రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అనుసంధానత, అంతర్గత ఆవశ్యకత, నిధుల లభ్యత ఆధారంగా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఉన్నతీకరణ
Posted On:
02 AUG 2021 2:37PM by PIB Hyderabad
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల బాధ్యతను నిర్వహిస్తోంది. రాష్ట్ర రహదారులు నిర్వహణ భాధ్యత పూర్తిగా రాష్ట్రాలది. అయినప్పటికీ కొన్ని రహదారుల విషయమై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను (యూటీలను) కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖనూ సంప్రదించారు. రాష్ట్ర రహదారులను కేంద్రం ఆధ్వర్యంలోని జాతీయ రహదారులుగా మార్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారితో కేంద్ర ప్రభుత్వం తగు సంప్రదింపులను జరిపింది.
అనుసంధానత అవసరం, అంతర్గత అవశ్యత, నిధుల లభ్యత ఆధారంగా రాష్ట్రస్థాయి సహా కొన్ని రాష్ట్ర రహదారులను (ఎస్‌హెచ్) ఎప్పటికప్పుడు కొత్త జాతీయ రహదారులుగా (ఎన్‌హెచ్) ప్రకటించే విషయాన్ని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. కొత్తగా ప్రకటించిన జాతీయ రహదారులతో సహా నోటిఫైడ్ జాతీయ రహదారుల పనులను ఇంటర్-సె-ప్రాధాన్యత, కొనసాగుతున్న పనుల పురోగతి, నిధుల లభ్యత, ట్రాఫిక్ సాంద్రత ప్రకారం చేపట్టబడుతుంది. ఈ తరహ అప్‌గ్రేడ్ కోసం ప్రత్యేకంగా ఆర్థిక కేటాయింపులు చేయబడవు. ఆయా పనులు మంజూరు చేసినప్పుడు.. పని ఇప్పటికే ఉన్న బడ్జెట్ కేటాయింపుల ద్వారా అమలు చేయబడుతుంది. ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1741698)
Visitor Counter : 162