ఆయుష్

అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న ఆయుష్ వైద్య విధానం

Posted On: 30 JUL 2021 4:57PM by PIB Hyderabad

ఆరోగ్యం, దృఢత్వం, మారుతున్న జీవనశైలి గురించి పెరుగుతున్న అవగాహనతో, ఆయుష్ విధానాలు ముఖ్యంగా ఆయుర్వేద & యోగాకు డిమాండ్ అంతర్జాతీయ స్థాయిలో విపరీతంగా పెరిగింది. జూన్ 21 ను అంతర్జాతీయ యోగా దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం మొత్తం ప్రపంచ సమాజ శ్రేయస్సును నిర్ధారించడానికి ఆయుష్ వ్యవస్థల ఔచిత్యం, ప్రాముఖ్యతను ఒక ముఖ్యమైన జోక్యంగా సూచిస్తుంది. నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఎఇ, ఒమన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, మలేషియా, మారిషస్, హంగేరి, సెర్బియా, టాంజానియా, స్విట్జర్లాండ్, క్యూబా మరియు బ్రెజిల్‌లో ఆయుర్వేదం ఒక వైద్య విధానంగా గుర్తింపు పొందింది. రొమేనియా, హంగరీ, లాట్వియా, సెర్బియా మరియు స్లోవేనియా ఐరోపా యూనియన్ (ఈయు) లోని 5 దేశాలు, ఇక్కడ ఆయుర్వేద పద్ధతులు నియంత్రణతో ఉన్నాయి.

బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, పాకిస్తాన్, బహ్రెయిన్, యుఎఇ, టాంజానియాలో యునానీ విధానం గుర్తింపు పొందింది. సిద్ధ విధానం శ్రీలంక, మలేషియాలో గుర్తింపు పొందింది. సోవా రిగ్పా విధానం భూటాన్, మంగోలియాలో గుర్తింపు పొందింది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఒమన్, యుఎఇ, రష్యా, టాంజానియాలో హోమియోపతి విధానం గుర్తింపు పొందింది. ఇది ఘనా, చిలీ, కొలంబియా, రొమేనియా, టర్కీ, అంటారియో (కెనడా) లలో బాగా నియంత్రణతో ఉంది, బ్రిటన్ లో జాతీయ ఆరోగ్య విధానంలో విలీనం చేశారు. ఆయుష్ ఉత్పత్తులను మెడిసిన్ లేదా ఫుడ్ సప్లిమెంట్ గా 100 కి పైగా విదేశీ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ ప్రోత్సాహం, ప్రచారం, ఆయుష్ విధానాల ప్రపంచ ఆమోదం కోసం అనేక చర్యలు చేపట్టింది. వివిధ దేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు, వాణిజ్య సదుపాయం కోసం వివిధ దశలను చేపట్టడం, ఆయుష్ వ్యవస్థకు గుర్తింపు, ప్రత్యేకమైన ఆయుష్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ (ఎఇపిసి) ఆయుష్ ఉత్పత్తులు / ఔషధాలు / సేవల ఎగుమతిని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టింది. అంతర్జాతీయ ప్రదర్శనలలో పాల్గొనడానికి పరిశ్రమ & ఆసుపత్రులకు మద్దతు, వివిధ దేశాలకు నిపుణులను నియమించడం, డబ్ల్యూహెచ్ఓ, ఐఎస్ఓ వంటి అంతర్జాతీయ సంస్థలతో సహకరించడం ద్వారా నాణ్యతా ప్రమాణాలను ఏర్పరచడం విషయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. పెట్టుబడులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ ఆయుష్ స్థాపన భారతదేశంలో ఆయుష్ కోర్సులను అభ్యసించడానికి విదేశీ జాతీయులకు స్కాలర్‌షిప్ అందించే సంస్థలను ప్రోత్సహించడం పై కూడా దృష్టి సారించింది. 

దేశంలో ఆయుష్ లో ఉన్న ప్రతి  విధానానికి ఒక్కో విశ్వవిద్యాలయం స్థాపించాలన్న ప్రణాళిక ప్రస్తుతం లేదు. అయితే జైపూర్ లో ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఆయుర్వేద (ఎన్ఐఏ)కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్థాయిని మంజూరు చేసింది.

వివిధ ఆయుష్  విభాగాల మొత్తం 12 జాతీయ సంస్థలు ఇప్పటికే వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నాయి. అదనంగా, ఈ నేషనల్ ఇనిస్టిట్యూట్‌ల కింది 04 శాటిలైట్/ కాంపోనెంట్ సంస్థలు స్థాపించబడుతున్నాయి:

ఘజియాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ లో భాగంగా సంస్థ 
గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (జిఐఎం), గోవాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) లో భాగంగా సంస్థ 
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద,  పంచకుల (హర్యానా) లో భాగంగా సంస్థ 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, నరేలా (ఢిల్లీ) లో భాగంగా సంస్థ    

ఆయుష్ లో అన్ని విభాగాలను,  అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా దేశంలోని యువతలో దాని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయడంలో, ప్రాచుర్యం పొందడంలో భారత ప్రభుత్వం చురుకుగా పాల్గొంటుంది. ఉదా. జాతీయ మరియు అంతర్జాతీయ యోగా, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని మొదలైన దినోత్సవాన్ని జరుపుకోవడం, జాతీయ/రాష్ట్ర స్థాయి ఆరోగ్యం & వెల్నెస్ ఔట్రీచ్ కార్యక్రమాలు వంటివి. స్వస్ధ్య రక్షణ్ కార్యక్రమం, ఆరోగ్య-మేళాలు, ఆరోగ్య శిబిరాలు, ప్రదర్శనలు, ఆయు సమ్వాద్ ప్రచార కార్యక్రమం మొదలైనవి, ఆయుష్ విద్యావేత్తలు, సేవలు, ఉత్పత్తి రంగాల సామర్థ్యాన్ని పెంచుతాయి ఉదా. దేశంలోని 12500 ఆయుష్ ఆరోగ్య, సంరక్షణ కేంద్రాల నిర్వహణ, ఆయుష్ సిస్టమ్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, జాతీయ వార్తాపత్రికలలో ప్రింట్ మీడియా, ఆడియో జింగిల్స్, వీడియో డాక్యుమెంటరీ ఫిల్మ్స్ & టివి షోల గురించి ప్రామాణికమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, మొబైల్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం, కోవిడ్-19కి సంబంధించిన సూచనలు జారీ చేయడం. 

ఈ సమాచారాన్ని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ లోక్ సభ లో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 

***



(Release ID: 1740987) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Punjabi