సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

అదనపు సౌకర్యాలు కల్పించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ లోని 3 స్మారక చిహ్నాలను "ఆదర్శ స్మారక" కేంద్రాలు గా గుర్తించారు: శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 20 JUL 2021 5:34PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు :

-   ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున కొండ వద్ద ఉన్న స్మారక చిహ్నాలు, సాలిహుండంలో బుద్ధుని అవశేషాలు, లేపాక్షి లోని వీరభద్ర ఆలయం 'ఆదర్శ స్మారక' కేంద్రాలు గా గుర్తించబడ్డాయి. 

-   ఈ ఆదర్శ స్మారక కేంద్రాల లో   వై-ఫై, ఫలహారశాల, వ్యాఖ్యాన కేంద్రం, బ్రెయిలీ సంకేతాలు, విద్యుత్ దీపాలంకరణ మొదలైన  అదనపు సౌకర్యాలు కలుగజేయ వలసి ఉంటుంది.

-   "వారసత్వాన్ని దత్తత చేసుకోండి" అనే ప్రభుత్వ పథకం లో  గండికోట వద్ద కోట ను చేర్చారు . 

- ఆంధ్రప్రదేశ్‌లో  135 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు /  ప్రదేశాలు ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 135 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు / ప్రదేశాలు ఉన్నాయి.   కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు / ప్రదేశాలలో సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం తో పాటు, అక్కడ పరిస్థితులను మెరుగుపరచడం ఒక నిరంతర ప్రక్రియ గా కొనసాగుతూనే ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్మారక చిహ్నాలు (i) గుంటూరు జిల్లా లోని నాగార్జునకొండ వద్ద ఉన్న స్మారక చిహ్నాలు, (ii) శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం వద్ద ఉన్న బుద్ధుని అవశేషాలు (iii) అనంతపురం జిల్లాలోని లేపాక్షి వద్ద ఉన్న వీరభద్ర ఆలయం ఆదర్శ స్మారక కేంద్రాలు గా గుర్తించబడ్డాయి.  ఇక్కడ వై-ఫై, ఫలహారశాల, వ్యాఖ్యాన కేంద్రం, బ్రెయిలీ సంకేతాలు, విద్యుత్ దీపాలంకరణ వంటి అదనపు సౌకర్యాలు కల్పిస్తారు.  వీటితో పాటు, గండికోట వద్ద ఉన్న కోట ను, పి.పి.పి. పద్ధతి లో పర్యాటక మంత్రిత్వ శాఖ కు చెందిన  "వారసత్వాన్ని దత్తత చేసుకోండి" అనే ప్రభుత్వ పథకం లో  చేర్చారు . 

ఈ కేంద్రీకృత రక్షిత స్మారక చిహ్నాలు / ప్రదేశాల్లో పరిసరాల పరిరక్షణ, సంరక్షణ, పర్యావరణ అభివృద్ధి పనులను అవసరం మరియు ప్రాధాన్యత ఆధారంగా నిర్ణయించిన వార్షిక పరిరక్షణ కార్యక్రమం క్రింద చేపడతారు. 

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రాజ్యసభ కు సమర్పించిన  లిఖిత పూర్వక సమాధానం లో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

 

 

*****



(Release ID: 1737387) Visitor Counter : 258


Read this release in: English , Urdu , Tamil