ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆరోగ్యరంగ పటిష్టతకు చర్యలు

Posted On: 27 JUL 2021 3:46PM by PIB Hyderabad

  దేశంలో కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. కోవిడ్ కట్టడికి తగిన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసింది.

 కోవిడ్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అమలుచేసే చర్యల్లో కొన్నింటిని ఈ దిగువన ఇస్తున్నాం.:

  • దేశవ్యాప్తంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆసుపత్రి సదుపాయాలకు తోడుగా ఇతర ఆసుపత్రులను కూడా ప్రభుత్వం కోవిడ్ చికిత్సకోసం సన్నద్ధం చేసింది. కార్మిక రాజ్య బీమా సంస్థ, రక్షణ రంగం, రైల్వేశాఖ, పారామిలిటరీ బలగాలు, ఉక్కు మంత్రిత్వ శాఖ తదితర విభాగాల ఆధ్వర్యంలోని తృతీయ శ్రేణి ఆసుపత్రులను కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. దీనికి తోడుగా, కోవిడ్ కట్టడి కోసం పలు రకాల తాత్కాలిక చికిత్సా సదుపాయాలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) కూడా ఏర్పాటు చేసింది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా చర్యలు తీసుకోవడంతో కోవిడ్ చికిత్సకోసం ఐసొలేషన్, ఐ.సి.యు. పడకల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. తొలి లాక్ డౌన్ ప్రకటనకు ముందు (2020 మార్చి 23వ తేదీ నాటికి) 10,180 గా ఉన్న ఐసొలేషన్ పడకల సంఖ్యను, 2,168గా ఉన్న ఐ.సి.యు. పడకల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం (అంటే, 2021 జూలై 23నాటికి) ఐసొలేషన్ పడకల సంఖ్య 18,21,845కు, ఐ.సి.యు. పడకల సంఖ్య 1,22,035కు పెరిగింది.    
  • 2020 ఆగస్టు నాటికి రోజుకు 5,700 మెట్రిక్ టన్నులమేర ఉన్న ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ఆ తర్వాత గణనీయంగా పెరిగింది. 2021 మే నెల నాటికి ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ రోజువారీ ఉత్పత్తి 9,690 మెట్కరిక్ టన్నులకు చేరింది. ఉక్కు ప్లాంట్లలో, ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఇతర ప్లాంట్లలోనూ ఉత్పత్తిని పెంచడంతో ఇది సాధ్యమైంది.
  • ఉక్కు ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తిపై, వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ అయ్యే ఆక్సిజన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
  • ఆక్సిజన్ పారిశ్రామిక వినియోగంపై ఆంక్షలను విధించారు.
  • మెడికల్ ఆక్సిజన్ కేటాయింపునకు సంబంధించి క్రియాశీలక, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, సంబంధిత మంత్రిత్వ శాఖలను, ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిదార్లను/సరఫరాదార్లను సంప్రదించి, ఈ వ్యవస్థను రూపొందించారు. 
  • వివిధ రకాల చికిత్సా సదుపాయాల్లో మెడికల్ ఆక్సిజన్.కు ఉన్న డిమాండ్.ను అంచనా వేసేందుకు, ఆక్సిజన్ రవాణా పరిస్థితిని తెలుసుకునేందుకు ఆన్ లైన్ డిజిటల్ పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ డిమాండ్ అగ్రిగేషన్ సిస్టమ్ (ఒ.డి.ఎస్.ఎస్.), ఆక్సిజన్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఒ.డి.టి.ఎస్.) వంటి వ్యవస్థలను రూపొందించారు.
  • మెడికల్ ఆక్సిజన్ వృధా కాకుండా అరికట్టేందుకు ఆక్సిజన్.ను హేతుబద్ధంగా వినియోగించడానికి పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను 2020 సెప్టెంబరు 25న జారీ చేశారు. ఆ తర్వాత ఇవే మార్గదర్శక సూత్రాలను సవరించారు. వాటిని 2021 ఏప్రిల్ 25న వివిధ రాష్ట్రాలకు పంపించారు.
  • 2020 ఏప్రిల్, మే నెలల్లో 1,02,400 ఆక్సిజన్ సిలిండర్ల సేకరణ జరిపి, వాటిని ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేశారు. అనంతరం, అదనంగా 1,27,000 సిలిండర్లకోసం 2021 ఏప్రిల్ 21న ఆర్డర్లు జారీ చేశారు. వీటిలో 54,000 జంబో (డి.టైపు) సిలిండర్లు, 73,000 రెగ్యులర్ (బి.టైపు) సిలిండర్లు ఉన్నాయి. వెంటనే ఈ సిలిండర్ల బట్వాడా కూడా మొదలైంది. 2021 జూలై నెల 7వ తేదీ నాటికి 24,511 సిలిండర్లు  బట్వాడా అయ్యాయి.  వీటికి అదనంగా దాదాపు 4,962 బి.టైపు సిలిండర్లు, 1,895 డి.టైపు సిలిండర్లు ప్రస్తుతం రవాణా దశలో ఉన్నాయి.
  • వైద్య చికిత్స అందుబాటులో ఉండే చోటులోనే ఆక్సిజన్.ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఆసుపత్రుల ఆవరణలోనే పి.ఎస్.ఎ. ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులను ఆక్సిజన్ ఉత్పాదనలో స్వయం సమృద్ధిగా తయారు చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దీనితో, దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ సరఫరా గ్రిడ్.పై ఒత్తిడిని తగ్గించేందుకు వీలైంది.
  • గ్రామీణ ప్రాంతాలు, ఒక మోస్తరు పట్టణ ప్రాంతాల్లో మెడికల్ ఆక్సిజన్ లభ్యతను సత్వర ప్రాతిపదికన తెలుసుకునేందుకు వివిధ రాష్ట్రాలకు 18,000కు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కేటాయించారు.
  •  రెమ్ డెసివిర్ అనేది పేటెంట్ ఔషధం. ఈ ఔషధంపై అమెరికాకు చెందిన గీలీడ్ లైఫ్ సైన్సెస్ సంస్థకు పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఈ మందు తయారీకి సంబంధించి భారతదేశంలోని 7 ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గీలీడ్ సంస్థ స్వచ్ఛందంగా  లైసెన్సులు జారీ చేసింది. ఈ మందు తయారీకి సంబంధించి 38లక్షల వయల్స్ మేర ఉన్న నెలసరి సామర్థ్యాన్ని దాదాపు 122లక్షల వయల్స్.కు పెంచారు. దీనికి తోడుగా, ఈ మందు తయారీకోసం అదనంగా 40 ఉత్పాదనా యూనిట్లకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సి.డి.ఎస్.సి.ఒ.) ఆమోదం తెలిపింది. దీనితో దేశంలో ఈ మందు తయారీ క్షేత్రాల సంఖ్య 22నుంచి 62కు పెరిగింది.
  • ఈ ఔషధం నిల్వల పరిస్థితిని ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ, అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ  అన్ని రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ అధికారులకు సూచించారు. రెమ్ డెసివిర్ అక్రమ నిల్వ, నల్లబజారులో విక్రయం వంటి కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
  • కోవిడ్-19 నియంత్రణకు సంబంధించిన  నిర్వహణా కార్యకలాపాలకోసం తగిన సాంకేతిక మార్గదర్శకత్వాన్ని కేంద్ర ఆరోగ్య  కుటుంబ మంత్రిత్వ శాఖ కూడా కొనసాగించింది. ఇప్పటివరకూ, వివిధ రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు 150సార్లు మార్గదర్శక సూత్రాలను/సలహాలు, సూచనలను/నియమ నిబంధనలన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
  • కోవిడ్ వైరస్ మహమ్మారి నియంత్రణకోసం 2019-20 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1,113.21కోట్లను వివిధ రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ల రూపంలో విడుదల చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఎం.) కింద ఈ నిధులు విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన  వివరాలను  అనుబందం-Iలో చూడవచ్చు.
  • 2020-21 ఆర్థిక సంవత్సర కాలంలో రూ. 8,257.88కోట్ల మేర నిధులను వివిధ రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేశారు. ఇండియా కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ కింద ఈ నిధులు విడుదలయ్యాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఎం.) ద్వారా ఈ నిధులందించారు. ఇందుకు సంబంధించి వివరాలను అనుబంధం-II లో చూడవచ్చు.
  • దీనికి తోడుగా, ‘ఇండియా కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ: 2వ దశ’ కింద రూ. 23,123కోట్లతో ఆర్థిక సహాయానికి కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. (ఇందులో రూ. 15,000కోట్లు కేంద్రం వాటా కాగా, రూ. 8,123కోట్లు రాష్ట్రాల వాటా) 2021 జూలై 1నుంచి 2022 మార్చి నెలాఖరు వరకూ ఈ ప్యాకేజీని అమలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా, గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, ఒక మోస్తరు పట్టణ ప్రాంతాలతో సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న ఆసుపత్రి మౌలిక సదుపాయాలను ప్రజలకు చేరువగా తీసుకెళ్ళేందుకు చర్యలు తీసుకుంటారు. కోవిడ్ కట్టడికోసం జిల్లాలు, ఉపజిల్లాల స్థాయిలో ఔషధాల సేకరణకు, వ్యాధి నిర్ధారణ పరీక్ష సదుపాయాల ఏర్పాటుకు, సేవల బట్వాడా వ్యవస్థను విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటారు. చిన్నపిల్లల ఆరోగ్య కేంద్రాలలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఔషధాల బఫర్ నిల్వల నిర్వహించడం, ఆసుపత్రుల నిర్వహణా సమాచార వ్యవస్థకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించడం, అన్ని జిల్లాల్లో టెలి కన్సల్టేషన్ల అనుసంధానాన్ని పెంచడం తదితర చర్యలు తీసుకుంటారు. అలాగే, కోవిడ్-19 నియంత్రణ నిర్వహణా వ్యవస్థకు సంబంధించి చికిత్సా సామర్థ్యాల పెంపుదలకు, శిక్షణకు ఈ ప్యాకేజీ కిందనే చర్యలు తీసుకుంటారు.

అనుబంధం-I

కోవిడ్-19 వైరస్ కట్టడికోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రాంట్లు

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం పేరు

కేంద్రం విడుదల చేసిన గ్రాంట్లు (2019-20) రూ. కోట్లలో

1

అండమాన్, నికోబార్ దీవులు

0.74

2

ఆంధ్రప్రదేశ్

37.11

3

అరుణాచల్ ప్రదేశ్

8.91

4

అస్సాం

72.73

5

బీహార్

66.79

6

చండీగఢ్

1.04

7

చత్తీస్.గఢ్

25.97

8

దాద్రా, నాగర్, హవేళీ

0.52

9

డామన్, డయ్యూ

0.45

10

ఢిల్లీ

22.26

11

గోవా

1.48

12

గుజరాత్

29.69

13

హర్యానా

37.11

14

హిమాచల్ ప్రదేశ్

18.55

15

జమ్ము కాశ్మీర్ (లఢక్ తో సహా)

29.69

16

జార్ఖండ్

25.97

17

కర్ణాటక

59.37

18

కేరళ

74.21

19

లక్షద్వీప్

0.22

20

లడఖ్

-

21

మధ్యప్రదేశ్

55.66

22

మహారాష్ట్ర

74.21

23

మణిపూర్

5.94

24

మేఘాలయ

5.94

25

మిజోరాం

3.71

26

నాగాలాండ్

3.71

27

ఒడిశా

37.11

28

పుదుచ్చేరి

0.74

29

పంజాబ్

40.82

30

రాజస్థాన్

85.35

31

సిక్కిం

2.98

32

తమిళనాడు

48.24

33

తెలంగాణ

33.40

34

త్రిపుర

7.42

35

ఉత్తరప్రదేశ్

132.09

36

ఉత్తరాఖండ్

18.55

37

పశ్చిమ బెంగాల్

44.53

 

మొత్తం

1,113.21

 

గమనిక:

  1. 2020-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా, నాగర్ హవేళీ, డామన్, డయ్యూలను ఉమ్మడిగా పరిగణించారు.

 

అనుబంధం-II

20220-21వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి -ఇండియా, కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ- కింద కేంద్రం విడుదల చేసిన గ్రాంట్లు

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం పేరు

కేంద్రం గ్రాంట్ల విడుదల. రూ. కోట్లలో

1

అండమాన్, నికోబార్ దీవులు

14.80

2

ఆంధ్రప్రదేశ్

422.67

3

అరుణాచల్ ప్రదేశ్

21.96

4

అస్సాం

216.69

5

బీహార్

193.94

6

చండీగఢ్

35.92

7

చత్తీస్ గఢ్

109.21

8

దాద్రా, నాగర్, హవేళీ,.. డామన్, డయ్యూ

4.67

9

ఢిల్లీ

787.91

10

గోవా

17.65

11

గుజరాత్

304.16

12

హర్యానా

187.71

13

హిమాచల్ ప్రదేశ్

54.48

14

జమ్ము కాశ్మీర్

194.58

15

జార్ఖండ్

70.84

16

కర్ణాటక

409.63

17

కేరళ

573.96

18

లడఖ్

44.77

19

లక్షద్వీప్

0.79

20

మధ్యప్రదేశ్

286.57

21

మహారాష్ట్ర

1,185.12

 

[జతచేసిన సందేశం] సందేశం కోసం క్లిక్ చేయండి

 



(Release ID: 1739693) Visitor Counter : 119


Read this release in: English , Punjabi , Tamil