గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్వనిధి పథకం కింద చిరు వ్యాపారులకు రూ.2,243 కోట్ల విలువ చేసే 22.7 లక్షల రుణాలు

Posted On: 29 JUL 2021 3:44PM by PIB Hyderabad

చిరు వ్యాపారుల (జీవనోపాధి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ) చట్టం, 2014 ను సంబంధిత రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు) వీధి వర్తకులకు సంబంధించి స్థానిక నియమాలు, పథకం, ఉప-చట్టాలు, ప్రణాళికను రూపొందించడం ద్వారా అమలు చేస్తాయి. ఇప్పటివరకు, ఈ చట్టం కింద నిబంధనలు అన్ని రాష్ట్రాలు / యుటిలు నోటిఫై చేశాయి. ఈ పథకాన్ని లక్షద్వీప్, లడఖ్ మినహా అన్ని రాష్ట్రాలు / యుటిలు నోటిఫై చేశాయి. మేఘాలయకు సొంతంగా చిరువ్యాపారుల చట్టం, 2014 ఉంది.

గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ- 'ప్రధాన మంత్రి వీధి అమ్మకందారుల ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని' (పీఎం స్వనిధి) జూన్ 01, 2020 నుండి అమలు చేస్తోంది. మహమ్మారి వల్ల తీవ్ర ప్రభావం పడ్డ పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు నిర్వహణ మూలధనం కింద రూ. 10,000 వరకు రుణాన్ని సంవత్సరం కాలపరిమితితో ఈ పథకం కింద మంజూరు చేస్తారు.  ముందస్తు చెల్లింపు లేదా తిరిగి చెల్లిస్తే, వారు వరుసగా రెండవ మరియు మూడవ కాలాల్లో రూ. 20,000 మరియు రూ.50,000 వరకు మెరుగైన మూలధన రుణం కోసం అర్హులు అవుతారు. అదనంగా, కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత సామాజిక-ఆర్థిక సంక్షేమ పథకాలతో అనుసంధానించడం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు భద్రతా వలయంలో ఉంటారు. 'స్వనిధి సే సమృద్ధి' అనే స్ఫూర్తితో ఈ పథకాన్ని అమలు చేస్తోంది కేంద్రం. ఎంపిక చేసిన 125 నగరాలలో దీనిని 2021 జనవరిలో ప్రారంభించారు.

ఈ ఏడాది జూలై 26 నాటికి రుణాల కోసం 43.1 లక్షల దరఖాస్తులు వచ్చాయి, వీటిలో 25.2 లక్షల రుణాలు మంజూరు అయ్యాయి. రూ.2,243 కోట్ల మేరకు 22.7 లక్షల రుణాలు పంపిణీ చేశారు. అదనంగా, వారి కుటుంబ సభ్యులతో పాటు 5.1 లక్షల మంది లబ్ధిదారుల సామాజిక-ఆర్థిక ప్రొఫైలింగ్ పూర్తయింది. 1.5 లక్షల పథకం ప్రయోజనాలను విస్తరించింది.

2020 మార్చి 24 న లేదా అంతకన్నా ముందు పట్టణ ప్రాంతాల్లో విక్రయాలలో నిమగ్నమైన చిరు వ్యాపారాలు పీఎం స్వనిధి పథకానికి అర్హులు. అర్హత కలిగిన విక్రేతలను ఈ క్రింది ప్రమాణాల ప్రకారం గుర్తిస్తారు:

  1. అర్బన్ లోకల్ బాడీస్ (యుఎల్‌బి) జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ వెండింగ్ / ఐడెంటిటీ కార్డును కలిగి ఉన్న చిరు వ్యాపారాలు;
  2. వ్యాపారులను సర్వేలో గుర్తించారు కాని వెండింగ్ / ఐడెంటిటీ కార్డు సర్టిఫికేట్ జారీ కాని వారు;
  3. చిరువ్యాపారులు, యుఎల్‌బి నేతృత్వంలోని గుర్తింపు సర్వే నుండి నిష్క్రమించారు లేదా సర్వే పూర్తయిన తర్వాత అమ్మకం ప్రారంభించిన వారు మరియు యుఎల్‌బి / టౌన్ వెండింగ్ కమిటీ (ఎల్ఓఆర్) చేత ఆ మేరకు సిఫారసు లేఖ (లోఆర్) జారీ అయిన వారు 
  4. పరిసర అభివృద్ధి ప్రాంతాలు/ పెరి-అర్బన్ / గ్రామీణ ప్రాంతాల విక్రేతలు యుఎల్‌బిల భౌగోళిక పరిధిలో విక్రయిస్తున్న వారు,  యుఎల్‌బి / టివిసి చేత ఆ మేరకు లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్ఓఆర్) జారీ అయినవారు.

మహారాష్ట్రలో, జూలై 26, 2021 నాటికి, 1.6 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.164 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ముంబై, పూణేలలో వరుసగా 6,395 మరియు 6,169 మంది స్ట్రీట్ వెండర్లకు రుణాలు పంపిణీ జరిగాయి. 

అదనంగా, 14,094 మంది లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యుల సామాజిక-ఆర్థిక ప్రొఫైలింగ్ పూర్తయింది.  7,998 పథక ప్రయోజనాలు మహారాష్ట్రలో అందించడం జరిగింది. ముంబై మరియు పూణేలో భాగం కాని 125 నగరాల్లో 'స్వనిధి సే సమృధి' అమలు జరుగుతోంది. 

పీఎం స్వనిధి కేంద్ర పథకం. 

మహారాష్ట్రలో, జూలై 26, 2021 నాటికి, రుణాల కోసం 4.2 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో 1.9 లక్షల రుణాలు మంజూరు అయ్యాయి. 1.6 లక్షల రుణాలు పంపిణీ అయ్యాయి. ముంబైలో 21,527 రుణ దరఖాస్తులు వచ్చాయి, వీటిలో 8,526 లక్షల దరఖాస్తులు మంజూరు అయ్యాయి.  6,395 రుణాలు పంపిణీ చేశారు. పూణేలో, 12,107 రుణ దరఖాస్తులు స్వీకరించగా 6,946 లక్షల రుణాలు మంజూరు అయ్యాయి. 6,169 రుణాలు పంపిణీ చేశారు.

ఈ సమాచారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా వెల్లడించారు. 

****



(Release ID: 1740471) Visitor Counter : 219


Read this release in: English , Urdu , Marathi , Punjabi