సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదురయ్యే సమస్యల నుంచి ఎంఎస్‌ఎంఈలకు ఉపశమనం కలిగించేలా కార్యక్రమం మరియు విధానపరమైన చర్యలు
Posted On:
22 JUL 2021 1:20PM by PIB Hyderabad
దేశంలో ఎంఎస్ఎంఈ సంస్థల నమోదు ప్రక్రియను భారత ప్రభుత్వం మరింతగా సరళీకృతం చేసింది. ఇందుకు గాను ఈ ఏడాది 2020 జూలై 1వ తేదీన 'ఉదోగ్ ఆధార్ మెమోరాండం' (యుఏఎం) స్థానంలో కొత్తగా 'ఉదయం రిజిస్ట్రేషన్' (యుఆర్) తీసుకువచ్చారు. యుఆర్ ఖర్చు లేకుండా, పారదర్శకంగా, ఆన్‌లైన్‌లో, ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనిలో స్వీయ-ప్రకటనపై ఆధారపడి అనుమతులను జారీ చేస్తారు. దీనికి ఎటువంటి పత్రాలు అవసరం లేదు. ఐటీఆర్ మరియు జీఎస్‌టీఐఎన్‌తో ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్ ఉంది. కోవిడ్-19 మహమ్మారి రెండో
దశ వ్యాప్తి నెలకొని ఉన్న సమయంలోనూ ఎంఎస్ఎంఈలు కొత్తగా యుఆర్‌లో నమోదవుతూనే వస్తున్నాయి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)/ గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం (ఆర్ఈజీపీ) / మైక్రో యూనిట్ల అభివృద్ధి & రిఫైనాన్స్ ఏజెన్సీ (ముద్రా) వంటి పథకాల ప్రయోజనాలను ఎంఎస్‌ఎంఈలు పొందవచ్చు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి వలన ఎదురయ్యే సమస్యల నుండి ఉపశమనం కలిగించేలా వివిధ ప్రకటనలు చేసింది. 2021 జూలైలో పీఎంఈజీపీ 2020-21 మధ్యకాలంలో ప్రాజెక్టులు మరియు ఉపాధి కల్పనల సంఖ్య వరుసగా 91,054 మరియు 7,28,432గా ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఈ) కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులతో సహా ఏ రాష్ట్రంలోనూ ఎంఎస్‌ఎంఈ ని ఏర్పాటు చేయలేదు. ఎంఎస్ఎంఈ రంగం ప్రైవేట్ వ్యక్తులను కలిగి ఉంటుంది. ఈ రంగంలో వ్యవస్థాపకులే స్వయంగా పెట్టుబడులు పెడుతారు. ఈ తరహా సంస్థల ప్రోత్సాహం మరియు అభివృద్ధి రాష్ట్ర పరిధిలోని విషయం. ఏదేమైనా, దేశంలో ఎంఎస్ఎంఈ ల యొక్క పోటీతత్వాన్ని పెంపొందించడానికి, అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించేలా ప్రభుత్వం వివిధ రకాల పథకాలు, కార్యక్రమాలు మరియు విధానపరమైన చర్యలను రాష్ట్రం / యుటీ ప్రభుత్వాల ప్రయత్నాల ద్వారా అందిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎఎఈజీపీ), క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఫర్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ స్కీమ్ (సీఎల్‌సీఎస్-టీయుఎస్), ఖాదీ& విలేజ్ ఇండస్ట్రీస్, కాయర్, ఇంటర్‌నేషన్ కోఆపరేషన్ పథకంతో సహా ఎంఎస్‌ఎంఈల కోసం ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ అనేక పథకాలను అమలు చేస్తోంది. ప్రొక్యూర్‌మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ స్కీమ్, సూక్ష్మ, చిన్న సంస్థలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కోసం పథకం, జాతీయ ఎస్సీ / ఎస్టీ హబ్ మొదలైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పథకాల కింద వివిధ ప్రయోజనాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అన్ని అర్హత గల ఎంఎస్‌ఎంఈలకు అందుబాటులో ఉన్నాయి. సూక్ష మరియు చిన్న ఎంటర్‌ప్రైజెస్ ఆర్డర్ 2012, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ఎస్సీ / ఎస్టీ యాజమాన్యంలోని ఎంఎస్ఈల నుండి 4 శాతం మరియు మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఈ నుండి 3 శాతం సేకరణను తప్పనిసరి చేసింది. ఈ సమాచారాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
*****
(Release ID: 1737823)