రైల్వే మంత్రిత్వ శాఖ

బులెట్ రైలు ప్రాజెక్టులు, తుది లోకేష‌న్ స‌ర్వే, జియో టెక్నిక‌ల్ ప‌రిశీల‌న పూర్తి, అలైన్‌మెంట్ ఖ‌రారు చేయ‌డం జ‌రిగింది.


వ‌న్య‌ప్రాణికి సంబంధించి, కోస్ట‌ల్ రెగ్యులేష‌న్ జోన్ (సిఆర్‌జెడ్‌), అట‌వీ అనుమ‌తులకు సంబంధించి చ‌ట్ట‌బ‌ద్ధ క్లియ‌రెన్సులు పొంద‌డం జ‌రిగింది.

Posted On: 23 JUL 2021 5:12PM by PIB Hyderabad

జ‌పాన్‌ప్ర‌భుత్వ ఆర్ధిక‌, సాంకేతిక స‌హ‌కారంతో దేశంలో ప్ర‌స్తుతం ముంబాయి, అహ్మ‌దాబాద్ హైస్పీడ్ రెయిల్ (ఎం.ఎ.హెచ్.ఎస్‌.ఆర్‌) ఒక్క‌టే అనుమ‌తి పొందిన హై స్పీడ్ రెయిల్ (హెచ్‌.ఎస్‌.ఆర్‌) ప్రాజెక్టు.
ఇందుకు సంబంధించి ఒక స్పెష‌ల్ ప‌ర్స‌స్ వెహికిల్‌ను నేష‌న‌ల్ హైస్పీడ్ రెయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ( ఎన్‌హెచ్ ఎస్ ఆర్ సి ఎల్‌)ను  ఈ ప్రాజెక్టు అమ‌లు చేసేందుకు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

ముంబాయి, అహ్మ‌దాబాద్ హైస్పీడ్ రెయిల్ (ఎం.ఎ.హెచ్ ఎస్‌.ఆర్‌) ప్రాజెక్టు ప్ర‌స్తుత స్థితి కిందివిధంగాఉంది.:-

 తుది లొకేష‌న్ స‌ర్వే, జియో టెక్నిక‌ల్ ప‌రిశీన పూర్తి అయింది. అలైన్‌మెంట్‌ను ఖ‌రారు చేయ‌డం జ‌రిగింది.

వ‌న్య‌ప్రాణుల‌కుసంబంధించి, కోస్ట‌ల్‌రెగ్యులేష‌న్ జోన్ (సిఆర్‌జెడ్‌), అట‌వీ అనుమ‌తుల‌కు సంబంధించి చ‌ట్ట‌బ‌ద్ద‌మైన క్లియ‌రెన్సులు పొంద‌డం జ‌రిగింది.ఈ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన మొత్తం సుమారు 1396 హెక్టార్ల భూమిలో సుమారు 1046 హెక్టార్ల భూమికి అనుమ‌తి ఒప్పందాలు, రెగ్యుల‌ర్ అవార్డు వ‌ర్తింపువంటివి పూర్త‌య్యాయి.
1651 స‌దుపాయాల‌లో 1342 స‌దుపాయాల‌ను మార్చ‌డం జ‌రిగింది.
మొత్తం ప్రాజెక్టు ప‌నిని 27 కాంట్రాక్టు పాకేజ్‌లుగా విభ‌జించ‌డం జరిగింది.  ఇందులో వ‌డోద‌ర లో ఏర్పాటు చేయ‌నున్న ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఉంది. ప్ర‌స్తుతం 7 ప్యాకెజ్ ప‌నుల‌ను కేటాయించారు. మ‌రో 10 పాకేజ్‌ల‌కు టెండ‌ర్లు పిలిచారు.
2021 జూన్ వ‌ర‌కు ఎం.ఎ.హెచ్‌.ఎస్‌.ఆర్ ప్రాజెక్టుపై పెట్టిన ఖ‌ర్చు 13,483 కోట్ల రూపాయ‌లు. ప్ర‌ధానంగా ఇది భూ సేక‌ర‌ణ‌పైన అక్క‌డ ఉన్న స‌దుపాయాల‌ను వేరో చోటికి మార్చ‌డ‌నికి,కాంట్రాకు చెల్లింపుల‌కు పెట్టిన ఖ‌ర్చు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన ప్ర‌తికూల ప‌రిస్థితుల వ‌ల్ల ,మ‌హారాష్ట్ర నుంచి భూమి బ‌ద‌లాయింపులో జాప్యం వ‌ల్ల  ప్రాజెక్టు ప‌నులు మంద‌కొడిగా సాగుతున్నాయి..

 దీనికి తోడు రైల్వే మంత్రిత్వ‌శాఖ, ఏడు హై స్పీడ్ రైల్ (హెచ్.ఎస్‌.ఆర్ ) కారిడార్ల‌కు సంబందించి స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక‌ను రూపొందించే బాధ్య‌త‌ను నేష‌న‌ల్ హై స్పీడ్ రెయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ ఎస్ ఆర్‌సి ఎల్‌)కు అప్ప‌గించింది. ఇందులో ద‌క్షిణ భార‌త‌దేశానికి సంబంధించి చెన్నై -బెంగ‌ళూరు-మైసూరు, ముంబాయి-పూణె-హైద‌రాబాద్ మార్గాలు ఉన్నాయి. ఇది పురోగ‌తి లో ఉంది.
ఈ స‌మాచారాన్నిరైల్వే , క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్‌,ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ‌మంత్రి శ్రీ అశ్విని వైష్ణ‌వ్ ఈ రోజు రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన ఒక లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు.

***


(Release ID: 1738619) Visitor Counter : 207


Read this release in: English , Urdu , Marathi