సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కోవిడ్ మహమ్మారి సమయంలో మూతపడిన స్టార్టప్‌లు, చిన్న కంపెనీలపై అధ్యయనం .
Posted On:
29 JUL 2021 3:08PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి దేశంలోని వివిధ చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్‌పై ప్రభావాన్ని చూపింది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా అమలు చేయడంతో ఆర్ధిక కార్యకలాపాలు తగ్గాయి. ఎం.ఎస్.ఎం.ఇలపై కూడా దీని ప్రభావం పడింది.
కోవిడ్ -19 ప్రభావం ఎం.ఎస్.ఎం.ఇల మీద అలాగే ప్రధానమంత్రి ఉపాది కల్పన కార్యక్రమం కింద (పిఎంఇజిపి) చేపట్టిన యూనిట్లపైన ఏమేరకు ఉందనేదానిని అంచనా వేసేందుకు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.ఐ.సి), విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (ఎస్ వి.ఐ.సి)లు అధ్యయనాలు నిర్వహించాయి.
ఎన్.ఎస్.ఐ.సి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ అధ్యయనం ,ఆయా సంస్థల నిర్వహణ సామర్ధ్యం, ఎన్ఎస్ఐసి పథకాల లబ్ధిదారులు ఎదుర్కొన్న ఇబ్బందులు,కోవిడ్ -19 మహమ్మారి తదితర అంశాలపై ప్రధానంగా కింది అంశాలు వెల్లడించింది.
1) 91 శాతం ఎం.ఎస్.ఎం.ఇలు కార్యకలాపాలు నిర్వహించే దశలో ఉన్నాయి.
2) చాలావరకు ఎం.ఎస్.ఎం.ఇలు ఎదుర్కొంటున్న సమస్యలలో లిక్విడిటి (55 శాతం యూనిట్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి.)., తాజా ఆర్డర్లు (17 శాతం యూనిట్లు),లేబర్ 9 శాతం యూనిట్లు ,లాజిస్టిక్‌లు 12 శాతం యూనిట్లు , ముడిసరుకు లభ్యత (8 శాతం యూనిట్లు) ఉన్నాయి.
కెవిఐసి నిర్వహించిన అధ్యయనం లో ఈ కింది అంశాలు వెల్లడి అయ్యాయి.
1) పిఎంఇజిపి పథకం కింద లబ్ధిదారులలో 88 శాతం మంది కోవిడ్ 19 తమపై వ్యతిరేక ప్రభావం చూపిందని చెప్పగా 12 శాతంమంది కోవిడ్ 19 మహమ్మారి వల్ల తాము లబ్ధిపొందామని చెప్పారు.
2) కోవిడ్ ప్రభావం పడిన 88 శాతం మందిలో 57 శాతం మంది తమ యూనిట్లను లాక్‌డౌన్ సమయంలో కొంతకాలం మూసివేసినట్టు చెప్పగా , 30 శాతం మంది తమ ఆదాయం, రాబడి తగ్గినట్టుతెలిపారు.
3) కోవిడ్ -19 వల్ల తమ వ్యాపార కార్యకలాపాల విషయంలో ప్రయోజనం పొందినవారిలో 65 శాతం మంది, తమ సంస్థలు, ఆరోగ్యం, రిటైల్ వ్యాపార రంగంలో ఉన్నందువల్ల తమ వ్యాపార కార్యకలాపాలు పెరిగాయన్నారు. 25 శాతం మంది తమ వ్యాపారాలు నిత్యావసర సరకులతో సంబంధం కలిగినవి అయినందువల్ల ప్రయోజనం పొందినట్టు తెలిపారు.
4) ఉద్యోగులకు రెగ్యులర్ వేతనాల విషయంలో 46.60 శాతం మంది పూర్తి జీతాలు చెల్లించినట్టు చెప్పారు, 42.54 శాతం మంది పాక్షికంగా చెల్లించినట్టు చెప్పారు. 10.86 శాతం మంది కోవిడ్ సమయంలో కొద్ది కాలానికి జీతాలు చెల్లించలేకపోయినట్టు తెలిపాచ.
5) మెజారిటీ లబ్దిదారులు అదనపు ఆర్ధిక సహాయం అవసరాన్ని గురించి, వడ్డీ మాఫీ, తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ మద్దతు గురించి తెలియజేశారు.
దేశంలో ఎం.ఎస్.ఎం.ఇ రంగం అభివృద్ధికి, ప్రగతికి ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ వివిధ పథకాలు,కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలు, కార్యక్రమాలలో ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం )పిఎంఇజిపి, స్కీమ్ ఆప్ ఫండ్ ఫర్ రీ జనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ (ఎస్.ఎఫ్.యు.ఆర్.టి.ఐ), గ్రామీణ పరిశ్రమలు , ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ (ఎఎస్‌పిఐఆర్ఇ), ఇంట్రస్ట్ సబ్‌వెర్షన్ స్కీమ్ ఫర్ ఇంక్రిమెంటల్ క్రెడిట్ టు ఎం.ఎస్.ఎం.ఇ, సూక్ష్మ, చిన్న ఎంటర్‌ప్రైజ్‌లకు క్రెడిట్ గ్యారంటీ పథకం,
సూక్ష్మ, చిన్న ఎంటర్‌ప్రైజ్‌ల క్లస్టర్ డవలప్‌మెంట్ కార్యక్రమం (ఎం.ఎస్.ఇ-సిడిపి), క్రెడిట్ లింక్‌డ్ కాపిటల్ సబ్సిడిలీ టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ స్కీమ్ (సిఎల్‌సిఎస్-టియుఎస్) వంటివి ఉన్నాయి.
కోవిడ్-19 అనంతర కాలంలో , భారత ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద దేశంలో ఎం.ఎస్.ఎం.ఇ రంగానికి మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అందులో కొన్ని......
1) ఎం.ఎస్.ఎం.ఇలకు రూ 20,000 కోట్ల రూపాయల వరకు సబార్డినేట్ రుణం.
2)ఎం.ఎస్.ఎం.ఇలతో సహా వివిధ వ్యాపారాలకు 3 లక్షల కోట్ల రూపాయల వరకు హామీ లేనిఆటోమేటిక్ రుణాలు
3) ఎం.ఎస్.ఎం.ఇ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా 50,000 కోట్ల రూపాయల మేరకు ఈక్విటీ ఏర్పాటు
4) ఎం.ఎస్.ఎం.ఇకి సంబంధించి సవరించిన నూతన వర్గీకరణ
5) సులభతర వ్యాపారం కోసం ఉడయం రిజిస్ట్రేషన్ ద్వారా ఎం.ఎస్.ఎం.ఇల కు కొత్తగా రిజిస్ట్రేషన్
6) 200 కోట్ల రూపాయల విలువగల వస్తువలు,సరకు సేకరణకు గ్లోబల్ టెండర్లను పిలవరు.ఇది ఎం.ఎస్.ఎం.ఇలకు సాయపడుతుంది.
ఆన్‌లైన్ పోర్టల్ ఛాంపియన్స్‌ను ప్రధానమంత్రి 01-06-2020న ప్రారంభించారు. ఇందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ గవర్నెన్స్‌తోపాటు, ఎం.ఎస్.ఎం.ఇలకు బాసటగా నిలవడం, ఫిర్యాదుల పరిష్కారం వంటివి ఉన్నాయి.
ఈ పోర్టల్ ద్వారా 25-07-2021 నాటికి 35,983 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది.
ఈ సమాచారాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న , మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే, లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈరోజు తెలియజేశారు.
***
(Release ID: 1740395)
Visitor Counter : 203