రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

హైవేలపై ఉన్న ఫీజు ప్లాజాల్లో పూర్తి ఫాస్టాగ్‌ వ్యవస్థ దాదాపు 96 శాతానికి చేరుకున్న ఫాస్టాగ్ వినియోగం

Posted On: 02 AUG 2021 2:39PM by PIB Hyderabad


    డిజిటల్ పద్ధతిలో రుసుముల చెల్లింపును ప్రోత్సహించడానికి, టోల్‌ గేట్ల వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండా ప్రయాణించడానికి, జాతీయ రహదారులపై ఉన్న ఫీజు ప్లాజాల అన్ని వరుసలను "ఫాస్టాగ్‌ లేన్‌ ఆఫ్‌ ది ఫీజ్‌ ప్లాజా"గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 15/16 అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం, జాతీయ రహదారులపై అన్ని ఫీజు ప్లాజాలు పూర్తి ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. అన్ని వరుసలను ఫాస్టాగ్‌ లేన్లుగా ప్రకటించిన తర్వాత, ఫాస్టాగ్‌ ఉపయోగిస్తున్నవారి సంఖ్య దాదాపు 96 శాతానికి చేరింది.  ఫిబ్రవరి 14న ఇది 80 శాతంగా ఉంది.

    వినియోగ రుసుముల వసూళ్లలో సాంకేతికతను పెంచడం నిరంతర ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వం దీనిని చురుగ్గా అనుసరిస్తోంది.

    కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.

***
 



(Release ID: 1741683) Visitor Counter : 122


Read this release in: English , Punjabi , Malayalam