కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
దేశంలో 2018-2021 మధ్య 2,38,223 డొల్ల కంపెనీలను గుర్తించిన ప్రభుత్వం
Posted On:
27 JUL 2021 6:24PM by PIB Hyderabad
కంపెనీల చట్టంలో ‘డొల్ల కంపెనీ’ అనే పదానికి నిర్వచనమేదీ లేదు... అందువల్ల సాధారణంగా దైనందిన వ్యాపార నిర్వహణ లేదా నిర్దిష్ట ఆస్తులు లేని కంపెనీలను ఇలా వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో పన్ను ఎగవేత, నగదు తరలింపు, రహస్య యాజమాన్యం, బినామీ ఆస్తులు తదితర చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినవిగా పరిగణిస్తారు. ఈ మేరకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ రావు ఇందర్‌జీత్ సింగ్ రాజ్యసభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఇటువంటి ‘డొల్ల కంపెనీల’ వ్యవహారాల పర్యవేక్షణకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ బలగాన్ని (ఎస్టీఎఫ్) ఏర్పాటు చేసిందని మంత్రి సభకు వెల్లడించారు. ఈ బాధ్యతల నిర్వహణలో భాగంగా డొల్ల కంపెనీల గుర్తింపులో అప్రమత్తతకు వీలుగా కొన్ని ‘ఎర్ర జెండా’ (రెడ్‌ఫ్లాగ్) సూచీలను ‘ఎస్టీఎఫ్’ సిఫారసు చేసిందని తెలిపారు. తదనుగుణంగా గడచిన మూడేళ్లుగా అటువంటి డొల్ల కంపెనీలను గుర్తించి మూసివేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందని చెప్పారు. ఈ మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో చట్టంలోని సెక్షన్ 248 కింద మూసివేసిన కంపెనీల జాబితాను మంత్రి సభకు సమర్పించారు. అది కిందివిధంగా ఉంది:
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం పేరు
|
మూసివేసిన కంపెనీల సంఖ్య
|
2018 నుండి 2021 జూన్ వరకు
|
ఆర్‌ఓసీ- అహ్మదాబాద్
|
9243
|
ఆర్‌ఓసీ-అండమాన్
|
41
|
ఆర్‌ఓసీ-బెంగళూరు
|
11185
|
ఆర్‌ఓసీ-చండీగఢ్
|
4908
|
ఆర్‌ఓసీ-చెన్నై
|
11217
|
ఆర్‌ఓసీ-ఛత్తీస్‌గఢ్
|
947
|
ఆర్‌ఓసీ-కోయంబత్తూర్
|
2992
|
ఆర్‌ఓసీ-కటక్
|
3731
|
ఆర్‌ఓసీ-ఢిల్లీ
|
45595
|
ఆర్‌ఓసీ-ఎర్నాకుళం
|
9189
|
ఆర్‌ఓసీ-గోవా
|
597
|
ఆర్‌ఓసీ-గ్వాలియర్
|
4920
|
ఆర్‌ఓసీ-హిమాచల్‌ప్రదేశ్
|
858
|
ఆర్‌ఓసీ-హైదరాబాద్
|
20488
|
ఆర్‌ఓసీ-జైపూర్
|
9222
|
ఆర్‌ఓసీ-జమ్ము
|
393
|
ఆర్‌ఓసీ-జార్ఖండ్
|
1848
|
ఆర్‌ఓసీ-కాన్పూర్
|
15803
|
ఆర్‌ఓసీ-కోల్‌కతా
|
15022
|
ఆర్‌ఓసీ-ముంబై
|
52869
|
ఆర్‌ఓసీ-పాట్నా
|
4683
|
ఆర్‌ఓసీ-పాండిచ్చేరి
|
191
|
ఆర్‌ఓసీ-పూణె
|
5552
|
ఆర్‌ఓసీ-షిల్లాంగ్
|
1256
|
ఆర్‌ఓసీ-ఉత్తరాఖండ్
|
555
|
ఆర్‌ఓసీ-విజయవాడ
|
4918
|
మొత్తం
|
238223
|
***
(Release ID: 1739826)
Visitor Counter : 215