ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్ డేట్‌


రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత‌ ప్రాంతాల‌కు 49.64 కోట్ల వాక్సిన్ డోస్‌లు స‌మ‌కూర్చారు.

రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ప్రైవేటు ఆస్ప‌త్రుల వ‌ద్ద ఇంకా వాడ‌ని, మిగులు 3.14 కోట్ల కోవిడ్ వాక్సిన్ డోస్‌లు ఉన్నాయి.

Posted On: 02 AUG 2021 11:26AM by PIB Hyderabad

కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సిన్ కార్య‌క్ర‌మాన్ని వేగవంతం చేసేందుకు క‌ట్టుబ‌డి ఉంది.   కోవిడ్ -19 సార్వ‌త్రిక వాక్సినేష‌న్‌కు సంబంధించిన కొత్త ద‌శ‌2021 జూన్ 21 నుంచి ప్రారంభ‌మైంది. మ‌రిన్ని వాక్స‌న్‌లు అందుబాటులోకి తీసుకురావ‌డం ద్వారా వాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేశారు. మ‌రింత మెరుగైన ప్ర‌ణాళిక ద్వారా వాక్సిన్ అందుబాటుకు సంబంధించిన ముంద‌స్తు స‌మాచారం అందించ‌డంతోపాటు, వాక్సిన్ అందుబాటును రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు పెంచ‌డం జ‌రిగింది.

దేశ వ్యాప్త వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలొ భాగంగా, భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కోవిడ్ వాక్సిన్‌ల‌ను ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. కోవిడ్ -19 వాక్సినేష‌న్ నూత‌న ద‌శ‌లో  కేంద్ర ప్ర‌భుత్వం , వాక్సిన్ ఉత్ప‌త్తిదారులు ఉత్ప‌త్తి చేసే వాక్సిన్‌లో 75 శాతం వాక్సిన్‌ను సేక‌రించి దానిని ఉచితంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది.

 

వాక్సిన్ డోస్‌లు      

 

(2, ఆగ‌స్టు 2021 నాటికి)

 

స‌ర‌ఫ‌రా చేసిన‌వి     

 

49,64,98,050

 

పంపిణీ ద‌శ‌లో ఉన్న‌వి       

 

9,84,610

 

మిగులు అందుబాటులో ఉ న్న‌వి     

 

 

3,14,34,654

రాష్ట్రాలు కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు 49.64 కోట్ల (49,64,98,050) వాక్సిన్‌డోస్‌ల‌ను  వివిధ మార్గాల‌లో స‌మ‌కూర్చ‌డం జ‌రిగింది. మ‌రో 9,84,610 డోస్‌లు పంపిణీ ద‌శ‌లో ఉన్నాయి.
రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ప్రైవేటు ఆస్ప‌త్రుల వ‌ద్ద ఇంకా వాడ‌ని, మిగులు 3.14 కోట్ల కోవిడ్ వాక్సిన్ డోస్‌లు ఉన్నాయి.

 

****



(Release ID: 1741434) Visitor Counter : 198