జల శక్తి మంత్రిత్వ శాఖ
జలశక్తి అభియాన్ లక్ష్యం, లక్ష్యాలు
Posted On:
29 JUL 2021 5:41PM by PIB Hyderabad
జలశక్తి అభియాన్ -1 (జె.ఎస్.ఎ-1)ను 2019లో దేశంలో ప్రారంభించారు. తొలుత దీనిని దేశంలో నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న 256 జిల్లాలలోగల 2836 బ్లాకులలో 1592 బ్లాక్‌లలో రెండు దశలలో దీనిని చేపట్టారు. మొదటి దశను 2019 జూలై 1నుంచి, సెప్టెంబర్ 30 వరకు రెండో దశను 2019 అక్టోబర్ 1 నుంచి 2019 నవంబర్ 30 వరకు చేపట్టారు.
జలశక్తి అభియాన్ -1 కింద భారత ప్రభుత్వానికి చెందిన అధికారులు, భూగర్భ జల నిపుణులు రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో కలసి నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న జిల్లాలలో నీటి సంరక్షణ,నీటివనరుల నిర్వహణవంటి వాటికి సంబంధించిన ఐదు లక్ష్యాల సాధనకు కృషి చేశారు. ఇందులో, నీటి ని పొదుపు చేయడం, వాన నీటి సంరక్షణ, సంప్రదాయ ,ఇతర జల వనరులు , చెరువుల పునరుద్ధణ, బోరుబావులను రీచార్జి చేయడం, వాటర్‌షెడ్ అభివృద్ధి, పెద్ద ఎత్తున అడవుల పెంపకం వంటివి ఉన్నాయి.
ఈ ప్రచారం కారణంగా పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన ఏర్పడి , ప్రజలు నీటిని పొదుపు చేయడం ప్రారంభించారు. జలశక్తి అభియాన్ -1 ఫలితం మెరుగైన రీతిలో నీటి పొదుపు.
జెఎస్ఎ -1 కి వేరుగా నిధులు ఏమమీ కేటాయించలేదు. అయితే పైన పేర్కొన్న చొరవ కింద వివిధ కేంద్ర , రాష్ట్రప్రభుత్వ పథకాలను సమ్మిళితం చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం జరిగింది. జలశక్తి అభియాన్ -2ను 2020లో వచ్చిన కోవిడ్ మహమ్మారి కారణంగా చేపట్టలేదు. అయితే జలశక్తి మంత్రిత్వశాఖ, జలశక్తి అభియాన్- వాన నీటిని ఒడిసిపట్టు (జెఎస్ఎ: సిటిఆర్) పేరుతో వాన పడిన చోటే దానిని సంరక్షించు పేరుతే వర్షాకాలం ముందు నుంచి ఈ నినాదాన్ని. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ముందుకు తీసుకుపోతున్నది. 2021 నవంబర్ 30 వరకు దీనిని చేపడతారు. జలశక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్ ప్రచారాన్ని ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ 2021 మార్చి 22న ప్రారంభించారు.
జెఎస్ఎ- సిటిఆర్ కింద నీటిపొదుపు, వాన నీటి సంరక్షణ నిర్మాణాలు, సంప్రదాయ, ఇతర జల వనరులు, చెరువుల పునరుద్ధరణ, బోరు బావుల పునరుద్ధరణ, పునర్ వినియోగం, వాటర్‌షెడ్ అభివృద్ధి, పెద్ద ఎత్తున అడవుల పెంపకం పై ప్రధాన దృష్టితో చర్యలు చేపట్టడం జరుగుతున్నది.
జెఎస్ఎ : సిటిఆర్ కింద జిల్లాల వారీగా అన్ని జలవనరుల వివరాలను జియో ట్యాగింగ్ చేయడం, జల వనరులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సరి చూసుకోవడం దాని ఆధారంగా శాస్త్రీయ విధానంలో నీటి పొదుపునకు చర్యలు రూపొందించడం వంటి వి ఉన్నాయి. జలశక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్ ప్రచారం కింద 26-07-2021 రాష్ట్రాల వారీగా సాధించిన ప్రగతి, ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధులను జెఎస్ఎ: సిటిఆర్ పోర్టల్ (jsactr.mowr.gov.in) లో కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్టమెంట్‌లు, వాటి పనితీరుకు సంబంధించిన సూచికలతో పొందుపరచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా జెఎస్ఎ, సిటిఆర్ కింద తాము రాష్ట్ర, స్థానిక నిధులతో చేపట్టిన పనుల వివరాలను పొందుపరచవలసిందిగా కోరడం జరిగింది. జెఎస్ఎ: సిటిఆర్ కింద కరౌలి, ధౌల్‌పూర్ జిల్లాలలో 26-07-2021 వరకు చేపట్టిన పనులను అనుబంధం -2లో జతచేయడం జరిగింది.
ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్ పటేల్ ఈరోజు లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 1740571)
Visitor Counter : 462