హోం మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ నిబంధ‌న‌ల సడ‌లింపు

Posted On: 20 JUL 2021 3:07PM by PIB Hyderabad

సాంక్ర‌మిక వ్యాధులు, ముఖ్యంగా శ్వాస‌కోస మార్గం ద్వారా వ్యాపించే వ్యాధుల‌ను నివారించేందుకు భౌతిక‌/  సామాజిక దూరం (శ్వాస‌కోశ‌, చేతుల పారిశుభ్ర‌త స‌హా) అన్న‌ది నిరూపిత‌ ఔష‌ధ‌ర‌హిత ప‌ద్ధ‌తి.  రాష్ట్రాలు/  కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్ ను స‌డ‌లించ‌డం, మ‌హ‌మ్మారి నిస్త్రాణ, స‌మాజం కోవిడ్‌కి త‌గిన ప్ర‌వ‌ర్త‌న‌కు క‌ట్టుబ‌డి ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల‌,  ప‌రిణామం చెంది, వ్యాపించే సార్స్‌- కోవి-2 ( SARS-CoV-2)వైర‌స్‌ల భిన్న ర‌కాలుఅన్నీ క‌లిసి భార‌త్ దేశం  ఏప్రిల్ నుంచి మే 2021 వ‌ర‌కు  రెండ‌వ వేవ్ ను ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌చ్చింది. ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శౄఖ రాష్ట్రాల‌లో, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో ఫిబ్ర‌వ‌రి నుంచి మే కాలంలో  చెప్పుకోద‌గిన సంఖ్య‌లో  మోహ‌రించిన కేంద్ర  బృందాలు కోవిడ్‌కు త‌గిన ప్ర‌వ‌ర్త‌న లేక‌పోవ‌డాన్ని, నియంత్రించ‌డానికి త‌గిన కృషి జ‌రుగ‌డం లేద‌ని ప‌ట్టి చూపాయి. 
దేశంలో కోవిడ్‌-19ను ప్ర‌భావ‌వంతంగా నియంత్రించేందుకు హోం వ్య‌వ‌హారాల శాఖ (ఎంహెచ్ ఎ) విపత్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం (డిఎం చ‌ట్టం), 2005 కింద ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్త‌ర్వుల‌ను, మార్గ‌ర‌ద్శ‌కాల‌ను జారీ చేస్తోంది.ప‌రిస్థితిని అంచ‌నా వేసుకొని దాని ఆధారంగా 25 ఏప్రిల్ 2021న ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌తో జారీ  చేసిన సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలి త ప్రాంతాల‌కు 29 ఏప్రిల్ 2021న ఎంహెచ్ఎ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం (డిఎం యాక్ట్‌), 2005లోని త‌గిన అంశాల కింద అవ‌స‌ర‌మైన నియంత్ర‌ణ చ‌ర్య‌లను అమ‌లు చేయ‌వ‌ల‌సిందిగా అన్ని రాష్ట్రాల‌ను, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను కోర‌డం జ‌రిగింది. ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ప్పుడు గ‌త వారానిక‌న్నా 10శాతం ఎక్కువ ఉన్న లేదా ఆసుప‌త్రుల‌లో 60శాతానిక‌న్నా ఎక్కువ ప‌డ‌క‌లలో రోగులు ఉన్న జిల్లాల‌ను గుర్తించాల‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 25.04.2021న జారీ చేసిన సూచ‌న‌ల‌లో రాష్ట్రాల‌ను, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను కోరింది. పైన పేర్కొన్న రెండు ల‌క్ష‌ణాల‌లో ఏది ఉన్నా ఆ జిల్లాల‌లో తీవ్ర‌మైన నియంత్ర‌ణచ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొంది.  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ ప్ర‌భావ‌వంత‌మైన నియంత్ర‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని 26.04.2021న - 27.05.2021న  హోం మంత్రిత్వ శాఖ త‌న లేఖ‌ల‌లో కోరింది. కోవిడ్‌-19 నిర్వ‌హ‌ణ కోసం ద‌శ‌ల వారీ ఆంక్ష‌లు/ స‌డ‌లింపు చ‌ర్య‌లు అమ‌లు చేయ‌డానికి మార్గ‌ద‌ర్శ‌క సూత్రాలుగా రాష్ట్రాలు /  కేంద్ర పాలిత ప్రాంతాల కోసం 28.06.2021 నాటి ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ చ‌ట్రాన్ని ప్ర‌స్తావిస్తూ  వ్యాధి భారం, ఆరోగ్య సంర‌క్ష‌ణ మౌలిక స‌దుపాయాల‌పై ఒత్తిడి ఆధారంగా 29.06.2021న హోం మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ఇందుకు అద‌నంగా, ప్ర‌జ‌లు గుమిగూడే అవ‌కాశం ఉన్న ప్రాంతాల‌ను క్ర‌మ‌బ‌ద్ధం చేయాల‌ని, కోవిడ్ -19కి సంబంధించిన ఐదెంచ‌ల వ్యూహ‌మైన టెస్ట్ - ట్రాక్ - ట్రీట్‌- వాక్సినేష‌న్ - కోవిడ్‌కు త‌గిన ప్ర‌వ‌ర్త‌న‌కు క‌ట్టుడి ఉండటమ‌నే ప్ర‌భావవంత‌మైన నిర్వ‌హ‌ణ‌ను పాటించేలా చూడాల‌ని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను19.06.2021న29.06.2021న , 14.07.2021న  హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖ‌లలో  కోరింది.
త‌మ ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేసుకునేందుకు అన్ని రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక స‌హాయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తోంది. ఇండియా కోవిడ్‌-19 అత్య‌వ‌స‌ర స్పంద‌న‌, ఆరోగ్య వ్య‌వ‌స్థ సంసిద్ధ‌త ప్యాకేజీని కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించి ఏప్రిల్ 2020న రూ. 15000 కోట్ల‌ను ఈ ప్యాకేజీ కింద కోవిడ్ -19 ముప్పును ప‌సిగ‌ట్టి, స్పందించి, నివారించేందుకు అందించింది. త‌ర్వాత ఆర్థిక సంవ‌త్స‌రం 2021-2022కు గాను కోవిడ్‌-19 అత్య‌వ‌స‌ర స్పంద‌న‌, ఆరోగ్య వ్య‌వ‌స్థ సంసిద్ధ‌త ప్యాకేజీని, ఫేజ్ -IIను రూ. 23,123 కోట్లు ఇందులో కేంద్ర ప్ర‌భుత్వ వాటా రూ. 15,000 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ. 8,123 కోట్లు)కూడా ప్ర‌భుత్వం ఆమోదించింది.
ఇందుకు అద‌నంగా, ప్ర‌త్యేక ఏక‌మొత్తం పంపిణీగా, రాష్ట్ర విప‌త్తు స్పంద‌న నిధి (ఎస్‌డిఆర్ఎఫ్‌)ని కోవిడ్‌-19 నియంత్ర‌ణ చ‌ర్య‌ల కోసం ఉప‌యోగించేందుకు అనుమ‌తించింది. అయితే, ఆర్థిక సంవ‌త్స‌రం 2019-20కి 35% , ఆర్థిక సంవ‌త్స‌రం 2020-2021కి,  ఆర్థిక సంవ‌త్స‌రం 2021-2022కి 50%, మేర‌కు ఎస్‌డిఆర్ ఎఫ్ కు వ‌చ్చే వార్షిక కేటాయింపుల‌ను ఉప‌యోగించేందుకు అనుమ‌తించింది. 

***


(Release ID: 1737347) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Punjabi