సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

సంచార జాతులు, డీనోటిఫై చేసిన తెగల అభివృద్ధి

Posted On: 27 JUL 2021 3:08PM by PIB Hyderabad


    సంచార జాతులు, డీనోటిఫై చేసిన తెగల సంక్షేమం కోసం "డీఎన్‌టీ వర్గాల ఆర్థిక సాధికారత పథకం (సీడ్)" అనే ప్రత్యేక పథకాన్ని డిపార్టుమెంట్‌ ఆమోదించింది. అందులో, ఈ క్రింది నాలుగు అంశాలు ఇమిడి ఉన్నాయి:

* పోటీ పరీక్షల్లో పాల్గొనేలా డీఎన్‌టీ అభ్యర్థులకు మంచి నాణ్యత గల శిక్షణ ఇవ్వడం
* ఆరోగ్య బీమా కల్పించడం
* సామాజిక స్థాయిలో జీవనోపాధి మార్గాలను కల్పించడం
* ఈ వర్గాల ప్రజలు నిర్మించుకునే ఇళ్లకు ఆర్థిక సాయం అందించడం

    కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమ భౌమిక్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.

 

***


(Release ID: 1739572)
Read this release in: English , Urdu , Tamil