సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖాదీ స‌హ‌జ‌ పెయింట్ ఆవిష్క‌రణ‌

Posted On: 26 JUL 2021 2:26PM by PIB Hyderabad

ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) యొక్క యూనిట్ అయిన.. జైపూర్‌లోని కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్‌ పేపర్ ఇన్‌స్టిట్యూట్ (కేఎన్‌హెచ్‌పీఐ) ఆవు పేడ నుండి ఖాదీ ప్రకృతిక్ పెయింట్‌ను అభివృద్ధి చేసింది. కేఎన్‌హెచ్‌పీఐ అధ్యయనంలో ఖాదీ ప్రకృతిక్ పెయింట్ పర్యావరణ అనుకూలమైనదిగా తెలింది. అత్యంత అనుకూల‌మైన ధ‌ర‌ల్లో పెయింట్‌ ల‌భిస్తోంది. కేఎన్‌హెచ్‌పీఐ అభివృద్ధి చేసిన ఖాదీ ప్రకృతిక్ పెయింట్‌ను నేషనల్ టెస్ట్ హౌస్, ఘజియాబాద్ (భారత ప్రభుత్వం), నేషనల్ టెస్ట్ హౌస్ ముంబ‌యి (భారత ప్రభుత్వం) మరియు శ్రీ రామ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, న్యూఢిల్లీ (ఒక ఐఎస్ఓ సర్టిఫికేట్ టెస్ట్ ల్యాబ్) లోనూ పరీక్షించబ‌డింది. ఈ కొత్త ప్రాకృతిక పెయింట్ అవసరమైన పారామితులను సంతృప్తిపరిచింది. ఈ ఖాదీ ప్రకృతిక‌ పెయింట్ త‌యారీకి గాను ఆవు పేడను ఉపయోగించడం వ‌ల్ల.. ఇది స్థానిక తయారీని ప్రోత్సహిస్తుంది. మేటి స్థిరమైన ఉపాధి కల్పిస్తుంది, రైతులకు మరియు ఆవు ఆశ్రయ గృహాలకు అదనపు ఆదాయాన్ని ఇస్తుంది. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి లభిస్తుంది. ఈ సమాచారాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి శ్రీ నారాయణ్ రాణే రాజ్యసభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 

 

***

 



(Release ID: 1739079) Visitor Counter : 246


Read this release in: English , Urdu , Bengali , Punjabi