ఆయుష్
కరోనా మహమ్మారి కాలంలో ప్రజల రోగనిరోధకతను మెరుగుపరచడంలో సహాయపడిన ఆయుర్వేద ఉత్పత్తులు
Posted On:
23 JUL 2021 4:29PM by PIB Hyderabad
ఆయుష్ సూచనలను, ఉపాయాలను అంగీకరించి, ౠచరించిన ప్రజలు, కోవిడ్ -19ని నిరోధించడంలో దాని ప్రభావానికి సంబంధించిన డాటాను ఉత్పత్తి చేసేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ సంజీవని మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి, ప్రారంభించింది. విభిన్నవర్గాల నుంచి వచ్చిన స్పందనల విశ్లేషణల ప్రకారం ఈ ఆప్ ద్వారా 1.47 కోట్ల మంది స్పందించారు. స్పందించినవారిలో 85.1% మంది కోవిడ్ -19 నివారణకు తాము ఆయుష్ సూచించిన చర్యలను ఆచరించినట్టుగా తెలుపగా, ఇందులో 89.9%మంది ఆయుష్ సలహా సూచనలను పాటించడం ద్వారా లబ్ధి పొందినట్టు వెల్లడించారు. కాగా, సుమారు 79.1% మంది యూజర్లు ఆయుష్ సలహా సూచనలను ఆచరించడం అన్నది మంచి ఆరోగ్య భావనకు లోను చేసిందని వెల్లడించాగా, 63.4% నిద్ర, ఆకలి, కడుపుకు సంబంధించిన అలవాట్లు, శారీరక బలం, మానసిక ఆరోగ్యం మెరుగుపడినట్టు వెల్లడించారు.
సమీప భవిష్యత్తులో ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించే ఔషధ మూలికల ఉత్పత్తిని పెంచడానికి మూలికా సాగును ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన పేరుతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముసాయిదాను తయారు చేసింది. కాగా, దీనికి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది.
ఈ సమాచారాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాఆయ మంత్రి మహేంద్ర భాయ్ ముంజపార లోక్ సభకు శుక్రవారం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1738372)
Visitor Counter : 163