ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ జనాభా విధానం- విస్తృత శ్రేణి సేవలను అందించే జాతీయ కుటుంబ ప్రణాళిక కార్యక్రమం కింద తీసుకున్న వివిధ కార్యక్రమాలు

Posted On: 30 JUL 2021 5:23PM by PIB Hyderabad

2045 నాటికి జనాభా స్థిరీకరణ సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో 2000 సంవత్సరంలో  జాతీయ జనాభా విధానం రూపొందించబడింది. దిగువ పేర్కొన్న విధంగా విస్తృత శ్రేణి సేవలను అందించే జాతీయ కుటుంబ ప్రణాళిక కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
అధిక సంతానోత్పత్తి కలిగిన ఏడు రాష్ట్రాల్లోని 146 జిల్లాలపై ప్రధానంగా దృష్టిసారించి, కుటుంబ నియంత్రణ సేవలను గణనీయంగా పెంచడం కోసం మిషన్ పరివార్ వికాస్ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది.

గర్భనిరోధక అవకాశాల విస్తరణ: ప్రస్తుతం అందజేస్తున్న గర్భనిరోధక బాస్కెట్ లో కండోమ్ తోపాటు నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు, అత్యవసర గర్భనిరోధక మాత్రలు, ఇంట్రాటూరిన్ గర్భనిరోధక గర్భాశయ పరికరం (ఐయుసిడి), స్టెరిలైజేషన్ గర్భనిరోధక మందులను చేర్చారు.

స్టెరిలైజేషన్ కు అంగీకారం తెలిపినవారికి స్టెరిలైజేషన్ నిర్వహించానికి అవసరమైన సర్వీస్ బృందాన్ని సమకూర్చడంతోపాటు వేతన నష్టానికి పరిహారాన్ని అందిస్తుంది.


ప్రసవానంతర గర్భాశయ గర్భనిరోధక పరికరం (PPIUCD) సేవలు డెలివరీ తర్వాత కూడా అందించబడతాయి. గర్భనిరోధక మందులను ఆశా కార్యకర్తల ద్వారా ఇంటివద్దనే పంపిణీ చేసే పథకం కూడా అమలు చేస్తున్నారు.

వివిధ కమ్యూనిటీలకు ఆశా కార్యకర్తలు అందజేసే మందుల కిట్ లోనే ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ ను కూడా అందజేస్తున్నారు.
 

ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (FP-LMIS): కుటుంబ నియంత్రణ కార్యక్రమం విజయవంతంగా అమలు కావడం కోసం.. అవసరమైన ఏర్పాట్ల అంచనా, సేకరణ, పంపిణీ వంటివి సజావుగా సాగడం కోసం ప్రత్యే సాఫ్ట్ వేర్ ప్రారంభించబడింది.

 ఆరోగ్య సౌకర్యాల యొక్క అన్ని స్థాయిలలో కుటుంబ ప్రణాళిక సరుకులను సజావుగా అంచనా వేయడం, సేకరించడం మరియు పంపిణీ చేయడం కోసం అంకితమైన సాఫ్ట్‌వేర్ ప్రారంభించబడింది.
 
ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల ఫలితాలు ఇలా ఉన్నాయి..

-మొత్తం సంతానోత్పత్తి రేటు 2005 నుండి 2018 వరకు  2.9 నుండి 2.2 కి తగ్గింది.
- 36 రాష్ట్రాలలో 28 రాష్ట్రా/కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే 2.1 లేదా అంతకంటే తక్కువ స్థాయి సంతానోత్పత్తిని సాధించాయి.
- జననాల రేటు 2005 నుండి 2018 వరకు  23.8 నుండి 20.0 కి తగ్గింది.
- భారతదేశం యొక్క వాంటెడ్ ఫెర్టిలిటీ రేటు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేIIIలో 1.9 ఉండగా.. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే IVలో 1.8కి తగ్గింది.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం ఈ మేరకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

***

 


(Release ID: 1740899)
Read this release in: English , Urdu , Punjabi