గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ కింద సరసమైన అద్దె ఇళ్ల ప్రాంగణ పథకం

Posted On: 29 JUL 2021 3:48PM by PIB Hyderabad

   స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ కింద ప్రకటించిన సరసమైన అద్దె ఇళ్ల ప్రాంగణాల పథకం (ఏఆర్‌హెచ్‌సీ) ఉద్దేశాలు-లక్ష్యాలు కిందివిధంగా ఉన్నాయి:

   పట్టణ పేదలు/వలస కార్మికుల కోసం సరసమైన అద్దె ఇళ్ల నిర్మాణంతో సుస్థిర పర్యావరణం సృష్టించడం ద్వారా ‘స్వయం సమృద్ధ భారత్‌ అభియాన్‌’ ఉద్దేశాన్ని నెరవేర్చడం.

   పట్టణ పేదలు/వలస కార్మికుల కోసం సరసమైన అద్దె ఇళ్ల నిర్మాణం సహా “అందరికీ ఇళ్లు” కార్యక్రమ లక్ష్యాన్ని సాధించడం. పని ప్రదేశాల సమీపంలో వారు అన్ని పౌర సదుపాయాలతో గౌరవప్రదంగా జీవించడానికి ‘ఏఆర్‌హెచ్‌సీ’ వీలు కల్పిస్తుంది.

   సరసమైన అద్దె ఇళ్ల ప్రాంగణాల నిర్మాణానికి పెట్టుడులు సమీకరించుకునేలా ప్రభుత్వ/ ప్రైవేట్‌ సంస్థలకు ప్రోత్సాహకర వాతావరణం సృష్టి. తద్వారా తమకు అవసరమైన కార్మికశక్తి గృహ అవసరాలను తీర్చడమేగాక ఇంకా స్థలం మిగిలి ఉంటే పరిసర ప్రాంతాల వారికోసం కూడా నిర్మాణం చేపట్టే వీలు కల్పించడం.

   ‘ఏఆర్‌హెచ్‌సీ’ పథకం నమూనా-1 కింద వలస కార్మికులకు అద్దె ఇంటి వసతి కోసం ‘ఏఆర్‌హెచ్‌సీ’ ప్రాంగణాలుగా మార్పుచేసేందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 88,236 ఖాళీ నివాసాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, తెలంగాణలో మాత్రం సదరు నమూనా-1 కింద వలస కార్మికులకు అద్దె ఇంటి వసతి కల్పించేందుకు ఖాళీ నివాసాలు అందుబాటులో లేవు. కాగా, వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వలస కార్మికులకు అందుబాటు/లభ్యంకాగల ఇళ్ల వివరాలను అనుబంధంలో చూడవచ్చు.

   సరసమైన అద్దె ఇళ్ల ప్రాంగణాల (ఏఆర్‌హెచ్‌సీ)లో అద్దె మొత్తాన్ని పట్టణ స్థానిక పాలన మండళ్లు (యూఎల్‌బీ) నిర్ణయిస్తాయి. ఈ మేరకు అవి ప్రతిపాదన అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ) జారీకి ముందుగానే స్థానికంగా ఒక అధ్యయనం నిర్వహించాలి. ఆ తర్వాత కాంట్రాక్టుపై సంతకాలు పూర్తయిన తేదీనుంచి ఐదేళ్ల కాలంపాటు రెండేళ్లకొకసారి 8 శాతం వంతున మొత్తం అద్దెలో 20 శాతానికి మించకుండా అద్దె పెంచవచ్చు. తదనుగుణంగా మొత్తం రాయితీ కాలం- అంటే... 25 ఏళ్లపాటు ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.

అనుబంధం-1

‘ఏఆర్‌హెచ్‌సీ’లలో మోడల్‌-1 కింద వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వలస కార్మికులకు అందుబాటు/లభ్యంకాగల ఇళ్ల వివరాలు:

వ.సం.

రాష్ట్రం/యూటీ

‘ఏఆర్‌హెచ్‌సీ’లుగా మార్చబడిన

ఇళ్ల సంఖ్య

‘ఏఆర్‌హెచ్‌సీ’లుగా మార్చనున్న

ఇళ్ల సంఖ్య

మొత్తం

1.

అరుణాచల్‌ ప్రదేశ్‌

--

752

752

2.

చండీగఢ్‌

2,195

0

2,195

3.

ఢిల్లీ

--

29,112

29,112

4.

గుజరాత్‌

393

7,387

7,780

5.

హర్యానా

--

2,545

2,545

6.

హిమాచల్‌ ప్రదేశ్‌

--

255

255

7.

కర్ణాటక

--

1,731

1,731

8.

మధ్యప్రదేశ్‌

--

364

364

9.

మహారాష్ట్ర

--

32,345

32,345

10.

నాగాలాండ్‌

--

664

664

11.

రాజస్థాన్‌

--

4,884

4,884

12.

ఉత్తరప్రదేశ్‌

--

5,232

5,232

13.

ఉత్తరాఖండ్‌

--

377

377

మొత్తం

2,588

85,648

88,236

లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్‌ కిషోర్‌ ఈ సమాచారం ఇచ్చారు.

 

***


(Release ID: 1740469) Visitor Counter : 191


Read this release in: English , Urdu , Punjabi , Tamil