భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

రెండ‌వ ద‌శ‌లోకి ప్ర‌వేశిస్తున్న ఆర్‌&డి సౌక‌ర్యాల‌ను పంచుకునేందుకు ఉద్దేశించిన ఐ-ఎస్‌టిఇఎం పోర్ట‌ల్, ఐదేళ్ళ పొడిగింపుకు భార‌త ప్ర‌భుత్వ ప్ర‌ధాన శాస్త్రీయ స‌ల‌హాదారు కార్యాల‌యం ఆమోదం

Posted On: 25 JUL 2021 7:14PM by PIB Hyderabad

ప‌రిశోధ‌న‌, అభివృద్ధి సౌక‌ర్యాలు (ఆర్‌&డి)ను పంచుకునేందుకు జ‌న‌వ‌రి 2020న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ది ఇండియ‌న్ సైన్స్ టెక్నాల‌జీ అండ్ ఇంజినీరింగ్ పెసిలిటీస్ మ్యాప్ (ఐ-ఎస్‌టిఇఎం) అన్న జాతీయ వెబ్ పోర్ట‌ల్ ను ప్రారంభించారు.  ప్ర‌ధాన మంత్రి శాస్త్ర‌, సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ స‌ల‌హా మండ‌లి (పిఎం -ఎస్‌టిఐఎసి) మిష‌న్ ఆధ్వ‌ర్యంలోని భార‌త ప్ర‌భుత్వ ప్ర‌ధాన శాస్త్రీయ స‌ల‌హాదారు కార్యాల‌యం చొర‌వ అయిన ఐ-ఎస్‌టిఎఎంఐ(www.istem.gov.in). ఐ-ఎస్‌టిఇఎంప్రాజెక్టును మ‌రొక ఐదేళ్ళు అంటే 2026 వ‌ర‌కు, మ‌రిన్నివిశేషాల‌తో రెండ‌వ ద‌శ‌లోకి ప్ర‌వేశించేందుకు పొడిగించారు. 
దేశీయం సాంకేతిక‌త‌ల‌ను, శాస్త్రీయ ప‌రిక‌రాల‌ను అభివృద్ధి చేయ‌డం,లో భాగంగా, ప‌రిశోధ‌కుల‌ను వ‌న‌రుల‌తో అనుసంధానం చేయ‌డం,  ఐ-ఎస్‌టిఇఎం  వెబ్ పోర్ట‌ల్ ద్వారా దేశంలో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ నిధుల‌తో న‌డిచే ఆర్ &డి కేంద్రాలు ప‌రిశోద‌కుల‌కు  అందుబాటులోకి తెచ్చేందుకు మ‌ద్ద‌తునిచ్చి,వారిని సాధికారం చేయ‌డం వారికి అవ‌సర‌మైన స‌ర‌ఫ‌రాల‌ను అందించ‌డం ద్వారా దేశంలోని ఆర్‌&డి వాత‌వ‌ర‌ణాన్ని బ‌లోపేతం చేయ‌డం  ఐ-ఎస్‌టిఇఎం  ల‌క్ష్యం. 
తొలి ద‌శ‌ల‌లో, దేశ వ్యాప్తంగా ఉన్న 1050 సంస్థ‌ల నుంచి 20,000ల‌కు పైగా ప‌రిక‌రాల జాబితా, 20,000మందికి పైగా భార‌తీయ ప‌రిశోధ‌కుల జాబితాను పోర్ట‌ల్ క‌లిగి ఉంది. ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించుకోవ‌డానికి ప‌రిశోధ‌కుల‌కు స్లాట్ల‌ను అందుబాటులోకి తేవ‌డం అలాగే పేటెంట్లు, ప్ర‌చుర‌ణ‌లు, సాంకేతిక‌త‌ల వంటి ఫ‌లితాల‌ను పంచుకోవ‌డానికి ఐ-ఎస్‌టిఇఎం పోర్ట‌ల్ వీలు క‌ల్పిస్తుంది. రెండ‌వ ద‌శ‌లో, డిజిట‌ల్ క్యాట‌లాగ్ ద్వారా లిస్ట్ అయిన దేశీయంగా త‌యారైన సాంకేతిక ఉత్ప‌త్తుల‌ను పోర్ట‌ల్ క‌లిగి ఉంటుంది.  
సహకారం మరియు భాగస్వామ్య నిర్మాణం ద్వారా ఆర్ అండ్ డి మౌలిక సదుపాయాల యొక్క సమర్థవంతమైన వినియోగాన్ని మెరుగుపరచడానికి పిఎస్ఎ కార్యాలయం మద్దతు ఉన్న వివిధ సిటీ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్స్ (https://www.psa .gov.in/st-clusters) కోసం  భాగస్వామ్య ఎస్‌టిఐ పర్యావరణ వ్యవస్థలో పోర్టల్ ఒక వేదికను అందిస్తుంది.  అంతేకాకుండా, విద్యార్ధులు, శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న ప్రాజెక్టుల‌ను చేప‌ట్టేందుకు ఎంపిక చేసిన ఆర్ &డి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెస్తుంది. ఐ-ఎస్‌టిఇఎం పోర్ట‌ల్ త‌న నూత‌న ద‌శ‌లో ప‌రిశోధ‌న‌, ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు - ముఖ్యంగా 2 టైర్‌, 3 టైర్ న‌గ‌రాల వ‌చ్చేదానిని ప్రోత్స‌హించ‌డ‌మే కాక ఉద్భ‌విస్తున్న స్టార్ట‌ప్ వాతావ‌ర‌ణాన్ని ప్రోత్స‌హించే క్రియాశీల‌క డిజిట‌ల్ వేదిక‌గా రూపొందిస్తారు.

 

***


(Release ID: 1738910) Visitor Counter : 260


Read this release in: English , Hindi , Punjabi , Tamil