సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఆవాస సౌకర్యాలు
Posted On:
27 JUL 2021 1:50PM by PIB Hyderabad
నిరాశ్రయులైన, నిరుపేదలైన ట్రాన్స్‌జెండర్ల వ్యక్తుల ఆశ్రయం కోసం షెల్టర్ హోం ను ఏర్పాటు చేయడం సహా పలు సంక్షేమ చర్యలతో ఒక పథకాన్ని సామాజిక న్యాయం, సాధికారత శాఖ రూపొందిస్తోంది.
ట్రాన్స్‌జెండర్ల (లింగమార్పిడి చేయించుకున్న) కోసం 12 పైలెట్ షెల్టర్ హోమ్‌లను నిర్మించడమే కాక సమాజ ఆధారిత సంస్థలకు (కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ - సిబిఒలు) గరిమ గృహాలను నిర్మించేందుకు ఆర్ధిక సహాయాన్ని అందించడాన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ పైలెట్ షెల్టర్ హోంలు మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, ఒడిషాలలో ఉన్నాయి. నిరాశ్రయులు, పేదరికంలో ఉన్న ట్రాన్స్‌జండర్లకు సురక్షితమైన, భద్రత కలిగిన ఆశ్రయాన్ని అందించడం ఈ షెల్టర్ హోం ల ప్రధాన లక్ష్యం. ఈ షెల్టర్ హోంలు ఆహారం, వైద్యం, వినోద సౌకర్యాలతో పాటుగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సామర్ధ్య నిర్మాణం/ నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తాయి.
ఈ మంత్రిత్వ శాఖ ఎటువంటి పింఛను పథకాన్ని అమలు చేయడం లేదు. అయితే, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ఎస్ఎపి)ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా, 3,384మంది ట్రాన్స్‌జెండర్లకు నెలవారీ పింఛనును అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి మంగళవారం నాడు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1739529)
Visitor Counter : 231