వ్యవసాయ మంత్రిత్వ శాఖ

దేశీయ ధాన్యాన్ని పోత్స‌హించ‌డానికి ప‌థ‌కం

Posted On: 27 JUL 2021 6:53PM by PIB Hyderabad

ఐసిఏఆర్ చేప‌ట్టిన ప‌లు కార్యక్ర‌మాల‌ద్వారా దేశీయ ధాన్యం రకాల‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా 574 ర‌కాల దేశీయ ధాన్యం ర‌కాల‌ను ప‌దివేల‌కుపైగా రైతుల పొలాల్లో ప‌రీక్షించ‌డం జ‌రిగింది. ఆయా చోట్ల వాటిని ప్రోత్స‌హించ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆయా రాష్ట్రాల వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, స్వ‌చ్ఛంద సేవాసంస్థ‌లు భాగ‌స్వాముల‌య్యాయి. ఇందుకోసంగాను ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. 
ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ సేవ‌లను బ‌లోపేతం చేసి, హానిని త‌గ్గించ‌డానికిగాను వ్య‌వ‌సాయ జీవ‌వైవిధ్య‌త‌ను ప్ర‌ధాన స్ర‌వంతిలోకి తేవ‌డం, వ్య‌వ‌సాయ‌రంగాన్ని ప‌రిర‌క్షించి వినియోగించుకోవ‌డం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంద్వారా ఆయా ప్రాంతాల రైతులు త‌మ పొలాల్లో సంప్ర‌దాయ‌, దేశీయ ర‌కాల‌ను వినియోగించి వాటిని మెరుగు ప‌ర‌చ‌డం జ‌రుగుతుంది. ఇందుకోసం వారికి శిక్ష‌ణ ఇస్తారు. అంతే కాదు దేశ‌వ్యాప్తంగా ఈ దేశీయ ర‌కాలు అందుబాటులోకి రావ‌డానికిగాను క‌మ్యూనిటీ స్థాయిలో క‌మ్యూనిటీ సీడ్ బ్యాంకుల‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కెవికెలు, స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌హాయాన్ని తీసుకుంటున్నారు. 26 క‌మ్యూనిటీ సీడ్ బ్యాంకుల‌ద్వారా నాలుగువేలకు పైగా దేశీయ భూ జాతుల‌ను, రైతుల‌కు చెందిన వివిధ పంట‌ రకాల‌ను బ‌లోపేతం చేయ‌డం జరిగింది. ధాన్యంతోపాటు ఆహార పంటల్ని బ‌లోపేతం చేశారు.  
దేశీయ ధాన్యం ర‌కాల‌ను ప‌రిర‌క్షిస్తూ ప్రోత్స‌హిస్తున్న క‌మ్యూనిటీల‌కు, రైతుల‌కు 2009-10నుంచి కింద తెలిపిన అవార్డుల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతోంది. పిపివి అండ్ ఎఫ్ ఆర్ ఏ సంస్థ ఈ అవార్డుల‌ను ఇస్తోంది. ఇది పంట ర‌కాల‌ను, రైతుల హ‌క్కుల‌ను కాపాడే సంస్థ. 
ప్లాంట్ జెనోమ్ సేవియ‌ర్ క‌మ్యూనిటీ అవార్డ్ ( రూ.10 ల‌క్ష‌లు) : 13
ప్లాంట్ జెనోమ్ సేవియ‌ర్ ఫార్మ‌ర్ రివార్డ్స్ ( ఒక్కొక్క‌రికి రూ. 1.5 ల‌క్ష‌లు) : 12
ప్లాంట్ జెనోమ్ సేవియ‌ర్ ఫార్మ‌ర్ రిక‌గ్నిష‌న్స్ ( ఒక్కొక్క‌రికి రూ. 1.0 ల‌క్ష‌లు) : 19
ఐదు ధాన్యం ర‌కాల‌ను గుర్తించ‌డం జ‌రిగింది. అవి లాలత్‌, మెరుగుప‌రిచిన లాల‌త్, స్వ‌ర్ణ‌, సాంబా మ‌సూరి, శ‌క్తిమాన్‌. ఈ ర‌కాల‌న్నీ సీడ్ ఛెయిన్ లో వున్నాయి. వీటిని రైతులు పండిస్తున్నారు. 
దేశీయ ధాన్యం రకాల వివ‌రాలు న్యూఢిల్లీలోని ఐసిఏఆర్ - ఎన్ బిపిజిఆర్ లో అందుబాటులో వున్నాయి. ఇందులోని గ్రీన్ బ్యాంకులో 45, 107 దేశీయ ధాన్య ర‌కాల‌ను, ధాన్య భూజాతుల‌ను ప‌రిర‌క్షిస్తున్నారు. వీటికి తోడు పిపివి అండ్ ఎఫ్ ఆర్ ఏ వ‌ద్ద 1645 రైతుల రకాలు న‌మోదయి వున్నాయి. 

ఈ స‌మాచారం ఈరోజున లోక్ స‌భలో కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌ రాత‌పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలోనిది.
...(Release ID: 1740202) Visitor Counter : 34


Read this release in: English , Punjabi