ఆయుష్

కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఆయుష్ మందులపై పరిశోధన

Posted On: 20 JUL 2021 3:58PM by PIB Hyderabad

మహమ్మారి  రెండో వేవ్‌ నేపథ్యంలో ఆయుష్ -64 మరియు కబసురా కుడినీర్ వంటివి కొవిడ్‌ 19 చికిత్స కొసం పునర్నిర్మించబడ్డాయి. ఈ మందులు  లక్షణాలు లేని, తేలికపాటి మరియు మితమైన లక్షణాలున్న కొవిడ్-19 రోగులకు నయం చేయడంలో స్వతంత్రంగా / లేదా ప్రామాణిక సంరక్షణకు అనుబంధంగా ఉపయోగపడతాయని కనుగొన్న తరువాత అలాగే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (సిఎస్ఐఆర్ & డిబిటి), సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మరియు ప్రసిద్ధ శాస్త్రీయ సంస్థలు మరియు ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన అధ్యయనాల తర్వాత  ప్రభుత్వం కొవిడ్-19 చికిత్స కోసం ఆయుర్వేదం మరియు యోగా ఆధారంగా నేషనల్ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌ను భారతదేశం విడుదల చేసింది.

రాష్ట్రాలు / యుటిల లైసెన్సింగ్ అధికారులు / డ్రగ్ కంట్రోలర్లు తమ అధికార పరిధిలో ఆయుష్ -64 కోసం లైసెన్స్ పొందిన తయారీదారులను అనుమతించమని తెలపడమయింది. ఆయుష్ -64 యొక్క కొత్త సూచనను పునరావృతం చేయడానికి, లక్షణం లేని, తేలికపాటి నుండి మితమైన కొవిడ్-19 చికిత్సలో ఇప్పటికే ఉన్న సూచన (ల) కు ఇంకా, ఆయుష్ -64 తయారీకి లైసెన్సింగ్ / దరఖాస్తు ఆమోదం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు / యుటిల లైసెన్సింగ్ అధికారులను అభ్యర్థించారు.

కొవిడ్-19 యొక్క ప్రభావాలను తగ్గించడానికి / నిర్మూలించడానికి మంత్రిత్వ శాఖ ఈ క్రింది చర్యలను చేపట్టింది: -

i. ప్రొఫెసర్ భూషణ్ పట్వర్ధన్ అధ్యక్షతన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), బయోటెక్నాలజీ విభాగం (డిబిటి), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) ), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మరియు ఆయుష్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ప్రతినిధులు ఉన్నారు. ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టాస్క్ ఫోర్స్ నాలుగు వేర్వేరు అధ్యయనాల కోసం దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుండి నిపుణుల సమగ్ర సమీక్ష మరియు సంప్రదింపుల ప్రక్రియ ద్వారా రోగనిరోధక అధ్యయనాల కోసం క్లినికల్ రీసెర్చ్ ప్రోటోకాల్‌లను రూపొందించింది మరియు కొవిడ్-19 పాజిటివ్‌ కేసులలో యాడ్ ఆన్ జోక్యాలను రూపొందించింది. వాటిలో అశ్వగంధ, యష్తిమధు, గుడుచి + పిప్పాలి మరియు పాలీ హెర్బల్ సూత్రీకరణ (ఆయుష్ -64) వంటివి ఉన్నాయి.

ii. టాస్క్ ఫోర్స్ సిఫారసుల ఆధారంగా కొవిడ్-19 నివారణ కోసం ఆయుష్ సంబంధిత ఇంటర్ డిసిప్లినరీ అధ్యయనాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ పరిశోధనా సంస్థలు మరియు జాతీయ సంస్థల క్రింద దేశంలోని 152 కేంద్రాలలో ఆయుష్ విధానాలపై 126 పరిశోధన అధ్యయనాలు ప్రారంభించబడ్డాయి.

iii. కొవిడ్-19 నివారణలో పేటెంట్ & యాజమాన్య ఏఎస్‌యు &హెచ్‌ ఔషధాలు/ సాంప్రదాయ  ఏఎస్‌యు &హెచ్‌ ఔషధాలపై రాష్ట్ర లైసెన్సింగ్ అధికారులు / వ్యక్తులు పంపిన దరఖాస్తులు / దావాల పరిశీలన కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇంటర్ డిసిప్లినరీ టెక్నికల్ రివ్యూ కమిటీ (ఐటిఆర్‌సి) ను ఏర్పాటు చేసింది.

ఈ సమాచారాన్ని ఆయుష్‌శాఖ సహాయమంత్రి శ్రీ మహేంద్రభాయ్ ముంజపారా ఈ రోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***



(Release ID: 1737346) Visitor Counter : 155


Read this release in: English , Hindi , Punjabi