ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19ను సమర్ధంగా ఎదుర్కోవడానికి ఆరోగ్య వ్యవస్థ ఆధునీకరణ
Posted On:
27 JUL 2021 3:52PM by PIB Hyderabad
కోవిడ్ సమయంలో ఆరోగ్య వ్యవస్థను ఆధునీకరించడానికి అవసరమైన సాంకేతిక, రవాణా, ఆర్థిక సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందించింది.
ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఈ కింది చర్యలు అమలు జరుగుతున్నాయి.
* కోవిడ్ బారిన పడని వ్యక్తులకు ఇన్ఫెక్షన్ సోకకుండా చూడడానికి దేశంలో కోవిడ్ తో సంబంధం లేని ఆరోగ్య సేవలను కొనసాగించడానికి కోవిడ్ చికిత్స కోసం మూడు అంచెల ఆరోగ్య వ్యవస్థలను రూపొందించడం జరిగింది. [ i. కోవిడ్ కేర్ కేంద్రాలు (సిసిసి)ii. కోవిడ్ చికిత్సకు ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు (డిసిహెచ్‌సి)(iii) కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు (డిసిహెచ్)]
* ఆసుపత్రులను మరింత అందుబాటులోకి తీసుకుని రావడానికి ఈఎస్ఐసీ, రక్షణ, రైల్వే, పారా మిలిటరీ, స్టీల్ మంత్రిత్వశాఖ తదితర ఆసుపత్రుల ద్వారా కోవిడ్ చికిత్స అందించింది. దేశంలో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని డీఆర్ డీవో సహకారంతో తాత్కాలిక చికిత్సా సౌకర్యాలను భారీ ఎత్తున కల్పించడం జరిగింది.
* రాష్ట్ర ప్రభుత్వాలు కలసి అమలు చేసిన కార్యక్రమాల వల్ల ఐసొలేషన్ పడకల సంఖ్య భారీగా పెరిగింది. మొదటి లాక్ డౌన్ ( 2020 మార్చి 23)విధించిన సమయానికి 10,180 ఐసొలేషన్ పడకలు, 2,168 ఐసీయూ పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుతం ఐసొలేషన్ పడకల సంఖ్య 18,21,845కి, ఐసీయూ పడకల సంఖ్య 1,22,035కి ( 2021 జూలై 20 నాటికి) పెరిగింది.
* దేశంలో 2020 ఆగస్టులో రోజుకు 5700 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ఉత్పత్తి అయ్యేది. 13 మే 2021 నాటికి ఇది 9690 మెట్రిక్ టన్నులకు పెరిగింది. స్టీల్ ప్లాంటులు మరియు ఇతర ఎల్‌ఎంఓలలో ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇది సాధ్యమయ్యింది.
* పారిశ్రామిక అవసరాలపై ఆక్సిజన్ వాడకంపై ఆంక్షలు విధించడం జరిగింది.
* రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదించి వైద్య ఆక్సిజన్‌ను కేటాయించడానికి ఒక సమగ్రమైన పారదర్శక విధానాన్ని రూపొందించడం జరిగింది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, తయారీదారులు / ద్రవ ఆక్సిజన్ సరఫరాదారులు వంటి అన్ని అంశాలు ఇందులో చేర్చడం జరిగింది .
*వైద్య సౌకర్యాల మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ దాని సరఫరాయూ పర్యవేక్షించడానికి ఆక్సిజన్ డిమాండ్ అగ్రిగేషన్ సిస్టం మరియు ఆక్సిజన్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టం లు ఆన్‌లైన్ లో అభివృద్ధి చేయడం జరిగింది.
* మెడికల్ ఆక్సిజన్ వృథా కాకుండా చూడడానికి 20 సెప్టెంబర్ 2020 న ఆక్సిజన్ ను హేతుబద్ధ వాడకంపై మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. వీటిలో మరిన్ని మార్పులను చేసి సవరించిన మార్గదర్శకాలను 2021 ఏప్రిల్ 25 న రాష్ట్రాలకు పంపడం జరిగింది.
* 1,02,400 ఆక్సిజన్ సిలిండర్లను 2020 ఏప్రిల్ మరియు మే నెలల్లో కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందించడం జరిగింది. 2021 ఏప్రిల్ 21 న అదనంగా మరో 1,27,000 సిలిండర్ల కోసం ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. (54,000 జంబో సిలిండర్లు (డి రకం) మరియు 73,000 రెగ్యులర్ సిలిండర్లు (బి రకం). వీటి పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.7 జూలై 2021 నాటికి 24,207 (24,511 బి-రకం మరియు 8,893 డి- రకం) సిలిండర్లు పంపిణీ పూర్తయింది. ఇవి కాకుండా , సుమారు 4962 బి-రకం మరియు 1895 డి-రకం సిలిండర్లు రవాణాలో ఉన్నాయి.
* చికిత్స అందిస్తున్న ప్రాంతాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి ఆసుపత్రులలో పిఎస్ఎ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులు తమ అవసరాలకు ఆక్సిజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. దేశ మెడికల్ ఆక్సిజన్ సరఫరా గ్రిడ్‌పై భారం కూడా తగ్గుతుంది.
* గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల వెలుపల ఉన్న ప్రాంతాల్లో మెడికల్ ఆక్సిజన్ లభ్యతను ఎక్కువ చేయడానికి వివిధ రాష్ట్రాలకు 18,000 కి మించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కేటాయించబడ్డాయి.
* కోవిడ్-19 చికిత్సకు అవసరమైన మందుల సరఫరాను పర్యవేక్షించడానికి ఫార్మాస్యూటికల్స్ విభాగంలో డ్రగ్స్ మేనేజ్‌మెంట్ సెల్ ఏర్పాటు చేయబడింది.
* అన్ని శాఖలను సంప్రదించిన తరువాత కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే మందుల లభ్యత, సరఫరాపై నిర్ణయాలు తీసుకోవడానికి ఫార్మాస్యూటికల్స్ విభాగంలో లభ్యతతో సహా COVID-19 సంబంధిత drugs షధాలకు సంబంధించి అన్ని సమస్యలపై సమర్థవంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఫార్మాస్యూటికల్స్ విభాగం క్రింద డ్రగ్స్ కోఆర్డినేషన్ కమిటీ (డిసిసి) ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.
* రెమ్‌డెసివిర్ పేటెంట్ పొందిన ఒక ఔషధం. దీనిని భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి ఏడు భారతీయ ఔషధ సంస్థలకు గిలియడ్ లైఫ్ సైన్సెస్ USA (పేటెంట్ హోల్డర్) లైసెన్సులను జారీ చేసింది. రెమ్‌డెసివిర్ తయారీ సామర్థ్యాన్ని నెలకు 38 లక్షల నుంచి నెలకు దాదాపు 122 లక్షలకు పెంచడం జరిగింది. అదనంగా 40 అదనపు ఉత్పాదక సైట్‌లను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదించింది. దీనితో తయారీ సైట్‌ల సంఖ్య 22 నుంచి 62 కి పెరిగింది.
* రెమ్‌డెసివిర్ నిల్వలను పరిశీలించి, ఇది దుర్వినియోగం కాకుండా, నల్ల బజారుకు తరలి పోకుండా చూడడానికి తగిన చర్యలను తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు /కేంద్ర పాలిత పాలిత డ్రగ్స్ కంట్రోలర్లకు సూచనలు ఇవ్వడం జరిగింది.
* కోవిడ్ -19 చికిత్స కోసం రెమ్‌డెసివిర్ వినియోగంపై వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ 7 జూన్ 2021 న మార్గదర్శకాలను జారీ చేసింది.
* కోవిడ్ -19కు సంబంధించి వివిధ అంశాల నిర్వహణపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సాంకేతిక మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలకు 150 కి పైగా మార్గదర్శకాలు / సలహాలు / ప్రణాళికలు అందించబడ్డాయి.పట్టణ ప్రాంతాల వెలుపల ఉన్న ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ -19 మహమ్మారి వ్యాపిస్తున్నట్టు గుర్తించిన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 20 మే 2021 న ఈ ప్రాంతాల్లో దీని నివారణ కట్టడిపై ఆదేశాలు జారీ చేసింది.
ఇండియా కోవిడ్ -19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ హెల్త్ సిస్టమ్ ప్రిపరేషన్‌నెస్ ప్యాకేజీ: ఫేజ్ -2' అమలుకు కేంద్ర మంత్రివర్గం రూ .23,123 కోట్లతో (కేంద్ర వాటాగా 15 వేల కోట్ల రూపాయలు , రాష్ట్రాల వాటాగా 8,123 కోట్ల రూపాయలు)ఆమోదం తెలిపింది. ఇది 1 జూలై 2021 నుంచి 31 మార్చి 2022 వరకు అమలు చేయబడుతుంది. దీని కింద గ్రామీణ, గిరిజన మరియు పట్టణ ప్రాంతాలకు వెలుపల వుండే ప్రాంతాల్లో ప్రజలకు వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే అంశంలో రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన సహకారం అందించబడుతుంది. జిల్లా, ఉప జిల్లా స్థాయిలో కోవిడ్-19 కేసుల నివారణ, కట్టడికి అవసరమైన మందులు మరియు పరీక్షల సౌకర్యాలను కల్పించడానికి సహకారం లభిస్తుంది. కేసుల నిర్వహణ (పీడియాట్రిక్ కేర్‌తో సహా) మరియు అవసరాల మేరకు మందులను నిల్వ చేయడం, ఆస్పత్రుల నిర్వహణ, సమాచార వ్యవస్థ, అన్ని జిల్లాల్లో టెలి-కన్సల్టేషన్ ను అందుబాటులోకి తేవడం, సేవలను మెరుగు పరచి అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ఈ ప్యాకేజీ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సహకరిస్తుంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ పవార్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.
(Release ID: 1739690)
Visitor Counter : 205