సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

డి-నోటిఫైడ్, సంచార తెగ‌ల‌ వారి కోసం జాతీయ కమిషన్

Posted On: 27 JUL 2021 1:52PM by PIB Hyderabad

డి-నోటిఫైడ్, సంచార, ఉప‌-సంచార తెగల వారి నిమిత్తం కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ కమిషన్‌ను (ఎన్‌సీడీఎన్‌టీ) ఏర్పాటు చేసింది. 12.02.2014 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మంత్రిత్వ శాఖ దీనిని ఏర్పాటు చేసింది. గెజిట్ ఏర్పాటు తేదీ నుంచి 3 సంవత్సరాల కాలావ‌ధితో ఈ కమిష‌న్ ఏర్పాటు చేయ‌డ‌మైంది. డీఎన్‌టీల ప్రయోజనాలను కోరుతూ ప్రభుత్వం ఇప్పటివరకు ప‌లు కింద పేర్కొన్న‌ సంక్షేమ పథకాలను ప్రారంభించింది:
-డీఎన్‌టీ బాలురు, బాలికల నిమిత్తం డాక్టర్ అంబేద్కర్ ప్రీ-మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్
- డీఎన్‌టీ బాలుర మరియు బాలికల కోసం నానాజీ దేశ్‌ముఖ్ హాస్టళ్ల నిర్మాణ పథకం.
- డి-నోటిఫైడ్, సంచార జాతులు మరియు ఉప సంచార జాతుల వారి (డీడబ్ల్యుబీడీఎన్‌సీ) కోసం అభివృద్ధి, సంక్షేమ బోర్డును 21.02.2019న ఏర్పాటు చేయబడింది.
- డి-నోటిఫైడ్, సంచార జాతులు, ఉప సంచార జాతుల గుర్తింపుప్రక్రియను పూర్తి చేయడానికి నితీ ఆయోగ్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.  నితీ ఆయోగ్, ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో (ఏఎన్‌ఎస్‌ఐ) డీఎన్‌టీ కమ్యూనిటీలను గుర్తించి వాటిని ఎస్సీ / ఎస్టీ / ఓబిసి విభాగంలో చేర్చే సర్వే పని కూడా జరుగుతోంది.
దీనికి తోడు, డిపార్ట్‌మెంట్‌ ఈ సమాజం యొక్క సంక్షేమం కోసం "స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ డీఎన్‌టీ కమ్యూనిటీస్ (ఎస్ఈఈడీ)"అనే ప్రత్యేక పథకాన్ని ఆమోదించింది. ఇది నాలుగు విభాగాలు క‌ల‌వుః-
పోటీ పరీక్షలలో హాజరుకావడానికి డీఎన్‌టీ అభ్యర్థులకు మంచి నాణ్యత గల కోచింగ్ ఇవ్వడం.
వారికి ఆరోగ్య బీమా అందించడం.
సమాజ స్థాయిలో జీవనోపాధి చొరవను సులభతరం చేయడం;
ఈ వర్గాల సభ్యులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం.
ఈ సమాచారాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి సుశ్రీ ప్రతిమా భూమిక్ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
                               

***


(Release ID: 1739531) Visitor Counter : 557


Read this release in: English , Urdu , Bengali