పర్యటక మంత్రిత్వ శాఖ

రామాయణ సర్క్యూట్ 'స్వదేశ్ దర్శన్' పథకం కింద గుర్తించబడిన థీమాటిక్ సర్క్యూట్: శ్రీ జి. కిషన్ రెడ్డి

प्रविष्टि तिथि: 27 JUL 2021 5:05PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

*రామాయణ సర్క్యూట్ కింద రెండు ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి.
*బౌద్ధ, తీర్థంకర్, కృష్ణ, ఆధ్యాత్మిక సర్క్యూట్ల కింద ప్రాజెక్టులను కూడా మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది

పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన 'స్వదేశ్ దర్శన్' పథకం కింద గుర్తించబడిన సర్క్యూట్లో రామాయణ సర్క్యూట్ ఒకటి. దీని కింద 2 ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి. బౌద్ధ, తీర్థంకర్, కృష్ణ, ఆధ్యాత్మిక సర్క్యూట్ల కింద ప్రాజెక్టులను కూడా మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది.

దీనికి తోడు పర్యాటక మంత్రిత్వ శాఖ 'నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమెజ్‌ అండ్ స్పిర్చుయల్, హెరిటేజ్‌  ఆగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రశాద్)' పథకం కింద గుర్తించిన తీర్థయాత్రలు మరియు వారసత్వ ప్రదేశాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత పరిపాలనలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఈ సమాచారాన్ని పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో అందించారు.


 

*******


(रिलीज़ आईडी: 1739682) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Punjabi