప్పిలేట్ ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాయి.

    వృద్ధులకు అన్యాయం జరక్కుండా చూడడంలో ప్రభుత్వ నిబద్ధతను చాటే, ప్రస్తుతం ఉన్న 'వృద్ధులపై జాతీయ విధానాన్ని' (ఎన్‌పీవోపీ) 1999లో ప్రకటించారు. మారుతున్న జనాభా రీతులు, వృద్ధుల సామాజిక-ఆర్థిక అవసరాలు, సామాజిక విలువల వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతిని దృష్టిలో ఉంచుకుని, ఎన్‌పీవోపీ-1999కి బదులుగా తీసుకొచ్చే కొత్త
జాతీయ విధానం తుది దశలో ఉంది. 

    కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమ భౌమిక్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.



(Release ID: 1741869) Visitor Counter : 361