ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో పెండింగ్ పథకాలు

Posted On: 28 JUL 2021 1:19PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డీఓఎన్ఈఆర్) మంజూరు చేసిన ప్రాజెక్టుల వివరాలు,  పెండింగ్ లో ఉండి పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

 

క్రమసంఖ్య

పథకం

మంజూరైన ప్రాజెక్టులు

పూర్తయిన ప్రాజెక్టులు

కొనసాగుతున్న ప్రాజెక్టులు

సంఖ్య

ఖర్చు

(రూ.కోట్లలో)

సంఖ్య

ఖర్చు

(రూ.కోట్లలో)

సంఖ్య

ఖర్చు

(రూ.కోట్లలో)

1

నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ (ఎన్ఈఎస్ఐడీఎస్)

99

2452.62

-

-

99

2452.62

2

నాన్- లాప్సేబుల్ సెంట్రల్ పూల్ ఆఫ్ రిసోర్సెస్-స్టేట్ (ఎన్ఎల్సీపీఆర్- స్టేట్)

1635

16233.79

1193

9420.61

442

6813.18

3

నాన్-లాప్సేబుల్ సెంట్రల్ పూల్ ఆఫ్ రిసోర్సెస్-స్టేట్ (ఎన్‌ఎల్‌సిపిఆర్-సెంట్రల్)

7

1233.327

2

304.87

5

928.457

4

నార్త్ ఈస్ట్ రోడ్ సెక్టార్ డెవలప్‌మెంట్ స్కీమ్-ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ (ఎన్ఈఆర్ఎస్డీఎస్ఈఏపీ ) (ఇంతకు ముందు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రోడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎన్ఈఎస్ఆర్ఐపీ) స్కీమ్ అని పిలిచేవారు)

12

2144.56

11

2004.72

1

139.84

5

ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎస్ఐడీఎఫ్)

37

587.36

22

410.06

15

177.30

6

బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బిటిసి), దిమా హసావో అటానమస్ టెరిటోరియల్ కౌన్సిల్ (డిహెచ్‌ఎటిసి) , అస్సాంలోని కార్బి ఆంగ్లాంగ్ అటానమస్ టెరిటోరియల్ కౌన్సిల్ (కెఎటిసి) కోసం ప్రత్యేక ప్యాకేజీలు

101

1156.34

53

576.45

48

579.89

7

హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం (హెచ్ఏడీపీ)

41

90.00

-

-

41

90

8

నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్‌ఇసి) పథకాలు

1422

12488.02

760

6055.79

662

6432.23

9

నార్త్ ఈస్ట్ రోడ్ సెక్టార్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఎన్ఈఆర్ఎస్డీఎస్)

           

 

 ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రాజెక్టుల కోసం నిధులను దశలవారీగా విడుదల చేస్తారు.  వాటి భౌతిక,  ఆర్థిక పురోగతికి బట్టి నిధుల కేటాయింపు ఉంటుంది. మెరుగైన పర్యవేక్షణ కోసం, సమయానికి అనుగుణంగా డబ్బు విడుదలయ్యేలా చేయడానికి మంత్రిత్వ శాఖ తన పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పిఎఫ్‌ఎంఎస్) ద్వారా అందచేస్తోంది.  నిధుల ఖర్చును పరిశీలించడానికి పిఎఫ్‌ఎంఎస్ ఎక్స్పెండిచర్ -అడ్వాన్స్- ట్రాన్స్ఫర్ (ఇఎటి) పద్ధతులను అమలు చేయాలని ఎన్‌ఇఆర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. అంతేగాక, మంత్రిత్వ శాఖ  సీనియర్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలతో క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.  ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడానికి క్షేత్ర సందర్శనల కోసం వెళతారు. రాష్ట్ర ప్రభుత్వాలతో మెరుగైన సమన్వయం కోసం  ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టుల అమలును సులభతరం చేయడానికి ప్రతి ఎన్‌ఇఆర్ రాష్ట్రానికి నోడల్ అధికారులను,  చీఫ్ నోడల్ అధికారులను మంత్రిత్వ శాఖ నియమించింది.

          స్కిల్ ఇండియా మిషన్ కింద, నైపుణ్య, ఔత్సాహిక పారిశ్రామిక అభివృద్ధి శాఖ (ఎంఎస్‌డిఇ) ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన (పిఎంకెవివై) అనే ప్రధాన పథకాన్ని అమలు చేస్తోంది. పిఎమ్‌కెవివైను (2015–-16) నైపుణ్య ధృవీకరణ,  రివార్డ్ స్కీమ్‌గా తీర్చిద్దిదారు. భారీ సంఖ్యలో  యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకాన్ని అధికారికంగా 20.08.2019 న నిలిపివేశారు. పిఎమ్‌కెవివై 1.0 విజయవంతం కావడంతో పిఎమ్కెవివై 2.0ను మంత్రిత్వశాఖ మొదలుపెట్టింది. ప్లేస్‌మెంట్ లింక్డ్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ (ఎస్‌టిటి), పూర్వ అభ్యాస గుర్తింపు (ఆర్‌పిఎల్) కోర్సుల ద్వారా కోటి మంది యువతకు నైపుణ్యాల కల్పన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈశాన్య ప్రాంతం (ఎన్‌ఇఆర్) తో సహా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన  అనుబంధ శిక్షణా కేంద్రాల (టిసి) ద్వారా వీటిని బోధించారు. 10.07.2021 నాటికి పిఎంకెవివై 2.0 కింద ఈశాన్య రాష్ట్రాల్లో 10.39 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు.  పిఎమ్‌కెవివై  మూడవ దశను 3.0 15.01.2021 న ప్రారంభించారు. స్థానిక ఉద్యోగాలకు డిమాండ్ పెంచడానికి డిమాండ్ ఆధారిత  బాటప్ అప్ విధానాన్ని అమలు చేశారు. అభ్యర్థుల నిర్ణయాలకు, ఆకాంక్షలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.  ఇది వారికి స్వయం ఉపాధికి కూడా మద్దతు ఇస్తుంది. 10.07.2021 నాటికి 15,219 మంది అభ్యర్థులు పిఎంకెవివై 3.0 కింద ఈశాన్య రాష్ట్రాల్లో శిక్షణ పొందారు.

 

కేంద్ర యువజన వ్యవహారాల విభాగం..  యువజన , కౌమార అభివృద్ధి కోసం జాతీయ కార్యక్రమం (ఎన్‌పిఎఎడి) పేరుతో రాష్ట్రీయ యువ సశక్తికరన్ కార్యక్రమ్ (ఆర్‌వైఎస్‌కె)కు ఉప-పథకాన్ని అమలు చేస్తోంది. నాయకత్వ లక్షణాలను పెంచడం,  వ్యక్తిత్వ అభివృద్ధి, జాతీయ సమైక్యత  ప్రోత్సాహం, సాహసకృత్యాలకు ప్రోత్సాహం, కౌమారదశలో అభివృద్ధి  సాధికారత  ఎన్ఈఆర్ తో సహా మొత్తం దేశంలో సాంకేతిక  వనరుల అభివృద్ధిపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. యువత అభివృద్ధి  కోసం వివిధ సంస్థలకు, విభాగాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.  ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి  జి. కిషన్ రెడ్డి ఈ వివరాలను లోక్సభకు బుధవారం లిఖితపూర్వకంగా తెలియజేశారు. 

***


(Release ID: 1740040) Visitor Counter : 182


Read this release in: English , Urdu , Bengali