రైల్వే మంత్రిత్వ శాఖ

ప్యాసెంజ‌ర్ రైళ్ళ ఆప‌రేష‌న్స్ ప్రాజెక్టుకు పిపిపిలో బిడ్లు నేడు ప్రారంభం


రూ. 7200 కోట్ల పెట్టుబ‌డితో 29 జ‌తల రైళ్ళ‌ను 40 ఆధునిక రేక్ ల‌తో న‌డిపేందుకు ప్రైవేటు, ప్ర‌భుత్వ రంగాల నుంచి బిడ్లు

స‌త్వ‌రంగా మూల్యాంక‌నాన్ని పూర్తి చేసి బిడ్ల‌ను నిర్ణ‌యించ‌నున్న రైల్వేలు

నాడు పోస్టు చేయడమైనది: 23 JUL 2021 6:11PM by PIB Hyderabad

పారిశ్రామిక‌వేత్త‌ల‌తో ప‌లు మార్లు చ‌ర్చ‌లు, వివ‌ర‌ణాత్మ‌క త‌ర్కం త‌ర్వాత‌ ప్యాసెంజ‌ర్ రైళ్ళ కార్య‌క‌లాపాల ప్రాజెక్టులో పిపిపి కింద బిడ్ల‌ను 23 జులై, 2021న ప్రారంభించారు. భార‌త‌దేశంలో ప‌బ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేష‌న్ (పిపిపి- ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యం) ద్వారా ప్ర‌పంచ‌స్థాయి రైళ్ళ‌ను తీసుకువ‌చ్చేందుకు ఇది స‌రికొత్త య‌త్నం. 
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రైవేటు, ప్ర‌భుత్వ రంగాల నుంచి రూ. 7200 కోట్ల పెట్టుబ‌డితో 29 జ‌తల రైళ్ళ‌ను 40 ఆధునిక రేక్ ల‌తో న‌డిపేందుకు బిడ్ల‌ను అందుకుంది. రైల్వే మంత్రిత్వ శాఖ వీటిని స‌త్వ‌రంగా మూల్యాంక‌నం చేయ‌డాన్ని పూర్తి చేసి, బిడ్ల‌ను నిర్ణ‌యించ‌నుంది. 

***


(రిలీజ్ ఐడి: 1738375) సందర్శకుల సూచీ సంఖ్య : : 162
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी