రైల్వే మంత్రిత్వ శాఖ

స్టేషన్లలో వై-ఫై సౌకర్యం కల్పిస్తున్న రైల్‌టెల్

प्रविष्टि तिथि: 28 JUL 2021 4:38PM by PIB Hyderabad

రైల్వే మంత్రిత్వ శాఖ కి చెందిన  ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌టెల్ రైల్వే స్టేషన్లలో వై-ఫై సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు 6045 స్టేషన్లలో వై-ఫై సౌకర్యం కల్పించబడింది. జోన్ల వారీగా వివరాలు జోడించబడ్డాయి.

హాల్ట్ స్టేషన్లు మినహా మిగిలిన అన్ని స్టేషన్లలో వై-ఫై సౌకర్యం కల్పించాలని భారత రైల్వే నిర్ణయించింది  .

మిగిలిన స్టేషన్లలో వై-ఫై  సదుపాయం కల్పించే పని పురోగతిలో ఉంది. ఈ స్టేషన్లలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వంటి మౌలిక సదుపాయాల లభ్యతపై ఈ పని ఆధారపడి ఉంటుంది. వీటిలో 55 స్టేషన్లలో ఈ ఆర్థిక సంవత్సరంలో వై-ఫై సేవలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది.

  జోన్ల వారీగా వై-ఫై ప్రారంభించిన రైల్వే స్టేషన్ల  వివరాలు  :

 

జోనల్ రైల్వే

మొత్తం స్టేషన్లు

తూర్పు

350

తూర్పు మధ్య 

400

తూర్పు తీరం

254

ఈశాన్య సరిహద్దు

380

ఆగ్నేయ 

248

దక్షిణ మధ్య 

202

మెట్రో కోల్‌కతా

33

ఉత్తర

572

ఈశాన్య 

294

ఉత్తర మధ్య 

286

వాయవ్య 

418

దక్షిణ మధ్య

587

దక్షిణ

542

నైరుతి 

308

మధ్య

373

పశ్చిమ మధ్య 

271

పశ్చిమ 

468

కొంకణ్

59

మొత్తం

6045

 

ఈ సమాచారాన్ని లోక్‌సభలో ఈ రోజు రైల్వేకమ్యూనికేషన్స్ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.

-

****

 


(रिलीज़ आईडी: 1740028) आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Tamil